సంక్రాంతి… తెలుగు వారికే కాదు తెలుగు సినీ పరిశ్రమకు కూడా పెద్ద పండగ. అందుకే ఈ పండగ సమయంలో తమ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక 2020 సంక్రాంతి టార్గెట్‌గా… నాలుగు ఆసక్తికరమైన చిత్రాలు తెరపైకి రానున్నాయని ఇప్పటికే వార్తలు వస్తుండగా… ఇప్పుడు ఈ జాబితాలోకి మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేరనుందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిలిమ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2020 సంక్రాంతికి విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు టాక్.
ఇప్పటికే నందమూరి బాలకృష్ణ – కె.ఎస్.రవికుమార్ చిత్రం, సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కనున్న సినిమా, మెగాహీరో సాయితేజ్ – మారుతి కాంబినేషన్‌లో రూపొందనున్న మూవీ, సూపర్ స్టార్ రజినీకాంత్ – పాన్ ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘దర్బార్’… పొంగల్‌ని టార్గెట్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో… ఐదో చిత్రంగా బన్నీ, త్రివిక్రమ్ మూవీ కూడా రానుండడం ఆసక్తిని రేకెత్తించేదే.మరి… చివరాఖరికి ఈ 5 చిత్రాల్లో ఏవి సంక్రాంతికి సందడి చేస్తాయో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=lS5CrgkciTo]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: