
ట్యాగ్ · 9 కథనాలు

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'టక్ జగదీష్'
"టక్ జగదీష్ "మూవీ అప్ డేట్

`టక్ జగదీష్` షూటింగ్ అప్ డేట్

పొల్లాచ్చి లో "టక్ జగదీష్"

అలనాటి హిట్ చిత్రం ఆధారంగా `టక్ జగదీష్`?
టక్ జగదీష్ కోసం రంగంలోకి థమన్..!

టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్

#NANI 26 మూవీ టైటిల్ "టక్ జగదీష్ "

ఇకపై రీమేక్ లు చేయాలనుకోవడం లేదు...!
గత కొంత కాలంగా తెలుగు సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే కదా. మన సినిమాలను చాలా మంది రీమేక్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు ఇప్పుడు. ఇక ఇప్పుడు ఇదే విషయాన్ని చెబుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఎన్నో రోజులుగా నాని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టక్ జగదీష్ సినిమా రేపు రిలీజ్ అవుతుంది. మొదట ఈసినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తారు అనుకున్నారు కానీ చాలా రోజులు సస్పెన్స్ లో ఉంచి ఆ తరువాత ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక ఈసినిమా డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో ఈసినిమా రేపు స్ట్రీమింగ్ కానుంది.
రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'టక్ జగదీష్'
‘నిన్నుకోరి` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'టక్ జగదీష్'. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేసిన `టక్ జగదీష్ ఫస్ట్‌లుక్`కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో జగదీష్ నాయుడు అనే పాత్రలో కనిపించి సందడి చేయనున్నాడు నాని.
"టక్ జగదీష్ "మూవీ అప్ డేట్
సూపర్ హిట్ "నిన్నుకోరి ", "మజిలీ " మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నాని హీరోగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ , ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రాజమండ్రి , పొల్లాచ్చి లలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన "టక్ జగదీష్ "మూవీ షూటింగ్ కరోనా మహమ్మారి కారణంగా నిలిచిపోయింది .

`టక్ జగదీష్` షూటింగ్ అప్ డేట్
`నిన్ను కోరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా `టక్ జగదీష్`. రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేష్ నాయికలుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో జగపతి బాబు ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థమన్ బాణీలు అందిస్తున్నాడు.

పొల్లాచ్చి లో "టక్ జగదీష్"
షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడి గా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ జనవరి లో పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన "నిన్నుకోరి" మూవీ ఘనవిజయం సాధించింది.

అలనాటి హిట్ చిత్రం ఆధారంగా `టక్ జగదీష్`?
`నిన్ను కోరి`, `మజిలీ` రూపంలో రెండు వరుస విజయాలను అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ.. ఇప్పుడు తన తదుపరి సినిమాని నేచురల్ స్టార్ నానితో రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. `టక్ జగదీష్` పేరుతో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
టక్ జగదీష్ కోసం రంగంలోకి థమన్..!
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

టాలీవుడ్ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్
సక్సెస్ ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎస్ రీసెంట్ గా సంగీతం అందించిన "వెంకీ మామ", "ప్రతి రోజూ పండగే" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందిన "అల .. వైకుంఠపురములో .. "మూవీ కి థమన్ స్వరపరిచిన సాంగ్స్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. మాస్ మహా రాజా రవితేజ హీరోగా రూపొందిన "డిస్కో రాజా"మూవీ కి థమన్ స్వరపరిచిన సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "డిస్కో రాజా"మూవీ24 వ తేదీ రిలీజ్ కానుంది.

#NANI 26 మూవీ టైటిల్ "టక్ జగదీష్ "
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా #NANI 26 మూవీ గా రూపొందనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ ని "టక్ జగదీష్ " టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణ సారథ్యం లో రూపొందనున్న "టక్ జగదీష్ " మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.