కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2024

ట్యాగ్ · 3668 కథనాలు · పేజీ 81

nasser and abhirami joins in kamal thug life movie
సినిమా వార్తలు

థగ్ లైఫ్ లోకి నాజర్, అభిరామి ఎంట్రీ

రీసెంట్ గా ఇండియన్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు లోకనాయకుడు కమల్ హాసన్. ఈసినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం అందుకుంది. ప్రస్తుతం తను థగ్ లైఫ్ అనే సినిమా బిజీగా ఉన్నాడు. ఈసినిమా నుండి రిలీజ్ అయిన కమల్ హాసన్ ఫస్ట్ లుక్ తోనే సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రబృందం. దానికి తోడు ఈసినిమాలో కూడా డిఫరెంట్ లుక్ తో కనిపించడంతో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ముగించుకుంటూనే మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
game changer new schedule shoot kicks off today
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

శంకర్- రామ్ చరణ్ కాంబో లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.ఎప్పుడో స్టార్ట్ అయిన ఈసినిమా ఎట్టకేలకు పూర్తవుతుంది.ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ జరుగుతుంది.ఈరోజే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో శ్రీకాంత్,సముద్రఖని పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మూడు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దాంతో షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.

Mahender Reddyవాట్సాప్
Usha Parinayam Director Vijaya Bhaskar Says Sai Durga Tej is a Real Hero
సినిమా వార్తలు

సాయి దుర్గ తేజ్‌ రియల్‌ హీరో

టాలీవుడ్‌లో క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్రస్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. విజ‌య్‌ భాస్క‌ర్. చాలాకాలం తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టుకుని ద‌ర్శ‌క‌త్వం వహించిన తాజా సినిమా 'ఉషా ప‌రిణ‌యం'. బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. శ్రీ‌క‌మ‌ల్‌, తాన్వీ ఆకాంక్ష‌, సూర్య ప్రధానపాత్రలు పోషించిన ఈ మూవీ ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Srikanth Mవాట్సాప్
Sai Durga Tej Praises Director Vijaya Bhaskar
సినిమా వార్తలు

విజయ్‌ భాస్కర్‌ గారితో సినిమా అలా మిస్‌ అయ్యింది - సాయి దుర్గ తేజ్‌

నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె.విజ‌య్‌ భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తాజాగా మ‌రో ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ రాబోతుంది. 'ఉషా ప‌రిణ‌యం' అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. కె. విజ‌య్‌ భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో శ్రీ‌క‌మ‌ల్‌, తన్వీ ఆకాంక్ష‌, సూర్య ముఖ్య‌తార‌లు.

Srikanth Mవాట్సాప్
raayan 4days collections
బాక్సాఫీస్

రాయన్ 4డేస్ కలెక్షన్స్

మొదటి మూడు రోజులు బాక్సాఫీస్ వద్ద అదరగొట్టిన రాయన్ నాలుగో రోజు కూడా సూపర్ వసూళ్లను దక్కించుకుంది.వర్కింగ్ డే లోకూడా సాలిడ్ హోల్డ్ చూపించడంతో నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 87.65 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.తమిళనాడులో 43కోట్లు,తెలుగు రాష్ట్రాల్లో 8కోట్లు,ఓవర్సీస్ లో 25కోట్ల వసూళ్లను సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Mr Bachchan Actress Bhagyashri Borse Completes Her Dubbing
సినిమా వార్తలు

మిస్టర్ బచ్చన్‌ నుండి మరో అప్‌డేట్‌ వచ్చేసింది

మాస్ మహారాజ రవితేజ ప్రధానపాత్రలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తోంది. జగపతి బాబు, సచిన్ ఖేడ్‌కర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Paradha Movie Gets Super Buj with Sangeetha First Look Poster
ఫస్ట్ లుక్

