
ట్యాగ్ · 12 కథనాలు


#SD15'.. మిస్టికల్ క్యాప్చర్..!

హ్యాపీ బర్త్ డే సార్..!

సాయి తేజ్ బ్యాక్ టు షూట్.. #SD15 షూటింగ్ ప్రారంభం..!

సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ హీరోయిన్

సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్?

సోలో బ్రతుకే సో బెటర్` అంటున్న సాయితేజ్?
'రిపీట్' బాటలో మెగా కాంపౌండ్ హీరోలు

‘ప్రస్థానం’ దర్శకుడితో మెగా హీరో?

‘ప్రతి రోజూ పండగే’ అంటున్న సాయితేజ్ ?

మారుతి డైరెక్షన్ లో మెగా హీరో?

ఆ మూవీ రీమేక్ నేను చేయట్లేదు

సూపర్ హీరో "థోర్ "కి సాయి తేజ్ ప్రమోషన్
హాలీవుడ్ లో సూపర్ హీరో ఫ్రాంఛైజీ `థోర్` ఈ కేటగిరీలో పెద్ద సక్సెసైంది. థోర్ కి నేటితరం కిడ్స్ లో బోలెడంత ఫాలోయింగ్ ఉంది.ఇక థోర్ కి ఉన్నట్టే సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కి కూడా కిడ్స్ లో కొంత ఫాలోయింగ్ ఉంది. అతడి మ్యాన్ లీ నెస్ .. మంచితనం అన్ని జనరేషన్ల వారికి నచ్చుతుంది. అందుకేనేమో.. ఇప్పుడు థోర్ కి సాయి తేజ్ ప్రమోషన్ చేస్తున్నారు.

#SD15'.. మిస్టికల్ క్యాప్చర్..!
కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. నిజానికి ఈసినిమా ఎప్పుడో మొదలవ్వాలి. అయితే కరోనా వల్ల కొంత కాలం లేట్ అయితే ఆతర్వాత సాయి తేజ్ కు యాక్సిడెంట్ అవ్వడంతో మొత్తానికి బ్రేక్ పడింది. సాయి తేజ్ పూర్తిగా కోలుకొని తిరిగి సెట్స్ పైకి వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చిత్రయూనిట్ సాయి తేజ్ కు గ్రాండ్ వెల్ కమ్ ఇచ్చారు. ఆయనకు పూలాభిషేకంతో యూనిట్ సభ్యులు స్వాగతం కూడా పలికారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

హ్యాపీ బర్త్ డే సార్..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో దేవకట్టా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘వెన్నెల’ సినిమాతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన దేవకట్టా.. ఆ తర్వాత ‘ప్రస్థానం’ సినిమాతో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ తరువాత పలు సినిమాలు చేశాడు. అయితే బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి. కానీ రీసెంట్ గా వచ్చిన రిపబ్లిక్ సినిమాతో హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఇక నేడు దేవకట్టా తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈసందర్భంగా ఆయనకు ఇండస్ట్రీ నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి.

సాయి తేజ్ బ్యాక్ టు షూట్.. #SD15 షూటింగ్ ప్రారంభం..!
మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సాయి తేజ్. ఇటీవల హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని చాలా జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటున్నాడు. దీనిలో భాగంగానే గత ఏడాది రిపబ్లిక్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం రాజకీయాలు, ప్రభుత్వ వ్యవస్థలపై రాజకీయాల ప్రభావం ఎలా ఉంటుందో ఈసినిమాలో చూపించాడు. ఇక ఈసినిమా తరువాత కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి తేజ్ మిస్టికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే కదా.

సాయి ధరమ్ తేజ్ ఫేవరేట్ హీరోయిన్
సూపర్ హిట్ "పిల్లా నువ్వు లేని జీవితం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి ధరమ్ తేజ్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ", "సుప్రీమ్ ", "చిత్రలహరి" , "ప్రతి రోజూ పండగే ", "సోలో బ్రతుకే సో బెటర్ " వంటి సూపర్ హిట్ మూవీస్ లో సాయి ధరమ్ తేజ్ తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ , డ్యాన్సింగ్ స్కిల్స్ తో ప్రేక్షకులను అలరించారు.

