
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 3


ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ లో శ్రీనాథ్ మాగంటి

విశాల్ 36వ సినిమా టైటిల్ ప్రోమో రిలీజ్

పెద్ది ఫస్ట్ హాఫ్ లాక్

పరాశక్తి సెన్సార్ కంప్లీట్

మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్ రిలీజ్

నేను రెడీ టీజర్ అప్డేట్

అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్

హాలీవుడ్ లెవెల్లో టాక్సిక్ గ్లింప్స్

జన నాయకుడు విడుదల వాయిదా

నారీ నారీ నడుమ మురారి సెన్సార్ కంప్లీట్

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రిలీజ్

కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఎస్. జానకి కుమారుడు అస్తమయం
దక్షిణాది సంగీత సరస్వతి, లెజెండరీ గాయని ఎస్. జానకి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఈరోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. ఈ వార్త తెలిసిన వెంటనే సినీ మరియు సంగీత లోకం దిగ్భ్రాంతికి గురైంది.

ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ లో శ్రీనాథ్ మాగంటి
'హిట్' ఫ్రాంచైజీ మరియు సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' సినిమాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ ప్రతిభావంతుడు శ్రీనాథ్ మాగంటి, ఇప్పుడు తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రాబోతున్న కల్ట్ క్లాసిక్ 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ (ENE 2) లో భాగమయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి. మొదటి భాగం తరహాలోనే ఈ సీక్వెల్ కూడా వాస్తవ జీవిత పరిస్థితులు మరియు స్నేహం చుట్టూ తిరిగే కథాంశంతో ఉండబోతోంది.

విశాల్ 36వ సినిమా టైటిల్ ప్రోమో రిలీజ్
తమిళ యాక్షన్ హీరో విశాల్ తన కెరీర్లో 36వ సినిమా అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హిట్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వంలో విశాల్ నటిస్తున్న ఈ సరికొత్త చిత్రానికి తెలుగులో 'మొగుడు' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్ర బృందం ప్రోమోను విడుదల చేసింది. విశాల్, సుందర్ సి కాంబినేషన్లో గతంలో వచ్చిన 'మగ మహారాజు', 'మదగజరాజా', 'యాక్షన్' సినిమాల తర్వాత వస్తున్న నాలుగవ చిత్రమిది కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మన శంకర వర ప్రసాద్ గారు విజయంపై స్పందించిన పవన్ కళ్యాణ్
మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేస్తోంది.ఇప్పటికే ఈసినిమా 300కోట్లకుపైగా వసూళ్లను రాబట్టి భారీ లాభాలను తీసుకొస్తుంది. ఇక ఈ సినిమా సాధిస్తున్న అద్భుతమైన విజయంపై పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారని నిర్మాత సుష్మిత కొణిదెల ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. .

పెద్ది ఫస్ట్ హాఫ్ లాక్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' శరవేగంగా ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ఎడిటింగ్ పనులను పూర్తి చేసి, ఫైనల్ లాక్ చేశారు.

పరాశక్తి సెన్సార్ కంప్లీట్
తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ కెరీర్లో 25వ మైలురాయిగా వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'పరాశక్తి' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. సుధ కొంగర దర్శకత్వంలో పీరియాడిక్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు 'U/A' సర్టిఫికేట్‌ను జారీ చేసింది. 1960ల నాటి హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో సాగే ఈ కథలో వివాదాస్పద అంశాలు ఉన్నాయనే కారణంతో సెన్సార్ బోర్డు తొలుత అనేక కత్తెర్లు (సుమారు 23 కంటే ఎక్కువ సీన్లు) సూచించింది. దాంతో నిన్నటి వరకు సినిమా చెప్పిన తేదికి విడుదలవుతుందాలేదనే అనుమానాలు రేకెత్తాయి.
ఆస్కార్ కు బరిలో కాంతార చాప్టర్ 1 , మహావతార్ నరసింహ
కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ మరో అరుదైన మైలురాయిని చేరుకుంది.ఈ సంస్థ నుంచి వచ్చిన రెండు భారీ చిత్రాలు 'కాంతార: చాప్టర్1' అలాగే ‘మహావతార్ నరసింహ’ ప్రతిష్టాత్మక ఆస్కార్-2026 అవార్డుల రేసులో నిలిచాయి.ఒకే నిర్మాణ సంస్థ నుంచి రెండు సినిమాలు వేర్వేరు విభాగాల్లో ఆస్కార్ అర్హత సాధించడం భారతీయ సినిమా చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రకటించిన రిమైండర్ లిస్ట్‌లో ఈ రెండు చిత్రాలకు చోటు దక్కింది.

