కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Tollywood Movie Updates

ట్యాగ్ · 19105 కథనాలు · పేజీ 110

Kannappa Avram Manchu First Look Released on Eve of Krishna Janmashtami
ఫస్ట్ లుక్

కన్నప్ప.. అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.

Srikanth Mవాట్సాప్
Janaka Aithe Ganaka USA Rights Acquired by Hero Suhas
సినిమా వార్తలు

జనక అయితే గనక.. హీరో చేతికి యుఎస్‌ఏ రైట్స్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న సినిమా 'జనక అయితే గనక'. శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. అంబాబీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్న వదనం సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ట్యాలెంటెడ్ అండ్ వెర్సటైల్‌ యాక్టర్‌ సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. సందీప్‌ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. సెప్టెంబర్‌ 7న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Priyadarshi and Mohanakrishna Indraganti's New Film Titled Sarangapani Jathakam
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్‌గా ప్రియదర్శి కొత్త సినిమా టైటిల్

శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో ఇదివరకే 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' లాంటి చక్కటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా వాళ్లిద్దరి కలయికలో యంగ్ హీరో ప్రియదర్శి కథానాయకుడిగా మరో చిత్రం తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు 'సారంగపాణి జాతకం' అనే టైటిల్ ఖరారు చేశారు.

Srikanth Mవాట్సాప్
35-Chinna Katha Kaadu Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

35-చిన్న కథ కాదు.. రిలీజ్ డేట్ ఫిక్స్

మలయాళ ముద్దుగుమ్మ నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్‌లో నటించిన న్యూ ఏజ్ క్లీన్ ఎంటర్‌టైనర్ '35-చిన్న కథ కాదు'. క్లీన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి నంద కిషోర్ ఈమని రచన, దర్శకత్వం వహిస్తున్నాడు. సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ వాల్టెయిర్ ప్రొడక్షన్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపధ్యంలో రుప్పొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Director Nag Ashwin Responds Over Arshad Warsi Comments on Prabhas
సినిమా వార్తలు

ప్ర‌భాస్‌పై అర్షద్ వార్సి కామెంట్స్‌పై నాగ్ అశ్విన్ రియాక్షన్ ఇదే

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్ర‌భాస్‌పై బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సి చేసిన వివాదాస్పద కామెంట్స్‌పై కల్కి 2898 AD డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పందించారు. ప్రభాస్ హీరోగా, ఆయన దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘కల్కి 2898 AD’ సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇక ఇటీవలే ఈ చిత్రం ఓటీటీ లోకి కూడా వచ్చేసింది.

Srikanth Mవాట్సాప్
Saripodhaa Sanivaaram bookings are now open worldwide
సినిమా వార్తలు

సరిపోదా శనివారం బుకింగ్స్ ఓపెన్

బ్యాక్ టు బ్యాక్ హిట్ల తరువాత హ్యాట్రిక్ కొట్టడానికి సరిపోదా శనివారంతో వస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని.మరో 5రోజుల్లో ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం నాని అన్నీ తానై సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నాడు.ఇక ఈసినిమా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.దాదాపు అన్ని ఏరియాల్లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.అటు నార్త్ అమెరికా లో అడ్వాన్స్ సేల్స్ 150k దాటాయి.

Mahender Reddyవాట్సాప్
Committee Kurrollu Collections Hikes Day by Day After Releasing 2 Weeks
బాక్సాఫీస్

కమిటీ కుర్రోళ్ళు.. మూడో వారంలో మరింత పెరిగిన కలెక్ష‌న్స్‌

డిఫ‌రెంట్ కంటెంట్ చిత్రాల‌కు ప్రేక్ష‌కాద‌ర‌ణ ఎప్పుడూ ఉంటుంద‌ని తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రంతో నిరూపించారు. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను తెలుగు సినిమాకు ప‌రిచ‌యం చేస్తూ మేక‌ర్స్ చేసిన ఈ ప్ర‌య‌త్నానికి ప్రేక్ష‌కుల నుంచి అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఆడియెన్స్‌, విమ‌ర్శ‌కుల‌తో పాటు సినీ సెల‌బ్రిటీ నుంచి అభినంద‌న‌లు అందుకుంటూ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర జోరు చూపిస్తోంది. ఇప్ప‌టికే సినిమా అన్నీ ఏరియాస్‌లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం రూ.15.6 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను సాధించ‌టం విశేషం.

