
ట్యాగ్ · 28 కథనాలు


హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఏజెంట్
డియర్ కామ్రేడ్ కు సాలిడ్ బుకింగ్స్
సరిలేరునీకెవ్వరు మూవీ కి భారీ సెట్

క్రిటిక్స్ కు రామ్ కౌంటర్ ప్రాణాలకు విలువలేదు..!

ప్రారంభం కానున్న సుమంత్ అశ్విన్ కొత్త సినిమా
ఎన్టీఆర్ జోడీగా మళ్లీ హాలీవుడ్ బ్యూటీ..!

మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ

లెజెండ్ క్రికెటర్ బయోపిక్ లో విజయ్ సేతుపతి

డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ &డేట్

మహర్షి మూవీ పై క్రికెటర్ VVS లక్ష్మణ్ స్పందన

ఢిల్లీ వెళ్ళనున్న `డిస్కో రాజా`

బాలీవుడ్ బాటలో `ఇస్మార్ట్ శంకర్`?

రాజమౌళి ‘మర్యాదరామన్న’కు 9 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి ‘పసివాడి ప్రాణం’కు 32 ఏళ్ళు
భారీ సెట్ లో డిస్కోరాజా
తన నిక్ నేమ్ ఏంటో చెప్పిన నాని
సూపర్ కంటెంట్ తో వస్తున్న 'అశ్వమేథం'

హిందీ భాషలో గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమైన HIT :ది సెకండ్ కేస్
హీరో నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో అడివి శేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ HIT :ది ఫస్ట్ కేస్ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ HIT – ది సెకండ్ కేస్ మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో ఘనవిజయం సాధించింది. హీరో అడివి శేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో ఓ పర్ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా HIT2 మూవీ ని తెరకెక్కించి డైరెక్టర్ శైలేష్ కొలను ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణలో ఏజెంట్
అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అఖిల్. అయితే అఖిల్ మాత్రం సక్సెస్ ను చాలా లేటుగా చూశాడు. వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అయిన తరువాత ఎట్టకేలకు నాలుగో సినిమాతో హిట్ ను కొట్టాడు. రీసెంట్ గానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అనే రొమాంటిక్ కామెడీతో వచ్చి హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా ఏజెంట్ అనే స్పై థ్రిల్లర్ రూపొందుతుంది. ఇక ఈసినిమా కోసం అఖిల్ కూడా తన మేకర్ ను పూర్తిగా మార్చేశాడు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక తాజా సమాచారం ఈసినిమా షూటింగ్ హైద్రాబాద్ లో శరవేగంగా జరుపుకుంటున్నట్టు…

హ్యాపీ బర్త్ డే మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఇలాంటి సినిమాలను లాజిక్కులు లేకుండా చూస్తూనే బెటర్. కామెడీ థ్రిల్లర్ కాబట్టి ప్రతిఒక్కరూ ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
డియర్ కామ్రేడ్ కు సాలిడ్ బుకింగ్స్
మరోసారి విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తోంది డియర్ కామ్రేడ్ సినిమా చూస్తుంటే. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు బ్లాక్ బస్టర్ అవ్వడంతో డియర్ కామ్రేడ్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అభిమానులు కూడా ఈసినిమా ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంకా మరో మూడు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సరిలేరునీకెవ్వరు మూవీ కి భారీ సెట్
GMB ఎంటర్ టైన్ మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా రూపొందుతున్న యాక్షన్ కామెడీ సరిలేరు నీకెవ్వరు మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. లేడీ అమితాబ్ విజయశాంతి చాల సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీ తో రీ ఎంట్రీ అవుతున్నారు. ఈ మూవీ లో విజయ శాంతి పాత్ర కీలకం గా ఉంటుందని సమాచారం. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