సాయితేజ్ కి జంటగా నివేదా పెతురాజ్?
గత ఏడాది `చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే` రూపంలొ రెండు వరుస విజయాలు అందుకున్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న `సోలో బ్రతుకే సో బెటర్`తో ఈ మెగా కాంపౌండ్ హీరో బిజీగా ఉన్నాడు. నూతన దర్శకుడు సుబ్బు రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సోలో బ్రతుకే సో బెటర్` అంటున్న సాయితేజ్?
`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే`... ఇలా క్యాచీ టైటిల్స్‌తోనే వరుస సినిమాలు చేస్తున్న మెగా కాంపౌండ్ హీరో సాయి తేజ్... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి కూడా అదే శైలిని కొనసాగిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన ‘మనీ’ (1993) చిత్రంలోని “భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు” పాట పల్లవిలో వినిపించే `సోలో బ్రతుకే సో బెటర్`అనే పంక్తితో సాయితేజ్ కొత్త సినిమా రాబోతుందని సమాచారం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్దరు నాయికలకు స్థానముండగా…
'రిపీట్' బాటలో మెగా కాంపౌండ్ హీరోలు
మెగా కాంపౌండ్‌కి చెందిన యంగ్ హీరోలు అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయితేజ్... తమ తాజా చిత్రాలకి సంబంధించి ఒకే బాటలో పయనిస్తున్నారు. ఇంతకీ అదేమిటంటే... ఈ ముగ్గురు కూడా ఆ యా సినిమాల్లో ఇప్పటికే జోడీకట్టిన కథానాయికలతో మరోసారి జట్టుకట్టి రిపీట్ మంత్రం పఠిస్తున్నారు.

‘ప్రస్థానం’ దర్శకుడితో మెగా హీరో?
ఈ వేసవికి విడుదలైన ‘చిత్రలహరి’తో మెమరబుల్ హిట్ అందుకున్న మెగాహీరో సాయి తేజ్... మారుతి దర్శకత్వంలో ‘ప్రతీ రోజు పండగే’ (ప్రచారంలో ఉన్న పేరు) చిత్రం చేయబోతున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమా... ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపొందనుందని సమాచారం. ఇదిలా ఉంటే... తాజాగా మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ మెగాహీరో.

‘ప్రతి రోజూ పండగే’ అంటున్న సాయితేజ్ ?
‘తాత మనవడు’ నుంచి ‘మా నాన్నకి పెళ్లి’ వరకు మూడు తరాల నేపథ్యంలో సాగే పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. ఇప్పుడు అదే బాటలో మరో సినిమా రాబోతోందని సమాచారం.

మారుతి డైరెక్షన్ లో మెగా హీరో?
ఎట్టకేలకు సాయి తేజ్ కు చిత్రలహరి సినిమాతో పెద్ద రిలీఫే దొరికింది. ఒకటి కాదు రెండు కాదు వరుసగా ఆరు ఫ్లాప్ లతో సతమతమవుతున్న ఈ యంగ్ హీరోకు ఈసారి మాత్రం హిట్ తప్పనిసరైంది. అలాంటి పరిస్థితుల్లో తన ఆశలన్నీ చిత్రలహరి సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక తన అంచనాలను నిజం చేస్తూ మంచి టాక్ నే సంపాదించుకుంది. కలెక్షన్లు కూడా బాగానే రాబట్టింది.

ఆ మూవీ రీమేక్ నేను చేయట్లేదు
మెగా మేల్లుడు సాయి తేజ్ ప్రస్తుతం తన హోప్స్ అన్నీ 'చిత్రలహరి' సినిమాపైనే పెట్టుకున్న సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా హిట్స్ కోసం ఎదురుచూస్తున్న తేజ్.. ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. ఇక రిలీజ్ కూడా దగ్గరలో ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నాడు తేజ్. మరి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 12వరకూ ఆగాల్సిందే.