ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2

మనం మారాల్సిన సమయమిది..
బెస్ట్ ఫ్రెండ్స్
రిలాక్స్ మూడ్ లో తమన్నా
తమన్నా "ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్"వీడియో
మాతృ భాష పై పట్టు

కన్నడ హీరో యశ్ కు జోడీగా తమన్నా ?
బ్రదర్ నిన్ను చాలా మిస్ అవుతున్నా..!
కార్పొరేట్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో తమన్నా
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వెబ్ సిరీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రజలకు ముఖ్య వినోద సాధనం సినిమా. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూత పడడంతో ప్రేక్షకులకు OTT సంస్థల ద్వారా ఉపశమనం లభించింది. OTT ల ద్వారా మూవీస్ తో పాటు వెబ్ సిరీస్ ప్రసారం అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత , దర్శకులు వెబ్ సిరీస్ లు రూపొందించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ సమంత , కాజల్ అగర్వాల్ , అంజలి , రమ్యకృష్ణ , రాశీఖన్నా వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

మనం మారాల్సిన సమయమిది..
ఒక పక్క కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోపక్క కొన్ని సంఘటనలు చూస్తే దేశం ఎటు పోతుందో అన్న ఆలోచనలు రాకుండా ఉండవు. కేరళలో ఇటీవల వెలుగుచూసిన గర్భిణీ ఏనుగు మృతి ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. కేరళ రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఏనుగు మృతికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ జరుపుతోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
బెస్ట్ ఫ్రెండ్స్
ఇద్దరు ట్యాలెంటెడ్ హీరోయిన్స్ బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండడం అరుదుగా జరుగుతుంది. స్టార్ హీరోయిన్స్ తమన్నా , శృతి హాసన్ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. శృతి హాసన్ అంటే తనకెంత ఇష్టమో పలు సందర్భాలలో తమన్నా చెప్పారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన తమన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూ లో శృతి హాసన్ తో తనకున్న అనుబంధం గురించి తెలిపారు.
రిలాక్స్ మూడ్ లో తమన్నా
ప్రజల దైనందిక జీవితంలో కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు పలు కష్టనష్టా లకు గురిఅయ్యారు. లాక్ డౌన్ సమయంలో మూవీ షూటింగ్స్ నిలిచిపోయి , షూటింగ్స్ , ఓపెనింగ్స్, ఫోటో షూట్స్ వంటి వాటితో క్షణం తీరిక లేకుండా ఉండే సినీ సెలబ్రిటీస్ రెండు నెలలకు పైగా ఇంటికే పరిమితం అయ్యారు. తమ తమ వ్యాపకాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
తమన్నా "ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్"వీడియో
టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా కు ఇన్ స్టా గ్రామ్ లో 10.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను తమన్నా అలరిస్తున్నారు. తమన్నా లేటెస్ట్ గా "ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్"వీడియోను షేర్ చేశారు. ట్రైనర్ సూచనలతో తలని బ్యాలెన్స్ చేస్తూ హెడ్ స్టాండ్ పొజిషన్ చేశానని , కొన్ని సార్లు ఫెయిల్ అయినా రైట్ పొజిషన్ కు చేరుకున్నానని , పర్ ఫెక్ట్ పొజిషన్ చేరేవరకు ప్రాక్టీస్ చేయాలని, ఎన్నో సార్లు ట్రై చేసిన తరువాత హెడ్ స్టాండ్ ఫీట్ సాధించానని , ట్రైనర్ లేకుండా ప్రాక్టీస్ చేయొద్దని తమన్నా చెప్పారు.
మాతృ భాష పై పట్టు
2005 సంవత్సరం సక్సెస్ ఫుల్ "శ్రీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మిల్కీ బ్యూటీ తమన్నా టాలీవుడ్, కోలీవుడ్ లలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్వతహాగా మంచి డ్యాన్సర్ అయిన తమన్నా పలు మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూత లూగించారు. స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "సీటీ మార్" మూవీ లో నటిస్తున్నారు. కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ లో తమన్నా కబడ్డీ కోచ్ గా నటిస్తున్నారు.

కన్నడ హీరో యశ్ కు జోడీగా తమన్నా ?
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో హారో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. "KGF చాప్టర్ 1" మూవీ సీక్వెల్ గా రూపొందుతున్న "KGF చాప్టర్ 2" మూవీ అక్టోబర్ లో రిలీజ్ కానుందని సమాచారం. హీరో యశ్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
బ్రదర్ నిన్ను చాలా మిస్ అవుతున్నా..!
ఈ కరోనా వైరస్ ఏమో కానీ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం ఇంటికే పరిమితమైంది. ఈ వైరస్ సంగతి పక్కన పెడితే.. ఇంటికి కుటుంబానికి కాస్త టైమ్ కూడా కేటాయించలేని.. బిజీ బిజీ జీవితం గడుపుతున్న వాళ్లకు మాత్రం నిజంగా ఇది గుడ్ టైం అని చెప్పొచ్చు. ఎందుకంటే...ఈ రకంగా అయినా కాస్త కుటుంబంతో కలిసి గడిపే అవకాశం దక్కింది. ఇక నాణానికి ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంత మంది ఇంటికి వెళ్లలేని పరిస్థితి. ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాల్సిన పరిస్థితి. దీనితో చాలా మంది కుటుంబాలకు దూరంగా ఉంటూ బాధపడే వాళ్ళు కూడా వున్నారు. ఈ నేపథ్యంలో ఒక స్టార్ హీరోయిన్ కూడా ఈ లాక్ డౌన్ వల్ల తన బ్రదర్ ను బాగా మిస్ అవుతుందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు తమన్నా.