మా ఇంటి బంగారం టీజర్ ట్రైలర్ రిలీజ్
స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో, దర్శకురాలు నందినీ రెడ్డి రూపొందిస్తున్న 'మా ఇంటి బంగారం' చిత్రం నుండి విడుదలైన టీజర్ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ టీజర్లో సమంత గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక పవర్ఫుల్ మాస్ అవతార్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా బస్సులో చీరకట్టుతో, ఎంతో సీరియస్ లుక్స్‌తో ఆమె చేసిన యాక్షన్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. టైటిల్ వినడానికి ఒక ఫ్యామిలీ మూవీలా అనిపించినప్పటికీ, ఇది ఒక లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ అని టీజర్…

ఓటీటీలోకి వచ్చేసిన అఖండ 2
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2: తాండవం' థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి వచ్చేసింది. డిసెంబర్ 12, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబట్టుకొని బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

నేను రెడీ టీజర్ అప్డేట్
నువ్విలా', 'జీనియస్', 'రామ్ లీల', 'సెవెన్' వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో హవిష్, దర్శకుడు త్రినాధ రావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'నేను రెడీ'. పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.హర్నిక్స్ ఇండియా LLP బ్యానర్‌పై నిఖిల కొనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కావ్య థాపర్ కథానాయికగా నటిస్తోంది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి తో ఫుల్ ఎంటర్టైన్ అవుదాం - రవితేజ
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో, సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది. డింపుల్ హయతి, ఆషిక రంగనాథ్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం, ఇప్పటికే టీజర్, మొదటి మూడు పాటలతో హ్యుజ్ బజ్‌ను సృష్టించింది. ఈ జోష్ ని కొనసాగిస్తూ, చిత్ర బృందం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేసింది.

అనగనగా ఒక రాజు ట్రైలర్ రిలీజ్
యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రైలర్ తాజాగా విడుదలైంది. నవీన్ పొలిశెట్టి తనదైన మార్క్ కామెడీ మరియు ఎనర్జీతో మరోసారి వెండితెరపై నవ్వుల విందు అందించబోతున్నారని ఈ ట్రైలర్ స్పష్టం చేస్తోంది.

హాలీవుడ్ లెవెల్లో టాక్సిక్ గ్లింప్స్
రాకింగ్ స్టార్ యష్ పుట్టినరోజు (జనవరి 8) సందర్భంగా ఆయన అభిమానులకు చిత్ర యూనిట్ అదిరిపోయే కానుకనిచ్చింది. యష్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'టాక్సిక్' (Toxic: A Fairytale for Grown-ups) నుండి ఆయన పాత్రను పరిచయం చేస్తూ 'ఇంట్రడ్యూసింగ్ రాయా' గ్లింప్స్‌ను నేడు విడుదల చేశారు.ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. సుమారు 3 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో హాలీవుడ్ స్థాయి మేకింగ్ కనిపిస్తోంది. ఒక స్మశాన వాటిక (సెమెట్రీ) నేపథ్యంలో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. అక్కడ ఒక అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుండగా, ఒక గ్యాంగ్ అక్కడకు వచ్చి "రాయా వస్తాడా?" అని చర్చించుకుంటూ ఉంటుంది…

జన నాయకుడు విడుదల వాయిదా
దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయకుడు' విడుదల వాయిదా పడింది. సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ రావడంలో జాప్యం జరగడంతో, జనవరి 9న సినిమాను విడుదల చేయడం సాధ్యం కాదని చిత్ర యూనిట్ ప్రకటించింది.

నారీ నారీ నడుమ మురారి సెన్సార్ కంప్లీట్
యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సంక్రాంతి బరిలో నిలుస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ 'U/A ' సర్టిఫికేట్ జారీ చేసింది.ఈ సినిమా రన్ టైమ్ సుమారు 145 నిమిషాలుగా లాక్ చేయబడింది.

భర్త మహాశయులకు విజ్ఞప్తి ట్రైలర్ రిలీజ్
మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను మరింత పెంచుతూ, మేకర్స్ నేడు ట్రైలర్‌ను విడుదల చేశారు.

కపుల్ ఫ్రెండ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్
యంగ్ హీరో సంతోష్ శోభన్, మిస్ ఇండియా (2020) మానసా వారణాసి జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ 'కపుల్ ఫ్రెండ్లీ' . చాలా కాలంగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ఎట్టకేలకు బాక్సాఫీస్ వద్దకు రావడానికి సిద్ధమైంది. సినిమా థీమ్‌కు తగ్గట్టుగా దీనిని వేలంటైన్స్ డే (ప్రేమికుల రోజు) కానుకగా ఫిబ్రవరి 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది
నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'అఖండ 2: తాండవం' థియేటర్లలో సందడి చేసిన తర్వాత ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌ని అభినందించిన నిర్మాత దిల్ రాజు
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడమే గాక నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టి క్రిస్మస్ విన్నర్ గా నిలిచింది. ముఖ్యంగా ఆదికి మాత్రం శంబాల సినిమా మంచి బ్రేక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి.

నారీ నారీ నడుమ మురారి నుండి భల్లే భల్లే సాంగ్ రిలీజ్
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారి జనవరి 14న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రై. లిమిటెడ్‌తో కలిసి రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయు, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు.