టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున న‌ట‌నాప్ర‌స్థానానికి 33 ఏళ్ళు

33 Years For Nagarjuna In TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Nagarjuna Completes 33 Years in Film Industry,Akkineni Nagarjuna SuccessFul Journey in TFI,Nagarjuna Turns 33 Years in Telugu Film Industry,Film Journey of EverGreen Hero Nagarjuna
33 Years For Nagarjuna In TFI

అక్కినేని నాగార్జున‌… తెలుగు తెర మ‌న్మథుడు. మ‌హాన‌టుడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు న‌ట‌వార‌సుడుగా తెరంగేట్రం చేసినా… అన‌తి కాలంలోనే క‌థానాయ‌కుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగ్‌. క్లాస్‌, మాస్ అనే తేడా లేకుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల అభిమానాన్ని త‌న అభిన‌య స‌మేతంగా సంపాదించుకున్నారాయ‌న‌. అలాగే ప్ర‌యోగాల‌కు చిరునామాగా నిలుస్తూ… ప‌లువురు కొత్త ద‌ర్శ‌కుల‌కు తొలి అవ‌కాశాలిచ్చి ప్రోత్స‌హించిన వైనం నాగ్ సొంతం. కేవ‌లం తెలుగు చిత్రాల‌కే ప‌రిమితం కాకుండా త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ సినిమాలు చేసి అన్య‌భాషా ప్రేక్ష‌కుల‌ను కూడా మురిపించారు. అలాగే రొమాంటిక్‌, యాక్ష‌న్‌, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌, డివోష‌న‌ల్‌… ఇలా ప‌లు జాన‌ర్ సినిమాల్లో వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల్లో క‌నిపించి మెప్పించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలాంటి నాగార్జున… హీరోగా న‌టించిన మొద‌టి సినిమా ‘విక్ర‌మ్‌’. అల‌నాటి మేటి ద‌ర్శ‌కుడు వి.మ‌ధుసూధ‌న‌రావు తెర‌కెక్కించిన ఈ చిత్రంలో శోభ‌న హీరోయిన్‌గా న‌టించింది. హిందీనాట విజ‌యం సాధించిన‌ హీరో ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమా… మే 23, 1986న విడుద‌లైంది. అంటే… నాగార్జున న‌టనాప్ర‌స్థానానికి నేటితో 33 వ‌సంతాలు పూర్త‌వుతున్నాయ‌న్న‌మాట‌.

విశేష‌మేమిటంటే.. త‌న తొలి చిత్రం రిలీజైన‌ తేదినే… త‌న తండ్రి నాగేశ్వ‌ర‌రావు న‌టించిన‌ ఆఖ‌రి చిత్రం ‘మ‌నం’ (2014) కూడా విడుద‌లై ఘ‌న‌విజ‌యం సాధించింది. ప‌లు విజ‌యంత‌మైన చిత్రాల‌తో అల‌రించిన నాగ్‌… ప్ర‌స్తుతం మ‌న్మ‌థుడు సీక్వెల్ మ‌న్మ‌థుడు 2లో హీరోగా న‌టిస్తున్నారు. ఈ చిత్రం కూడా ఘ‌న‌విజ‌యం సాధించాల‌ని… అలాగే మున్ముందు మ‌రిన్ని వైవిధ్య‌మైన పాత్ర‌ల్లో నాగ్ అల‌రించాల‌ని ద‌ తెలుగు ఫిల్మ్ న‌గ‌ర్.కామ్‌ ఈ సంద‌ర్భంగా ఆశిస్తోంది.

[subscribe]

[youtube_video videoid=rdma778BpC0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =