‘దిల్’ రాజు ఆ ఫీట్‌ రిపీట్ చేయ‌నున్నాడా?

Producer Dil Raju To Have A Successful Year Again,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Dil Raju Repeat His Successful Year in 2019,Producer Dil Raju New Movie Details,Producer Dil Raju Hopes on 2019 Telugu Movies,Dil Raju Repeat His Successful Film Journey Sentiment
Producer Dil Raju To Have A Successful Year Again

స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్ దిల్‌ రాజుకి 2017వ సంవ‌త్స‌రం ఎంతో ప్ర‌త్యేకం. ఎందుకంటే… శతమానం భవతి, ‘నేను లోకల్’, ‘దువ్వాడ జగన్నాథం’, ‘ఫిదా’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎంసీఏ’… ఇలా ఒకే క్యాలెండర్‌ ఇయర్‌లో ఆరు సినిమాలను నిర్మించ‌డ‌మే కాకుండా… ఆ యా చిత్రాల‌తో వ‌రుస విజ‌యాల‌ను అందుకున్నారాయ‌న‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కట్ చేస్తే… 2017లో సాధించిన ఆ ఫీట్‌ను మళ్ళీ 2019లో కూడా దిల్‌ రాజు రిపీట్ చేసే అవ‌కాశం క‌నిపిస్తోందంటున్నారు ప‌రిశీల‌కులు. ఆ వివ‌రాల్లోకి వెళితే… ఇప్పటికే ఈ సంవ‌త్స‌రం ‘ఎఫ్ 2’, ‘మహర్షి’ చిత్రాలతో రెండు ఘ‌న విజయాలను తన ఖాతాలో వేసుకున్న సదరు నిర్మాత… ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘96’ రీమేక్‌, ‘ఇద్దరి లోకం ఒకటే’, ‘వి’ చిత్రాలను విడుద‌ల చేయ‌నున్నారు. అలాగే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వి.వినాయక్ ప్ర‌ధాన పాత్ర‌లో ఎన్.నరసింహారావు డైరెక్షన్‌లో నిర్మించ‌నున్న‌ కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ ఫిల్మ్ ను కూడా ఇదే ఏడాదిలో విడుదల చేసే అవ‌కాశ‌ముంద‌ని స‌మాచారం.

మొత్తానికి… 2017 ఫీట్‌ను 2019లోనూ రిపీట్ చేయ‌నున్న‌ ‘దిల్’ రాజుకు… 2017 నాటి మ్యాజిక్ 2019లోనూ పునరావృతం కావాల‌ని ఆశిద్దాం.

[subscribe]
[youtube_video videoid=KTv2s5ZwKoQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × one =