పవన్ తో సినిమాపై బండ్ల గణేష్ క్లారిటీ

Bandla Ganesh Clarifies About Pawan Kalyan Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Pawan Kalyan Upcoming Film News,Bandla Ganesh About Power Star Pawan Kalyan Films,Bandla Ganesh Statement on Pawan Kalyan Movie,Bandla Ganesh Plans To Make a Film With Pawan Kalyan
Bandla Ganesh Clarifies About Pawan Kalyan Movie

పూర్తిగా రాజకీయాలకే తన జీవతం అంకితం చేశానని.. కడ శ్వాస దాకా రాజకీయాల్లోనే ఉంటానని.. సినిమాలు చేయనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు చెప్పినా కూడా మళ్లీ ఆయన సినిమాల్లో రీఎంట్రీపై వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే గత రెండు మూడు రోజులుగా ఓ వార్త ఫిలిం ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. బండ్ల గణేష్ నిర్మాతగా.. బోయపాటి దర్శకత్వంలో పవన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతున్నట్టు రూమర్లు హల్ చల్ చేశాయి. అంతేకాదు రెమ్యూనరేషన్ కు సంబంధించిన వివరాలు కూడా పెట్టేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఇప్పుడు ఈ రూమర్లపై క్లారిటీ వచ్చేసింది. దీనిపై బండ్ల గణేశ్ తన ట్విట్టర్ ద్వారా స్పందించి క్లారిటీ ఇచ్చారు. పవన్ తో తాను సినిమా చేస్తున్నట్టు వచ్చిన వార్తలు నిజం కాదని.. తన బ్యానర్ లో ఏ సినిమా కూడా ఇంతవరకూ ఫైనలైజ్ కాలేదన్నారు. ఏదైనా సినిమా ఉంటే మొట్టమొదట అనౌన్స్ చేసేది తానేనని అన్నారు. మరి ఇంత క్లియర్ గా క్లారిటీ ఇచ్చిన తరువాత ఈ రూమర్లకు బ్రేక్ పడుతుందేమో చూద్దాం…

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =