
ట్యాగ్ · 320 కథనాలు · పేజీ 14


ట్రెండింగ్‌లో రష్మిక మందన్న 'థామా' ట్రైలర్

పూరి సేతుపతి టైటిల్ టీజర్ రానుంది

ఓజీ రికార్డు ఓపెనింగ్స్

అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్ ప్రోమో వచ్చేసింది

రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా - సుజీత్

ఓజీ సీక్వెల్‌లో అకీరా? సుజీత్ ఆన్సర్ ఇదే..!

నార్త్ అమెరికాలో ఓజీ రాంపేజ్

ఓజాస్ గంభీరకి మెగాస్టార్ అభినందనలు

ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో దుమ్మురేపిన ఓజీ

ఓజీ మేనియా.. థియేటర్లలో సందడి చేసిన స్టార్స్

రిషబ్ శెట్టి 24 క్రాఫ్ట్స్‌ని డామినేట్ చేయగలడు - ఎన్టీఆర్
కాంతారతో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతార: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ అన్ని భాషలలో హ్యుజ్ బజ్ క్రియేట్ అంచనాలను భారీగా పెంచింది.

జటాధర.. దసరా కానుకగా 'ధన పిశాచి' సాంగ్
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది.

రామ్ చరణ్ సినీప్రస్థానానికి 18 ఏళ్లు.. 'పెద్ది' నుంచి మాస్ పోస్టర్ రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీప్రస్థానంలో 18 ఏళ్ల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ప్రత్యేక సందర్భంలో తన కెరీర్‌లో ప్రతిష్టాత్మక పాత్రల్లో ఒకటిగా నిలిచే "పెద్ది"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం రగ్గడ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో అద్భుతమైన కథతో వుండబోతోంది.

‘సరస్వతి’తో డైరెక్టర్‌గా మారిన వరలక్ష్మి శరత్ కుమార్
ప్రతిభావంతురాలైన కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ తన కెరీర్‌లో కొత్త అడుగు వేసింది. తొలిసారి దర్శకురాలిగా పరిచయం అవుతున్న ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం “సరస్వతి”. ‘దోశ డైరీస్’ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్.

ట్రెండింగ్‌లో రష్మిక మందన్న 'థామా' ట్రైలర్
నేషనల్ క్రష్ రష్మిక మందన్న బాలీవుడ్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'థామా'. ఇందులో ఆమె ఆయుష్మాన్ ఖురానాతో కలిసి జత కట్టింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తూ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. హారర్, కామెడీ, రొమాన్స్ అంశాలు మేళవించిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ది ప్యారడైజ్ నుండి మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా “ది ప్యారడైజ్” నుంచి సీనియర్ యాక్టర్ కలెక్టర్ మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ ఈరోజు రిలీజ్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల రఫ్ & మాస్ టచ్‌తో మోహన్ బాబు లుక్‌ని డిజైన్ చేయడం ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంది.

కాంతార: చాప్టర్ 1 ప్రీ-రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్
'కాంతార'తో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ అందుకున్న రిషబ్ శెట్టి మోస్ట్ ఎవైటెడ్ ప్రీక్వెల్ కాంతారా: చాప్టర్ 1తో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన స్వయంగా దర్శకత్వం వహించి, నటించారు. ప్రఖ్యాత పాన్-ఇండియా నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 2న దసరాకు విడుదల కానుంది.

పూరి సేతుపతి టైటిల్ టీజర్ రానుంది
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా మూవీ పూరి -సేతుపతి (వర్కింగ్ టైటిల్). ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్ పిక్చర్స్ జెబి నారాయణ్ రావు కొండ్రోల్లా కొలాబరేషన్ లో పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్ సమర్పిస్తున్నారు.

ఓజీ రికార్డు ఓపెనింగ్స్
భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ పాజిటివ్ రివ్యూస్ రాబట్టుకోవడంతో మొదటి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ సొంతం చేసుకుంది.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా 154 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారకంగా ప్రకటించారు. దాంతో ఈసినిమా ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇంతకుముందు సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ 151 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా తాజాగా ఓజీ ఆ స్థానాన్ని ఆక్రమించింది. పవన్ కెరీర్ లో ఇదే మొదటి 100కోట్ల ఓపెనింగ్ మూవీ.అంతేకాదు ఓజీ పవన్ కెరీర్ హైయెస్ట్ గ్రాసర్ మూవీ గా ఘనత సాధించింది.

అనగనగా ఒక రాజు రిలీజ్ డేట్ ప్రోమో వచ్చేసింది
వరుసగా మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నెక్స్ట్ అనగనగా ఒక రాజు తో రానున్నాడు.పర్ఫెక్ట్ సంక్రాంతి ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈసినిమాపై పాజిటివ్ బజ్ వుంది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.ఈ సందర్బంగా ప్రోమో రిలీజ్ చేశారు. హీరో , హీరోయిన్ తో రిలీజ్ డేట్ చెప్పించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 14న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

రామ్ చరణ్ తో సినిమా అనుకున్నా - సుజీత్
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం డైరెక్టర్ సుజీత్ పేరు మారుమోగుతుంది.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా తెరకెక్కించడమే అందుకు కారణం. నిన్న విడుదలైన ఈసినిమా థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.ఇంతకుముందు పవన్ ఎవరు చూపించని విధంగా చూపించి పవన్ ఫ్యాన్స్ తో ప్రశంసలు అందుకుంటున్నాడు సుజీత్.

ఓజీ టైటిల్ మాది కాదు.. కానీ అడిగిన వెంటనే ఆయన ఇచ్చేశారు - నిర్మాత దానయ్య
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'ఓజీ'. యంగ్ డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్ చేసిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ కథానాయికగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, శ్రీయారెడ్డి, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

ఓజీ సీక్వెల్‌లో అకీరా? సుజీత్ ఆన్సర్ ఇదే..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా సీక్వెల్ గురించిన చర్చ మొదలైంది. ముఖ్యంగా, 'ఓజీ' సీక్వెల్‌లో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై దర్శకుడు సుజీత్ తాజాగా స్పందించారు.

నార్త్ అమెరికాలో ఓజీ రాంపేజ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ నిన్న భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి రాగ పాజిటివ్ రివ్యూస్ తో బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. ప్రీమియర్స్ తో కలుపుకొని మొదటి రోజు 100 కోట్లపైన ఓపెనింగ్స్ ను రాబట్టుకొని పవన్ కెరీర్ లో మొదటి రోజే హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.మొదటి రోజు కలెక్షన్స్ ను నిర్మాతలు అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ దాదాపు 140కోట్ల వరకు వసూళ్లను రాబట్టుకుందని టాక్.

ఓటీటీ లోకి రానున్న మదరాసి.. ఎక్కడ, ఎప్పుడంటే..?
'అమరన్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా చిత్రం మదరాసి. ప్రముఖ దర్శకుడు ఏఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటించగా.. విద్యుత్ జమ్వాల్ విలన్‌గా, బీజు మేనన్ కీలక పాత్రలో కనిపించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లతో మంచి హిట్ సాధించింది.

ఓటీటీ లోకి వచ్చేసిన ఘాటి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి నటించిన లేటెస్ట్ యాక్షన్-క్రైమ్ డ్రామా చిత్రం 'ఘాటి'. విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, అనుష్క అద్భుతమైన నటనకు క్రిష్ టేకింగ్ తోడై ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా తాజాగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టింది.

ఓజాస్ గంభీరకి మెగాస్టార్ అభినందనలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ డైరెక్షన్‌లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఓజీ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ రోజు థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి దీనిపై తన స్పందనను తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్‌పై చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ ఈ సందేశం పవర్‌స్టార్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

ఓజీ సీక్వెల్ కన్‌ఫర్మ్.. జోష్‌లో పవర్‌స్టార్ ఫ్యాన్స్
పవర్ స్టార్ అభిమానులకు కిక్కిచ్చే వార్త అందింది. పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ డైరెక్ట్ చేసిన ‘ఓజీ’ సినిమా నేడు విడుదలై థియేటర్లన్నీ ఇప్పటికే హౌస్‌ఫుల్ షోస్‌తో దద్దరిల్లుతున్నాయి. పవన్ పవర్‌ఫుల్ యాక్టింగ్, సుజీత్ టేకింగ్, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – ఇవన్నీ కలిసి ‘ఓజీ’ని ఈ ఏడాది భారీ బ్లాక్‌బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలబెట్టాయి. ఈ తరుణంలో ఆయన అభిమానులను మరింత ఉత్సాహపరిచే అప్డేట్ వచ్చింది!

ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో దుమ్మురేపిన ఓజీ
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన “ఓజీ” చిత్రం ఓపెనింగ్ రేంజ్‌లోనే కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు ఉత్తర అమెరికా ప్రీమియర్స్‌లో అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. తాజా సమాచారం ప్రకారం, **“ఓజీ” $3 మిలియన్‌కి పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి, టాలీవుడ్ సినిమాల్లో అరుదైన రికార్డుల్లో ఒకటిగా నిలిచింది.

ఓజీ మేనియా.. థియేటర్లలో సందడి చేసిన స్టార్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మచ్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ నేడు భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో థియేటర్లలో సత్తా చాటుతోంది. దీంతో ఆయా థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలంతో పండుగ వాతావరణం నెలకొంది. మరోవైపు పవర్ స్టార్ ఫ్యాన్స్‌తో పాటు పలువురు స్టార్ హీరోలు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.