పరదా లో ఆకట్టుకుంటోన్న సంగీత ఫస్ట్‌ లుక్‌

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఇటీవలే 'టిల్లు స్క్వేర్' మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో అప్పుడే ఆమె తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రారంభించేసింది. ఈ సినిమాకు 'సినిమా బండి' ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తున్నారు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంతో మరో ప్రముఖ మలయాళీ హీరోయిన్ దర్శన రాజేంద్రన్ తొలిసారిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
surprising update from viswam movie will come on this date
సినిమా వార్తలు

జర్నీ ఆఫ్ విశ్వం- రిలీజ్ టైమ్ ఫిక్స్

టాలీవుడ్ మ్యాచో గోపీచంద్ ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. ఈ ఏడాది ఇప్పటికే భీమా సినిమాతో వచ్చాడు కానీ భీమా సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఇప్పుడు మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వస్తున్న సినిమా విశ్వం. మాస్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
ఓవర్సీస్ లో శివం భజే గ్రాండ్ రిలీజ్
సినిమా వార్తలు

ఓవర్సీస్ లో శివం భజే గ్రాండ్ రిలీజ్

అశ్విన్ బాబు హీరోగా రాబోతున్న మోస్ట్ ఎగ్జైటింగ్ సినిమా శివం భజే. ఇక ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. పాటలకి, ట్రైలర్ కి అనూహ్యమైన స్పందన లభించడం.. ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలు క్యూరియాసిటీ ని పెంచాయి. దీంతో ఈసినిమా అశ్విన్ బాబుకు హిట్ ను ఇస్తుందనే అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.

TFN Adminవాట్సాప్
Nandamuri Kalyan Ram's NKR21 Intense Climax Shoot Completed with 1000 Artists
సినిమా వార్తలు

కళ్యాణ్ రామ్ సినిమా క్లైమాక్స్.. 1,000 మంది ఆర్టిస్టులతో

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. అందులోనూ రెగ్యులర్ టైపు కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపుతుంటారు. రెండేళ్ల క్రితం 'బింబిసార' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయి హిట్ అందుకోలేకపోయారు. దాని తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన 'అమిగోస్', 'డెవిల్' ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.

Srikanth Mవాట్సాప్
ramajogaiah sastry interesting update on jr ntr devara next song
సాంగ్

దేవర సెకండ్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఇప్పటివరకూ ఎన్టీఆర్ నుండి సినిమా రాలేదు. దీంతో ఎన్టీఆర్ ను వెండితెరపై ఎప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ పూర్తయింది. మరోపక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. పవర్ ఫుల్ గా ఉన్న ఈ సాంగ్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు అందరూ సెకండ్ సాంగ్ గురించి ఈగర్ వెయిట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
మైత్రీ చేతిలో శివం భజే నైజాం రైట్స్
సినిమా వార్తలు

మైత్రీ చేతిలో శివం భజే నైజాం రైట్స్

రాజు గారి గది సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు. ఇక ఆతరువాత పలు సినిమాలు చేసుకుంటూ వెళ్లాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా శివం భజే. అప్సర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
harish shankar interesting update on ustaad bhagat singh movie
సినిమా వార్తలు

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రత్యేక సినిమాగా నిలుస్తుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లిస్ట్ లో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వాటిలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమా గురించి హరీష్ శంకర్ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రస్తావిస్తూనే ఉన్నారు.. ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ఈసినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియచేశారు.

TFN Adminవాట్సాప్
Tanikella Bharani Responds Over SR University Announces Honorary Doctorate To Him
సినిమా వార్తలు

చాలా సర్‌ప్రైజ్ అయ్యా - తనికెళ్ల భరణి

ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణికి అరుదైన గౌరవం దక్కింది. 800కు పైగా చిత్రాల్లో నటించడంతోపాటు 52 సినిమాలకు మాటలను అందించి రచయితగా పనిచేసిన భరణి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్నో అవార్డులను అందుకున్నారు. ‘సముద్రం’ సినిమాలో నటనకు గానూ ఉత్తమ విలన్‌గా, ‘నువ్వు నేను’ సినిమాలోని నటనకు ఉత్తమ క్యారెక్టర్‌ నటునిగా, ‘గ్రహణం’తో ఉత్తమ నటునిగా, ‘మిథునం’ సినిమాకు గాను ఉత్తమ రచయిత మరియు ఉత్తమ దర్శకునిగా అయిదు నంది అవార్డులను గెలుచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Superstar Mahesh Babu Praises Dhanush Acting and Direction For Raayan
సినిమా వార్తలు

