నిన్న ఏప్రిల్ 9…. మెగాస్టార్ చిరంజీవి నటించిన రెండు చిత్రాలు ఘరానా మొగుడు( 9/ 4/ 1992), బావగారు బాగున్నారా?(9/4/1998) విడుదలైన రోజు. ఆ రెండు హిట్స్ లో మీకు నచ్చిన హిట్ ఏది? అని నిన్న సరదాగా ఆడుకున్న పోల్ గేమ్ లో మీ పార్టిసిపేషన్ బాగుంది. ఈరోజు అలాంటిదే మరో సూపర్ స్టార్ మీద మరో సరదా పోల్ గేమ్ ఆడుకుందాం.
ఆ సూపర్ స్టార్ రజినీకాంత్ కాగా ఆయన నటించిన రెండు చిత్రాలు ఒకే రోజు అంటే ఏప్రిల్ 10 న విడుదలై సూపర్ హిట్ అయ్యాయి. అవి అరుణాచలం- నరసింహ చిత్రాలు. సుందర్ .సి. దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన “అరుణాచలం” చిత్రం 1997 ఏప్రిల్ 10న విడుదలైంది. దేవా సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సౌందర్య, రంభ హీరోయిన్లు. కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన” నరసింహ” 1999 ఏప్రిల్ 10న విడుదలైంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. ఇందులో రజనీకాంత్ సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించారు. ఈ రెండు చిత్రాలలో సౌందర్య హీరోయిన్ కావడం కామన్ పాయింట్. రజనీకాంత్ సరసన సౌందర్య నటించిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావటం విశేషం. వాస్తవానికి రజినీకాంత్ నాలుగు దశాబ్దాలుగా తమిళ, హిందీ, తెలుగు భాషల్లో మోస్ట్ పాపులర్ హీరో అయినప్పటికీ “రజనీ మేనియా” ప్రారంభమైంది మాత్రం” భాషా” చిత్రంతో అనే చెప్పాలి. భాషా తరువాత ముత్తు , పెదరాయుడు, అరుణాచలం, నరసింహ, బాబా, చంద్రముఖి, శివాజీ, రోబో వంటి చిత్రాలతో రజనీకాంత్ స్టార్ డమ్ అంబరాన్ని చుంబించింది.
అదలా ఉంచితే ఒకే రోజు విడుదలై సూపర్ హిట్ అయిన “అరుణాచలం, నరసింహ” చిత్రాలలో ఏది బెస్ట్? అని తేల్చుకునే సరదా పోల్ గేమ్ కు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీ” దతెలుగుఫిలింనగర్.కాం”.
తెలుగు రాష్ట్రాల భవిష్యత్తును నిర్ధారించే అసలు పోలింగ్ రేపు ఉంది కాబట్టి ఈరోజు సరదాగా ఈ పోల్ గేమ్ లో పార్టిసిపేట్ చేయండి..
Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.
[youtube_video videoid=cmMg1MoypTI]