కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Filmnagar

ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 135

Sudheer Babu Strong Counter To Arshad Warsi Comments Against Prabhas
సినిమా వార్తలు

ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు కామెంట్స్.. సుధీర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్

'బాహుబలి' సినిమాతో తొలిసారిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి ముందువరకూ సౌత్ సినిమాలంటే ఒకరకమైన చిన్న చూపు చూసే హిందీ జనాలకి ఈ సినిమా తర్వాత ఆ ధోరణి మారింది. అప్పటినించీ ప్రభాస్ నటించిన ప్రతి సినిమా అక్కడ స్టార్ హీరోలకు సమానంగా, ఒక్కోసారి అంతకుమించి అన్నట్టుగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే కలెక్షన్స్‌తో సత్తా చాటుతోంది.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar Postponed and New Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

లక్కీ భాస్కర్‌ రిలీజ్ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ ఇదే!

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. సీతారామం' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చినకల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Excited For Indra Grand Re-release on August 22nd
సినిమా వార్తలు

కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర - చిరంజీవి

కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం 'ఇంద్ర' సినిమా అని, అందులో నటీనటుల పెర్ఫార్మెన్స్ సహా కథ, డైలాగ్స్, సీన్స్, ఎమోషన్స్, మ్యూజిక్, సాంగ్స్, ఫైట్స్, ఫోటోగ్రఫీ.. ఇలా అన్నీ పీక్స్‌లో ఉంటాయని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన జన్మదినం సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతుంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Congratulated The Committee Kurrollu Movie Team
సినిమా వార్తలు

క‌మిటీ కుర్రోళ్లు పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది.

Srikanth Mవాట్సాప్
Former Team India Cricketer Yuvraj Singh Biopic Getting Ready
సినిమా వార్తలు

యువరాజ్ సింగ్ బయోపిక్‌ అనౌన్స్‌మెంట్‍

ఇండియాలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ క్రికెటర్లనైతే దేవుళ్ళు మాదిరి భావిస్తుంటారు ఫ్యాన్స్. అలాంటివారిలో ఒకరు టీమిండియా మాజీ క్రికెటర్‌, స్టార్ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక భూమిక పోషించాడు యువీ. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అయితే ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో ఏకంగా ఒకే ఓవర్లో 6 సిక్స్ లు బాది ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన విషయాన్ని క్రికెట్ ప్రేమికులెవరూ అంత త్వరగా మర్చిపోలేరు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Praises Naa Favourite Naa Pellaame Song From Janaka Aithe Ganaka
సాంగ్

ప్ర‌తీ భ‌ర్త త‌న భార్య‌కు డేడికేట్ చేయాల్సిన పాట ఇది - దిల్‌ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టించగా.. సంగీర్తన హీరోయిన్‍గా నటించింది. రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘నా ఫేవ‌రేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
kiran abbavarm first single world of vasudev song image
సాంగ్

క నుండి ఫస్ట్ సింగిల్ వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా..సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు.

TFN Adminవాట్సాప్
Icon Star Allu Arjun To Attend For Maruthi Nagar Subramanyam Pre-release Event
సినిమా వార్తలు

ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన ఇంద్రజ కథానాయికగా కనిపించనున్నారు. అలాగే యువ నటులు అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో.. అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Shares His Father Old Pic on World Photography Day
సినిమా వార్తలు

వరల్డ్ ఫోటోగ్రఫీ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్

ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన తన తండ్రి పాత ఫోటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫొటోలో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు బ్లాక్ గాగూల్స్‌ పెట్టుకుని సైకిల్ ప‌ట్టుకుని నిల్చుని ఉన్నారు. అయితే ఈ ఫోటోను చిరునే స్వయంగా తీయడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Bhale Unnade trailer out now
ట్రైలర్ & టీజర్

భలే ఉన్నాడే ట్రైలర్ రిలీజ్

43రోజుల వ్యవధిలో మూడో సినిమాతో వస్తున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.గత నెలలో పురుషోత్తముడు తో అలాగే ఈనెల స్టార్టింగ్ లో తిరగబడరసామీ అనే సినిమాలు వచ్చాయి.అయితే ఈరెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.ఇవి ఇంకా ఓటిటిల్లోకి కూడా రాలేదు అప్పుడే మరో సినిమాను దింపుతున్నాడు రాజ్ తరుణ్. అదే భలే ఉన్నాడే! ప్రముఖ డైరెక్టర్ మారుతి ప్రొడక్ట్ గా వస్తుంది దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

Mahender Reddyవాట్సాప్
janaka aithe ganaka movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

జనక అయితే గనక రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సుహాస్ పేరు కూడా ముందుంటుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే జనక అయితే గనక. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఈ సినిమాను తెరాకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్
Imanvi attracts a large number of followers
సినిమా వార్తలు

ఇమాన్వి క్రేజ్ మాములుగా లేదు

ఇమాన్వి ..ప్రస్తుతం ఈపేరు సోషల్ మీడియా లో మారుమోగుతోంది.దీనికి కారణం రెబల్ స్టార్ ప్రభాస్.ఒక్క సినిమా కూడా యాక్ట్ చేయకుండానే ఇమాన్వి, ప్రభాస్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది.అది పాన్ ఇండియా స్టార్ పక్కన అంటే మాములు విషయం కాదు.ఈసినిమా లాంచ్ కూడా అయిపొయింది.ఇమాన్వి కూడా లాంచ్ లో పాల్గొంది.దాంతో ఇమాన్వి పేరు మారుమోగుతోంది.

