కృష్ణ ‘టక్కరిదొంగ చక్కనిచుక్క’కు 50 ఏళ్ళు

Krishna Takkari Donga Chakkani Chukka Completes 50 Years,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Takkari Donga Chakkani Chukka Movie Turns 50 Years,50 Years For Takkari Donga Chakkani Chukka Movie,Krishna Takkari Donga Chakkani Chukka Movie Latest Updates
Krishna Takkari Donga Chakkani Chukka Completes 50 Years

సూపర్ స్టార్ కృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెష‌లిస్ట్‌ కె.ఎస్.ఆర్.దాస్‌ది సూప‌ర్ కాంబినేష‌న్‌. ముఖ్యంగా… 70, 80వ దశకాలలో ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు యాక్షన్ మూవీస్ అందించ‌డంతో పాటు… కౌబాయ్ ఫిలిమ్స్‌ను కూడా పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేసిన కాంబినేషన్ వీరిది. ఇంకా చెప్పాలంటే… తెలుగు ప్రేక్షకులకు అసలు సిసలైన యాక్షన్ మూవీస్‌ను పరిచయం చేసి కొత్త ఒరవడిని తీసుకొచ్చిందీ ద్వ‌యం. అందుకే… వీరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ముందు వరుసలో ఉండే చిత్రం ‘టక్కరిదొంగ చక్కనిచుక్క’.

కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో విజయనిర్మల కథానాయికగా నటించారు. కాంతారావు, రాజనాల, రాజబాబు, సత్యనారాయణ, ధూళిపాల, త్యాగ‌రాజు, విజయలలిత తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. సత్యం స్వరపరచిన పాటలన్నీ అప్పట్లో విశేషాద‌ర‌ణ పొందాయి. ముఖ్యంగా… “నడకలు చూస్తే”, “ఓ కలలుగనే అమ్మాయి” పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఈ చిత్రాన్ని రవిచిత్ర ఫిల్మ్స్ ప‌తాకంపై వై.వి.రావు నిర్మించారు. 1969 మే 16న విడుదలై ఘన విజయం సాధించిన ‘టక్కరిదొంగ చక్కనిచుక్క’… నేటితో 50 వసంతాలను పూర్తి చేసుకుంది.

టక్కరిదొంగ చక్కనిచుక్క’ – కొన్ని విశేషాలు:
*కృష్ణ, కె.ఎస్.ఆర్ దాస్ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రమిదే. ఆ తర్వాత ఈ కలయికలో మొత్తం 32 సినిమాలు రూపొందాయి.

*కృష్ణ ద్విపాత్రాభినయం పోషించిన ఫస్ట్ మూవీ ‘టక్కరిదొంగ చక్కనిచుక్క’. అనంతరం కృష్ణ దాదాపు 18 చిత్రాల్లో డ్యూయల్ రోల్ చేసారు.

*కృష్ణ, సంగీత దర్శకుడు సత్యం కలయికలో వచ్చిన మొదటి సినిమా కూడా ఇదే.

*కృష్ణ కెరీర్‌లో 1969 ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే… ఇదే ఏడాది …‘మహాబలుడు’(18.04.1969), ‘శభాష్ సత్యం’(19.04.1969) చిత్రాలు ఒక రోజు గ్యాప్‌లో వెంట‌వెంట‌నే విడుద‌లయ్యాయి. క‌ట్ చేస్తే… నెల‌రోజుల గ్యాప్‌లో ‘ఆస్తులు అంతస్తులు’ (15.05.1969), ‘టక్కరి దొంగ చక్కని చుక్క’(16.05.1969) చిత్రాలతో మరోసారి ఆ ఫీట్‌ను సాధించారు సూపర్ స్టార్. మరో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… ఈ నాలుగు చిత్రాలూ ఘన విజయం సాధించాయి. అంతేకాదు… ఇవ‌న్నీ వరుసగా విడుదలైన చిత్రాలు కావడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here