క్రిటిక్స్ కు రామ్ కౌంటర్ ప్రాణాలకు విలువలేదు..!
పూరీ-రామ్ కాంబినేషన్ సూపర్ గా వర్కవుట్ అయింది. ఒక టెర్రిఫిక్ డైరెక్టర్ కు ఒక టెర్రిఫిక్ హీరో తోడైతే ఎలా ఉంటుందో ఇస్మార్ట్ శంకర్ చూపించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల వరకే 22కోట్ల షేర్ సాధించి..ఈ సినిమా నిర్మాతలైన పూరీ కి ఛార్మీకి మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. మరోవైపు రామ్ మాస్ అవతారం.. పూరీ మార్క్ తెలంగాణ డైలాగులు థియేటర్లలో గోల పెట్టిస్తున్నాయి. మాస్ సినిమాలకు టాక్ బాగా వస్తే కలెక్షన్లు ఎలా ఉంటాయో ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ చూపిస్తున్నాడు. బాక్సాఫీస్ దగ్గర మరో సినిమా లేకపోవడం దీనికి బాగా కలిసొస్తుంది. మరి డియర్ కామ్రేడ్…

ప్రారంభం కానున్న సుమంత్ అశ్విన్ కొత్త సినిమా
శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, మస్కా వంటి సూపర్ హిట్ మూవీస్ నిర్మించిన MSరాజు తన తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఒక మూవీ ని నిర్మించనున్నారు. మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు VN ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్నారు.
సాహో నుండి త్వరలో 'ఏ చోట నువ్వున్నా'
'సాహో' సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూసిన ప్రభాస్ అభిమానులకు నోట్లో వెలక్కాయ పడినంత పనైంది. అగష్ట్ 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతుందని చిత్రయూనిట్ చెప్పడంతో కేవలం ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ అభిమానులే కాదు.. ప్రతి సినీ లవర్ సాహో కోసం ఎదురుచూస్తున్నాడు. కానీ అది కాస్త మరో 15 రోజులకు వాయిదా వేశారు. కారణం ఏంటో తెలియదు కానీ.. ఆగష్ట్ 15న రిలీజ్ కావాల్సిన సినిమా ఆగష్ట్ 30వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు.
ఎన్టీఆర్ జోడీగా మళ్లీ హాలీవుడ్ బ్యూటీ..!
బాహుబలి సినిమా తరువాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'ఆర్ఆర్ఆర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర పోషిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు రోల్ లో నటిస్తున్నాడు. చెర్రీ సరసన ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ
మహిళా క్రికెట్ టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ 200 వన్ డే ఇంటర్ నేషనల్ మ్యాచ్ లలో పాల్గొన్న మొదటి మహిళ. హైయస్ట్ రన్స్ సాధించిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. వన్ డే ఇంటర్ నేషనల్ మ్యాచ్ లలో 6000 రన్స్ పైగా సాధించి మిథాలీ రాజ్ రికార్డ్ క్రియేట్ చేశారు. అర్జున అవార్డ్, పద్మశ్రీ వంటి అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ మిథాలీ రాజ్ బయోపిక్ మూవీ ని నిర్మించనుంది.

లెజెండ్ క్రికెటర్ బయోపిక్ లో విజయ్ సేతుపతి
ఇప్పటి వరకూ తెలుగు, తమిళ్, హిందీలో ఎంతోమంది క్రీడాకారుల బయోపిక్ లు తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఎం.ఎస్ ధోని, కపిల్ దేవ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ ఇలా పలువురి బయోపిక్ లు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు తాజాగా మరో లెజెండ్ క్రికెటర్ బయోపిక్ ను తెరకెక్కిస్తున్నారు. ఆయనెవరో కాదు... సెన్సేషనల్ శ్రీలంక క్రికెటర్, స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.

డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ &డేట్
మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై భరత్ కమ్మ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా రూపొందిన డియర్ కామ్రేడ్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

మహర్షి మూవీ పై క్రికెటర్ VVS లక్ష్మణ్ స్పందన
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ మహర్షి మే 9వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన మహర్షి మూవీ మహేష్ బాబు సినీకెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేసింది.

ఢిల్లీ వెళ్ళనున్న `డిస్కో రాజా`
మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా`. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తుండగా... రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. పిరియాడికల్ టచ్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అంతేకాదు... ఒక పాత్ర కోసం డిస్కో డాన్సర్‌గా సందడి చేయనున్నాడు.

