వాల్మీకి మూవీ లో వరుణ్ తేజ్ లుక్

Varun Tej Valmiki Look,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Varun Tej First Look From Valmiki Movie,Varun Tej New Look From Valmiki,Valmiki Movie Latest Updates,Varun Tej New Movie Look,#Valmiki
Varun Tej Valmiki Look

14రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న వాల్మీకి మూవీ షూటింగ్ 18 వ తేదీ ప్రారంభమయింది. మొదటి రోజు షూటింగ్ లో వరుణ్ తేజ్ పై కొన్ని సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. వాల్మీకి మూవీ తమిళ హిట్ మూవీ జిగర్తాండ కు తెలుగు రీమేక్. ఈ మూవీ లో వరుణ్ తేజ్ పాత్రకు నెగెటివ్ షేడ్స్ ఉంటాయని సమాచారం. తమిళ హీరో అధర్వ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

విభిన్న కథల చిత్రాలు ఎంపిక చేసుకుని ప్రత్యేక గుర్తింపును పొందిన వరుణ్ తేజ్ వాల్మీకి మొదటి రోజు షూటింగ్ లో పాల్గొన్న గెటప్ గుబురు గెడ్డం, చెవిపోగు తో ఉన్న లుక్ ను, సరికొత్త బాటలో వాల్మీకి అంటూ ట్విట్టర్ లో షేర్ చేశారు. వాల్మీకి స్వాగతం, మొదటి రోజు షూటింగ్ అద్భుతం గా జరిగిందని, ఇది ఇలాగే సాగాలని ఎదురు చూస్తున్నా అంటూ దర్శకుడు హరీష్ శంకర్ ట్వీట్ చేశారు . వాల్మీకి మూవీ లోని హీరో వరుణ్ తేజ్ లుక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]


[youtube_video videoid=t-SWlHFaFUk]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 11 =