రాయన్‍ పై ప్రశంసలు కురిపించిన మహేష్ బాబు

కోలీవుడ్ స్టార్ హీరో, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం 'రాయన్'. ఇది ధనుష్ 50వ చిత్రం కావడం, అందునా ఆయనే దర్శకత్వం వహించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో జులై 26న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ఇక రాయన్ చిత్రాన్ని తమిళంలో సన్ పిక్చర్స్ నిర్మించగా.. తెలుగు వెర్షన్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి గ్రాండ్‌గా విడుదల చేసింది. సూపర్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Vijay Antony's Toofan Sneak Peek Released
సినిమా వార్తలు

తుఫాన్ స్నీక్ పీక్.. విజిల్స్ వేయించిన విజయ్ ఆంటోని

కోలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విజయ్ ఆంటోని ప్రధానపాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'తుఫాన్'. తమిళంలో 'మరయ్ పిడిక్కత్త మనిథన్'గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదల చేస్తున్నారు మేకర్స్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రచనతో పాటు విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించాడు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి. లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్న తుఫాన్ ఆగస్టు 2న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ కానుంది.

Srikanth Mవాట్సాప్
Shivam Bhaje Completed Censor Formalities and Certified with UA
సినిమా వార్తలు

శివం భజే సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అశ్విన్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'శివం భజే'. అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‍గా నటిస్తోంది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడు పెంచింది.

Srikanth Mవాట్సాప్
The Goat third Single coming soon
సినిమా వార్తలు

ది గోట్ థర్డ్ సింగిల్ అప్డేట్

కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ లియో తరువాత దళపతి విజయ్ నటిస్తున్నసినిమా ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం).ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.ఇప్పటివరకు ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరెండు పాటలను విజయే పాడాడు.ఇక త్వరలోనే థర్డ్ సింగిల్ కూడా రానుంది.ఆగస్టు 1న ఈ సాంగ్ గురించి అప్డేట్ ఇవ్వనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన అర్చన కల్పాతి తెలియజేశారు.

Mahender Reddyవాట్సాప్
AAY release date remains unchanged
రిలీజ్ అప్‌డేట్

ఆయ్ రిలీజ్ డేట్ అదే

మ్యాడ్ తో హిట్ అందుకున్న యంగ్ హీరో నార్నె నితిన్ నుండి వస్తున్న రెండో సినిమా ఆయ్.గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఫన్ మూవీ గా తెరకెక్కుతుంది.ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.వీటికి తోడు గీతా ఆర్ట్స్ నుండి వస్తున్న సినిమాకావడంతో హైప్ క్రీయేట్ అయ్యింది.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ విషయంలో మాత్రం అనుమానాలను రేకెత్తించింది.ఆగస్టు 15న విడుదలకానుందని ముందే అనౌన్స్ చేశారు.కానీ అదే రోజు డబుల్ ఇస్మార్ట్,మిస్టర్ బచ్చన్ కూడా దిగుతుండడంతో ఆయ్ వెనక్కివెళ్తుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

Mahender Reddyవాట్సాప్
raayan three days collections
బాక్సాఫీస్

రాయన్ 3డేస్ కలెక్షన్స్

ధనుష్ రాయన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 75.42కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి బ్లాక్ బాస్టర్ దిశగా సాగుతుంది.తమిళనాడులో మొదటి రెండు రోజుల కన్నా నిన్న అత్యధిక వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది.ఈవారంలో 100కోట్ల క్లబ్ లో చేరనుంది.సార్ తరువాత ధనుష్ ఈసినిమాతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు.ఇందులో నటించడం మాత్రమే కాదు తనే డైరెక్షన్ కూడా చేశాడు.ఇది ధనుష్ కు 50వ సినిమా కూడా.

Mahender Reddyవాట్సాప్

షేర్