‘డియ‌ర్ కామ్రేడ్‌’కి విజ‌య్ దేవ‌ర‌కొండ‌ సెంటిమెంట్‌

Will The Same Sentiment Work For Vijay Deverakonda Dear Comrade?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News, Dear Comrade - Same Sentiment Work For Vijay Deverakonda,Vijay Deverakonda Dear Comrade Movie Latest Updates,Dear Comrade Movie News,Vijay Deverakonda Repeat That Sentiment in Dear Comrade Movie
Will The Same Sentiment Work For Vijay Deverakonda Dear Comrade?

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, కన్నడ బ్యూటీ రష్మిక మందన్న జంటగా న‌టించిన‌ చిత్రం ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకుడిగా పరిచయం కానున్న ఈ చిత్రాన్ని… హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఈ సినిమాని ముందుగా మే 31న విడుదల చేయాలని భావించారు. అయితే… కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల జూలై 26కి ఈ క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా ప‌డింది. ఓ విధంగా… ఈ వాయిదా సినిమాకి క‌లిసొచ్చే అంశ‌మ‌నే చెప్పాలి. ఎందుకంటే… జూలై నెల‌కు, విజయ్ దేవ‌ర‌కొండ‌ కెరీర్‌కు మంచి అనుబంధమే ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవ‌ర‌కొండ సోలో హీరోగా నటించిన తొలి చిత్రం ‘పెళ్లి చూపులు’. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా 2016 జూలై ఆఖరి వారంలో (జూలై 29న) విడుదలై… హీరోగా విజయ్‌కు తొలి విజయాన్ని అందించింది. క‌ట్ చేస్తే… హీరోగా తన కెరీర్‌ను మ‌లుపు తిప్పిన జూలై ఆఖరి వారంలోనే ఇప్పుడు మరోసారి ‘డియర్ కామ్రేడ్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విజ‌య్‌.

ఇక్కడ ఆసక్తికరమైన అంశమేమిటంటే… ‘పెళ్లిచూపులు’ తరుణ్ భాస్కర్‌కి ద‌ర్శ‌కుడిగా డెబ్యూ ఫిల్మ్ కాగా… ‘డియర్ కామ్రేడ్’తో భరత్ కమ్మ దర్శకుడిగా తొలి అడుగులు వేస్తున్నాడు. అలాగే… ‘పెళ్లిచూపులు’ వివేక్ సాగర్‌కి సంగీత ద‌ర్శ‌కుడిగా ఫ‌స్ట్ ఫిల్మ్ కాగా… ‘డియర్ కామ్రేడ్’తో జస్టిన్ ప్రభాకరన్ సంగీత ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌కి ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

మొత్తానికి… త‌న‌కి అచ్చొచ్చిన జూలై ఆఖరి వారంలో ‘డియర్ కామ్రేడ్’ విడుదల కానుండ‌డం… ‘పెళ్లి చూపులు’ లాగే ‘డియర్ కామ్రేడ్’తోనూ దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ పరిచయం కానుండ‌డం చూస్తుంటే… ‘డియర్ కామ్రేడ్’తో విజయ్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేట్టుగా క‌నిపిస్తున్నాడు. చూద్దాం… ఏం జ‌రుగుతుందో?

[subscribe]
[youtube_video videoid=oCkql0KCpB0]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 11 =