Mahender Reddyవాట్సాప్
akash new film thalvar begins with formal pooja
సినిమా వార్తలు

ఆకాష్ కొత్త సినిమా తల్వార్ ప్రారంభం

బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన ఆకాష్ పూరీ మెహబూబా సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రొమాంటిక్, చోర్ బజార్.. సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఏ సినిమా కూడా మంచి హిట్ ను అందించలేకపోయాయి. ప్రస్తుతం అయి ఆకాష్ పూరీ పలు సినిమాలను లైన్ లో పెట్టినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే నేడు తన కొత్త సినిమా అప్ డేట్ వచ్చేసింది.

TFN Adminవాట్సాప్
Harish Shankar reacts about the film with Ram
సినిమా వార్తలు

రామ్ తో సినిమా గురించి స్పందించిన హరీష్ శంకర్

ఉస్తాద్ రామ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో సినిమా రానుందని రీసెంట్ గా వార్తలు వచ్చాయి.ఈనెల 15న ఈ ఇద్దరు తమ లేటెస్ట్ మూవీస్ తో వచ్చారు.అందులో భాగంగా హరీష్ డైరెక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ అలాగే రామ్ నటించిన డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యాయి.అయితే రిలీజ్ నెక్స్ట్ డే నుండి రామ్, హరీష్ శంకర్ కాంబో మరోసారి తెర మీదకు వచ్చింది.కానీ అధికారికంగా మాత్రం ఎలాంటి సమాచారం రాలేదు.ఇక ఈ న్యూస్ గురించి హరీష్ శంకర్ ఎట్టకేలకు స్పందించాడు.

Mahender Reddyవాట్సాప్
Vettaiyan and Kanguva releasing on Oct 10th
సినిమా వార్తలు

కంగువాతో క్లాష్ కు దిగుతున్న వేట్టాయాన్

సూపర్ స్టార్ రజినీకాంత్ ,సూర్య బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు.సూర్య కంగువా తో వస్తుండగా రజినీ వేట్టాయాన్ తోరానున్నాడు. కంగువా రిలీజ్ డేట్ ను చాలా రోజుల క్రితమే లాక్ చేశారు.రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడం తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.అయితే సోలో రిలీజ్ కంఫర్మ్ అనుకున్న తరుణంలో అనూహ్యంగా వేట్టాయాన్ బరిలోకి దిగింది.ఈరోజే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.కంగువా దిగుతున్న రోజే అక్టోబర్ 10న ఈసినిమా కుడా వస్తుంది.

Mahender Reddyవాట్సాప్
goutham brahmanandam movie glimpse out now
ట్రైలర్ & టీజర్

బ్రహ్మానందం మూవీ గ్లింప్స్ రిలీజ్

ప‌ల్ల‌కిలో పెళ్లికూతురు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు గౌత‌మ్‌. ఆ సినిమాతో నటుడిగా మంచి గుర్తింపునే తెచ్చుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాలు చేసినా కూడా మంచి విజయాన్ని అయితే దక్కించలేకపోయాయి. ఇక ఇప్పుడు చాలా గ్యాప్ తరువాత మరో సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో తండ్రి బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ముక్యంగా రియ‌ల్ లైఫ్‌లో తండ్రీకొడుకులైన బ్ర‌హ్మానందం, రాజా గౌత‌మ్ ఈ సినిమాలో తాతామ‌న‌వ‌ళ్లుగా నటిస్తుండటంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Kannappa Mukesh Rishi and Brahmaji First Look Poster Released
ఫస్ట్ లుక్

కన్నప్ప.. ముఖేష్ రిషి, బ్రహ్మాజీ క్యారెక్టర్స్ రివీల్

ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’కు రీమేక్‌గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

Srikanth Mవాట్సాప్
Ankith Koyya Plays Allu Arjun's Brother Character in Maruthi Nagar Subramanyam
సినిమా వార్తలు

అల్లు అర్జున్ మా అన్నయ్య అని చెప్పే రోల్ చేశా

ప్రముఖ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'మారుతి నగర్ సుబ్రమణ్యం'. ఆయన కుమారుడిగా యంగ్ అండ్ ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అంకిత్ కొయ్య నటించాడు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మించారు. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. ఆగస్టు 23న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా అంకిత్ కొయ్య మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..

Srikanth Mవాట్సాప్
jr ntr praises on aay movie team
సినిమా వార్తలు

ఆయ్ టీమ్ తో మ్యాన్ ఆఫ్ మాస్

ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. మ్యాడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు నార్నే నితిన్. ఈసినిమా సూపర్ హిట్ ను అందించింది. ఇప్పుడు ఆయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అంజి కే దర్శకత్వంలో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

TFN Adminవాట్సాప్
CM Revanth Reddy Praises Pan India Rebel Star Prabhas
సినిమా వార్తలు

హాలీవుడ్‌తో పోటీపడే స్థాయిలో ప్రభాస్ - సీఎం రేవంత్ రెడ్డి

టాలీవుడ్ స్టార్ హీరో, పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌ 'బాహుబలి' తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన సినిమాలతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇటీవలే 'కల్కి 28987 AD' చిత్రంతో రూ.1,000 కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించి ఔరా అనిపించాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. డార్లింగ్ ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా ఎంతోమంది ఆయన నటనకు ఫిదా అవుతున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్