
ట్యాగ్ · 9 కథనాలు


ప్రధాని మోదీని కలిసిన 'ఇసైజ్ఞాని'

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

ప్రధాని మోదీ.. నాతో ఏం చెప్పారంటే? - మెగాస్టార్

రాజ్యసభ సభ్యత్వం పై చిరు స్పందన..!

పార్లమెంట్‌లో ‘ఛావా’ స్పెషల్ స్క్రీనింగ్.. హాజరుకానున్న ప్రధాని మోదీ
బాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'ఛావా' అరుదైన గౌరవం దక్కించుకుంది. మార్చి 27న పార్లమెంట్‌లో ఈ మూవీ స్పెషల్ స్క్రీనింగ్ జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరుకానుండటం విశేషం. అలాగే ఆయనతోపాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరియు బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు రానున్నట్టు తెలుస్తోంది. ఇలా పార్లమెంట్‌లో స్పెషల్ స్క్రీనింగ్ జరుపుకున్న అతికొద్ది చిత్రాలలో ఛావా స్థానం దక్కించుకోవడం గమనార్హం.

ప్రధాని మోదీని కలిసిన 'ఇసైజ్ఞాని'
లెజెండరీ మ్యూజిక్ కంపోజర్, 'ఇసైజ్ఞాని' ఇళయరాజా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ మేరకు ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానితో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ''మోదీజీతో ఈ భేటీ నాకు చిరస్మరణీయమైనది. నా 'సింఫొనీ-వాలియంట్' సహా పలు అంశాల గురించి ఇరువురం చర్చించాం. ఆయన ప్రశంసలు, మద్దతుకి హృదయపూర్వక కృతజ్ఞతలు'' అని అందులో తెలిపారు.

ప్రధాని మోదీకి థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు తాజాగా ఆయన ప్రధానితో పాల్గొన్న వీడియో కాన్ఫరెన్స్ అనంతరం సోషల్ మీడియా వేదికగా థ్యాంక్స్ చెప్పారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది చివరిలో ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్' అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడమే దీని ముఖ్య ఉద్దేశం.

ప్రధాని మోదీ.. నాతో ఏం చెప్పారంటే? - మెగాస్టార్
మెగా బ్రదర్స్‌తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటామంతి.. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న విషయం. నేషనల్ మీడియాలో సైతం ఈ వార్తకు అధిక ప్రాధాన్యం లభించిందంటే అర్ధం చేసుకోవచ్చు ఇది ఎంత సెన్సేషన్ అయిందో. ఈ అపూర్వ సన్నివేశానికి వేదికైంది మాత్రం ఆంధ్రప్రదేశ్. బుధవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు.

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు 'భారతరత్న'.. ప్రధాని మోదీ హర్షం
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలుగువారికి గర్వకారణమైన నేత, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' ప్రకటించింది. ఆయనతో పాటు మరో మాజీ ప్రధాని చౌదరి చరణ్‌సింగ్ మరియు దిగ్గజ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కూడా కేంద్రం భారతరత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఇక పీవీ నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం పట్ల ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. విభిన్న హోదాల్లో పనిచేసిన పీవీ మేధావి అని, నిజమైన రాజనీతజ్ఞుడని మోదీ కీర్తించారు.

ప్రధాని మోడీ, క్రికెట్ గాడ్ సచిన్‌లతో వేదిక పంచుకోనున్న రామ్ చరణ్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్ సినిమాపైనే చర్చ జరుగుతుంది ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు గెల్చుకోవడంతో ప్రతి ఒక్కరూ ఈ సినిమాను మెచ్చుకుంటున్నారు. సామాన్యుల నుంచి స్టార్ సెలబ్రిటీలు , రాజకీయ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పార్లమెంట్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ పై ప్రశంసలు దక్కాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ టీమ్ ఇండియా రాగానే సన్మానించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

స్వామి మహారాజ్ శతాబ్ది మహోత్సవాలకు రామ్‌చరణ్ కు ఆహ్వానం
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న#RC15 మూవీ లో నటిస్తున్నారు. రామ్ చరణ్ తాజాగా అహ్మదాబాద్ లో జరిగే ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు.

రాజ్యసభ సభ్యత్వం పై చిరు స్పందన..!
సినీ పరిశ్రమ నుండి రాజ్యసభ సభ్యులుగా ప్రముఖ సంగీత దర్శకుడు మ్యాస్ట్రో ఇళయరాజాను అలానే ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ను నియమిస్తున్నట్లు స్వయంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈమేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా వారికి అభినందనలు తెలుపుతూ మరీ పోస్ట్ చేశారు.

రాజ్యసభకు నామినేట్ అయిన సినీ ప్రముఖులు ఇళయరాజా , విజయేంద్రప్రసాద్
మ్యూజిక్ కంపోజర్ , సింగర్ , లిరిసిస్ట్ ఇళయరాజా తమిళ , తెలుగు భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించి ప్రేక్క్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాలుగా తమిళ , తెలుగు భాషలలో సుమారు 1400 సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశారు. సుమారు 20000 స్టేజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. 5 నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఇసై జ్ఞాని , మ్యాస్ట్రో ఇళయరాజా ను పద్మ విభూషణ్ , పద్మ భూషణ్ పురస్కారాలతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.