బాలీవుడ్ బాటలో `ఇస్మార్ట్ శంకర్`?
`ఇస్మార్ట్ శంకర్`... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తున్న ఈ సినిమాతో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్... మళ్ళీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చేశారు. అంతేకాదు... ఆల్రెడీ ప్రాఫిట్ జోన్‌లోకి వచ్చేసిన ఈ మాస్ ఎంటర్‌టైనర్... రామ్ కెరీర్‌లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలచే అవకాశముందని ట్రేడ్ టాక్. ఇదిలా ఉంటే... ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఓ ప్రముఖ హిందీ నిర్మాత ఇప్పటికే పూరితో ఈ మేరకు చర్చలు జరుపుతున్నారని సమాచారం. అలాగే... బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో ఈ రీమేక్ చేసే దిశగా…

రాజమౌళి ‘మర్యాదరామన్న’కు 9 ఏళ్ళు
విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలచిన దర్శకుడు యస్.యస్.రాజమౌళి. అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న ఈ స్టార్ డైరెక్టర్ రూపొందించిన బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ‘మర్యాదరామన్న’ ఒకటి. సునీల్, సలోని జంటగా నటించిన ఈ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌లో... నాగినీడు, సుప్రీత్, ప్రభాకర్, బ్రహ్మాజీ, రావురమేష్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు.

మెగాస్టార్ చిరంజీవి ‘పసివాడి ప్రాణం’కు 32 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవికి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో ఎ.కోదండరామి రెడ్డి ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కాయి. వాటిలో ‘పసివాడి ప్రాణం’ ఒకటి. విజయశాంతి కథానాయికగా నటించిన ఈ చిత్రంలో... బేబీ సుజిత, రఘువరన్, బాబు ఆంటోనీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, జగ్గయ్య, కన్నడ ప్రభాకర్, రాజ్యలక్ష్మి, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించగా... సుమలత అతిథి పాత్రలో దర్శనమిచ్చింది.
భారీ సెట్ లో డిస్కోరాజా
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈసినిమా అన్నపూర్ణా స్టూడియోలో వేసిన కోటి 20 లక్షల రూపాయిల సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక షెడ్యూల్ తర్వాత డిస్కోరాజా టీం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ నెల 26 తో పూర్తి చేసి.. ఆగష్ట్ మెదటివారం నుండి ఢిల్లి లో షూటింగ్ జరుపుకోనున్నారు.
తన నిక్ నేమ్ ఏంటో చెప్పిన నాని
విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగష్టు 30వ తేదీన రిలీజ్ చేద్దామని.. రిలీజ్ డేట్ కూడా ఎప్పుడో ఫిక్స్ చేసేశారు. అయితే సాహో పోస్ట్ పోన్ అవ్వడంతో.. గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ కు వాయిదా చేసే ఆలోచనలో ఉన్నారు.
సూపర్ కంటెంట్ తో వస్తున్న 'అశ్వమేథం'
'అశ్వమేథం'.. ఈ మాట మనం మన పురాణాలలో చాలాసార్లు వినే ఉంటాం. ఒక దైవికమైన అశ్వాన్ని (గుర్రాన్ని) బలిదానమివ్వడమే దాని అర్ధం. ఇది అప్పట్లో రాజులు తమ దేశ ప్రజలకు శాంతిని, సుభిక్షాన్ని కలిగించేందుకు చేస్తారు. ఇక సుభిక్షత ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. శ్రీరాముడు బంగారు సీతమ్మ విగ్రహాన్ని పక్కన పెట్టుకుని అశ్వమేథ యాగం చేస్తాడు...ఇలమహారాజు, ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఈ యాగం చేసినట్టు విన్నాం. అంటే ఎన్నో విధి విధానాలకు నిష్టగా కట్టుబడి ఉండి.. చేసే పని అని ఇప్పటి వాళ్లకు అర్థమయ్యే భాషలో చెప్పొచ్చేమో. ఇప్పుడు ఈ 'అశ్వమేథ యాగం' గురించి ఇంత ఉపోద్ఘాతం…