Srikanth Mవాట్సాప్
Hero Nani Visits Tirumala With Family Ahead of Saripodhaa Sanivaaram Release
సినిమా వార్తలు

ఫ్యామిలీతో కలిసి కాలినడకన తిరుమలకు నాని

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' సినిమా ఈనెల 29న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఆయన శ్రీవారి ఆశీస్సులు కోరుతూ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ మేరకు హీరో నాని కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి అంజన, తనయుడు అర్జున్‌ మరియు సరిపోదా శనివారం సినిమాలో హీరోయిన్‌గా నటించిన ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Aay Has Fetched Me A Good Name, Says Music Director Ajay Arasada
సినిమా వార్తలు

ఆయ్‌ వల్ల నాకు ఎక్కువ ఎక్స్‌పోజర్‌ వచ్చింది

సంగీత దర్శకుడిగా అన్ని జోనర్‌ సినిమాలు చేయాలని వుంది. చిన్నప్పటి నుంచి కమర్షియల్‌ సినిమాలు చూస్తూ పెరిగాను. కమర్షియల్‌ సినిమాలకు సంగీతం అందించాలనేది నా కోరిక. సంగీతాన్ని ట్రెండీగా.. కమర్షియల్‌గా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇటీవల విడుదలైన 'ఆయ్‌' సినిమా నాకు సంగీత దర్శకుడిగా మంచి పేరును తీసుకొచ్చింది' అన్నారు సంగీత దర్శకుడు అజయ్‌ అరసాడ. నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించగా అంజి కే. మణిపుత్ర దర్శకత్వంలో ఆయ్ తెరకెక్కింది.

Srikanth Mవాట్సాప్
Thangalaan Screening in 141 Extra Theatres in Second Week
సినిమా వార్తలు

తంగలాన్.. సెకండ్ వీక్‌లో పెరిగిన స్క్రీనింగ్స్

ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన పెద్ద సినిమాలలో 'తంగలాన్' ఒకటి. భారీ నిర్మాణ విలువలు, చియాన్ విక్రమ్ అద్భుత నటనతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. దర్శకుడు పా రంజిత్ మరోసారి తన వెండితెర మాయాజాలం చేశాడు. ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీ ఈ నెల 15న థియేటర్స్‌ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్ని సెంటర్స్ నుంచి సక్సెస్‌ఫుల్‌ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

Srikanth Mవాట్సాప్
matka shooting update
షూటింగ్ అప్‌డేట్

మట్కా షూటింగ్ అప్డేట్

మెగా హీరో వరుణ్ తేజ్,పలాస ఫేమ్ కరుణ కుమార్ కాంబోలో వస్తున్న చిత్రం మట్కా.1980 బ్యాక్ డ్రాప్ తో వస్తుంది.ఇందులో వరుణ్ డాన్ పాత్రలో కనిపించనున్నాడు.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ కాకినాడ లో జరుగుతుంది.ఈసందర్భంగా మేకర్స్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.వరుణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.

Mahender Reddyవాట్సాప్
Kannappa Avram Manchu First Look to be Released on Krishna Janmashtami
ఫస్ట్ లుక్

కన్నప్ప.. కృష్ణాష్టమి సందర్భంగా అవ్రామ్ మంచు ఫస్ట్ లుక్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. ప్రతీ సోమవారం కన్నప్ప నుంచి ఒక అప్డేట్ ఇస్తూ సినిమా మీద అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. సినిమాలోని కీలక పాత్రలకు సంబంధించిన పోస్టర్‌లను రిలీజ్ చేస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ సోమవారం నాడు స్పెషల్ కారెక్టర్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Revealed Saripodhaa Sanivaaram Run Time
సినిమా వార్తలు

సరిపోదా శనివారం రన్ టైమ్‌ ఎంతో చెప్పేసిన నాని

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
కమిటీ కురోళ్ళు 14డేస్ కలెక్షన్స్
బాక్సాఫీస్

కమిటీ కురోళ్ళు 14డేస్ కలెక్షన్స్

కంటెంట్ ఉంటే చాలు స్టార్ కాస్టింగ్ అవసరం లేదని మరోసారి నిరూపించింది కమిటీ కురోళ్ళు.చిన్న సినిమాగా వచ్చిన ఈచిత్రం మౌత్ టాక్ తో రోజు రోజుకి కలెక్షన్స్ ను పెంచుకుంటూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.నిన్నటి తో ఈసినిమా రెండు వారాల రన్ ను పూర్తి చేసుకుంది.ఇక రెండు వారాలకు గాను ప్రపంచ వ్యాప్తంగా 15.6కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.బ్రేక్ ఈవెన్ టార్గెట్ చిన్నది కావడం తో బయ్యర్లకు మంచి లాభాలను తీసుకొస్తుంది.ఇప్పుడు మూడో వారం లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమాకు థియేటర్ల సంఖ్య కూడా పెరిగింది. వచ్చే వారం వరకు పెద్ద సినిమా రిలీజ్ లేకపోవడంతో మంచి వసూళ్లను దక్కించుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
Raayan now streaming on Amazon Prime
ఓటీటీ

