
ట్యాగ్ · 9 కథనాలు


శర్వా38 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి

'ఒకే ఒక జీవితం' రిలీజ్ డేట్ ఫిక్స్..!

టైమ్ ట్రావెల్ మూవీ లో శర్వానంద్ ?

ప‌్లే బాయ్ గా శర్వానంద్?

నాగచైతన్య దర్శకుడితో శర్వానంద్?

శర్వా 37 షూట్ అప్డేట్
యంగ్ హీరో శర్వానంద్ ,సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.శర్వాకి ఇది 37వ సినిమా.ఇక ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.తాజాగా కేరళ షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసింది.10రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో సాంగ్, ఫైట్ సీక్వెన్స్ తో పాటు కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.అందులో భాగంగా శర్వా,సాక్షి వైద్యలపై బృందా మాస్టర్ కొరియోగ్రఫీలో సాంగ్ ని షూట్ చేశారు.దీంతో పాటు పృథ్వీ మాస్టర్ నేతృత్వంలో ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరించారు.అలాగే ప్రధాన నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాల షూట్ చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

శర్వా38 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది
చార్మింగ్ స్టార్ శర్వానంద్ విభిన్న శ్రేణి స్క్రిప్ట్‌లను ఎంచుకుని విలక్షణమైన మార్గంలో నడుస్తున్నాడు. ఇటీవలే 'మనమే' చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన ఆయన తాజాగా కొత్త సినిమాను ప్రారంభించాడు. తన ట్రేడ్‌మార్క్ శైలిలో కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుగాంచిన బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది దీనికి దర్శకత్వం వహించనున్నాడు. #Sharwa38గా వ్యవహరించబడుతున్న ఈ మూవీ వీరి కాంబోలో వస్తోన్న మొదటిచిత్రం కావడం గమనార్హం.

శర్వా37 మూవీ- ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్
నేడు శర్వానంద్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తన సినిమాల నుండి వరుసగా అప్ డేట్లు ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే శర్వా 35 సినిమాకు సంబంధించిన అప్ డేట్ వచ్చేసింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా టైటిల్ ను ఈరోజు ఉదయాన్నే రిలీజ్ చేశారు. మనమే అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఇకా శర్వా 36వ సినిమా అప్ డేట్ కూడా వచ్చింది. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాను పూజాకార్యక్రమాలతో లాంచ్ చేశారు. త్వరలో షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈసినిమా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పాలి
విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేయడంలో టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కూడా ఎప్పుడూ ముందుంటాడు. అలాంటి శర్వాకు ఈమధ్య సరైన హిట్ పడింది లేదు. రీసెంట్ గా వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు సినిమా కాస్త ఊరట నిచ్చింది. ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు. శ్రీకార్తిక్ దర్శకత్వంలో శర్వా హీరోగా వస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. నిజానికి ఈసినిమా చాలా లేట్ గానే రిలీజ్ అవుతుంది. ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలుపెట్టారు కానీ రిలీజ్ అవ్వడానికి మాత్రం చాలా రోజులు టైమ్ తీసుకుంది. ఫైనల్ గా ఈ నెల 9వ తేదీన తెలుగు .. తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

'ఒకే ఒక జీవితం' రిలీజ్ డేట్ ఫిక్స్..!
గత ఏడాది రెండు సినిమాలతో అలరించిన శర్వానంద్ ఈ ఏడాది ఆడవాళ్ళు మీకు జోహార్లు సినిమాతో అలరించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేశాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో శర్వానంద్ చేస్తున్న సినిమా ఒకే ఒక జీవితం. ఈసినిమా ఎప్పుడో స్టార్ట్ చేశారు కానీ రిలీజ్ కు మాత్రం చాలా లేట్ అయిందనే చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జానర్ కావడంతో వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు అద్భుతంగా చూపించడానికి చిత్ర యూనిట్ ప్రత్యేక ద్రుష్టి పెట్టింది.

కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో శర్వానంద్ ?
సెన్సేషనల్ హిట్ "RX 100" మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ "మహాసముద్రం" మూవీ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. శ్రీకార్తిక్ దర్శకత్వంలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన "ఒకే ఒక జీవితం"మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. హీరో శర్వానంద్ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న "ఆడవాళ్ళు మీకు జోహార్లు "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

టైమ్ ట్రావెల్ మూవీ లో శర్వానంద్ ?
సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరో గా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "మహాసముద్రం "మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. శర్వానంద్ కథానాయకుడిగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై తెలుగు , తమిళ భాషలలో "ఒకే ఒక జీవితం ", శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీస్ తెరకెక్కుతున్నాయి. హీరో శర్వానంద్ ప్రస్తుతం "ఆడవాళ్ళు మీకు జోహార్లు " మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో శర్వానంద్ ఇప్పుడు ఒక టైమ్ ట్రావెల్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

ప‌్లే బాయ్ గా శర్వానంద్?
యువ కథానాయకుడు శర్వానంద్ ఈ ఏడాది రెండు ఆసక్తికరమైన చిత్రాలతో అభిమానులను పలకరించనున్నాడు. వాటిలో ఒకటి... సుధీర్ వర్మ రూపొందిస్తున్న చిత్రం కాగా... మరొకటి `96` రీమేక్. ఈ రెండు సినిమాలు కూడా తక్కువ గ్యాప్‌లోనే తెరపైకి రాబోతున్నాయి. సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా మే నెలలో విడుదల కానుండగా... `96` రీమేక్ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో రిలీజ్ కానుందని సమాచారం.

నాగచైతన్య దర్శకుడితో శర్వానంద్?
యువ కథానాయకుడు శర్వానంద్ ఈ ఏడాది రెండు చిత్రాలతో సందడి చేయనున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న పేరు నిర్ణయించని సినిమా వేసవిలో విడుదల కానుండగా... తమిళ బ్లాక్‌బస్టర్ `96`కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెరపైకి రానుంది. ఈ రెండు సినిమాల తరువాత మరో ఆసక్తికరమైన సినిమాకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్.