ఓటిటిలోకి రాయన్

తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ రాయన్ ఓటిటిలోకి వచ్చేసింది.ఈరోజు నుండి అమెజాన్ ప్రైమ్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇక గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈసినిమా 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సెన్సేషనల్ హిట్ అనిపించుకుంది.అంతేకాదు ఈఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన తమిళ సినిమాగా రికార్డు సృష్టించింది.ఇది తెలుగులోకూడా రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా డీసెంట్ వసూళ్లతో హిట్ అనిపించుకుంది.

Mahender Reddyవాట్సాప్
indra re release first day collections
బాక్సాఫీస్

ఇంద్ర రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్

తెలుగులో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతూనే వుంది.ముఖ్యంగా స్టార్ హీరోల బర్త్ డే లకు వారు నటించిన కల్ట్ సినిమాలను రీ రిలీజ్ చేయడం ఆనవాయితీగా మారింది.అందులో భాగంగా నిన్న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన బ్లాక్ బాస్టర్ మూవీ ఇంద్ర మళ్ళీ థియేటర్లలోకి వచ్చింది.ఇక ఈ రీ రిలీజ్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మొదటి రోజు ఈసినిమా 3.05 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ప్రకటించింది.దాంతో సీనియర్ హీరోల రీ రీలీజ్ సినిమాల్లో రికార్డు ఓపెనింగ్ పెట్టింది ఇంద్ర.

Mahender Reddyవాట్సాప్
IIFA Utsavam Awards 2024 Nominations From Kollywood
సినిమా వార్తలు

ఐఫా ఉత్సవం అవార్డ్స్.. కోలీవుడ్ నామినేషన్స్‌లో స్టార్ హీరో, హీరోయిన్స్

ఇండియన్ సౌత్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేదిక 'ఐఫా ఉత్సవం' (IIFA) వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ యేడాది తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం పరిశ్రమలకు చెందిన అత్యుత్తమ చిత్రాలకు అవార్డు ప్రెజెంటేషన్‌లు అందించనుంది. ఇక వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ గాలా కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశం సిద్ధమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Actress Megha Akash Engaged With Saai Vishnu
సినిమా వార్తలు

మేఘా ఆకాశ్‌ ఎంగేజ్‌మెంట్‌.. ఎవరితో అంటే..?

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ నటి మేఘా ఆకాశ్‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కీలకమైన అడుగువేశారు. ఓ వైపు నటిగా పలు సినిమాల్లో నటిస్తున్న ఆమె హఠాత్తుగా పెళ్ళికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిన్న తన ప్రియుడు సాయి విష్ణుతో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ మేరకు విషయాన్ని మేఘా ఆకాశ్‌ సోషల్ మీడియా వేదికగా స్వయంగా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఎంగేజ్‌మెంట్‌ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Srikanth Mవాట్సాప్
IIFA Utsavam Awards 2024 Nominations For Tollywood Movies
సినిమా వార్తలు

ఐఫా ఉత్సవం అవార్డ్స్.. నామినేషన్స్ దక్కించుకున్న తెలుగు చిత్రాలు

ఇండియన్ సౌత్ ఫిల్మ్ అవార్డులకు సంబంధించిన ప్రతిష్టాత్మక వేదిక 'ఐఫా ఉత్సవం' (IIFA) వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. ఈ యేడాది తెలుగు, తమిళం, కన్నడ మరియు మలయాళం పరిశ్రమలకు చెందిన అత్యుత్తమ చిత్రాలకు అవార్డు ప్రెజెంటేషన్‌లు అందించనుంది. ఇక వేడుకల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కూడిన గ్రాండ్ గాలా కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ (యూఏఈ) దేశం సిద్ధమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Producers DVV Danayya and AM Ratnam Meets Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్‌ని కలిసిన ఓజీ, హరిహర వీరమల్లు చిత్రాల ప్రొడ్యూసర్స్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్