
ట్యాగ్ · 50 కథనాలు · పేజీ 3


#NBK 106 మూవీ లో కీలక పాత్ర లో స్నేహ

#NBK106 మూవీ లో యంగ్ హీరో ?
హీరో బాలకృష్ణ "మోనార్క్ "?
"NBK 106 " లో బాలకృష్ణ సెకండ్ లుక్ ?

దసరా బరిలో ‘యన్.బి.కె.106’?
`యన్.బి.కె. 106` కోసం పాయల్ తో సంప్రదింపులు?
మరోసారి బాలయ్యతో..!

ఈ నెల 26 నుంచి `యన్.బి.కె 106` రెగ్యులర్ షూటింగ్

"BB3"మూవీ షూటింగ్ పునః ప్రారంభం
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ ఎంటర్ టైనర్ మూవీస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ " BB3"మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. అఘోరా గా ఒక పాత్ర , మరో పవర్ ఫుల్ పాత్రలో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ "సింహా ", "లెజెండ్ " మూవీస్ తరువాత బోయపాటి , బాలకృష్ణ సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతుంది. షూటింగ్ ఒక షెడ్యూల్ తరువాత లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

#NBK 106 మూవీ లో కీలక పాత్ర లో స్నేహ
పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను అలరించిన స్నేహ వివాహానంతరం సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు , తమిళ మూవీస్ లో స్నేహ నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన "వినయ విధేయ రామ " మూవీ లో నటించిన స్నేహ తిరిగి బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

#NBK106 మూవీ లో యంగ్ హీరో ?
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "సింహా " , "లెజండ్ " మూవీస్ తరువాత దర్శకుడు బోయపాటి , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందుతున్న #NBK106 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
హీరో బాలకృష్ణ "మోనార్క్ "?
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ NBK 106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో ప్రారంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
"NBK 106 " లో బాలకృష్ణ సెకండ్ లుక్ ?
ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా "NBK 106 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒకటి అఘోరా కాగా మరొక లుక్ ఫైనలైజ్ కావాల్సిఉంది. వారణాసి బ్యాక్ డ్రాప్ లో 40 రోజులు షూటింగ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా కారణం గా వారణాసి లో షూటింగ్ జరపడం కష్టం కనుక దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసినట్టు సమాచారం.

దసరా బరిలో ‘యన్.బి.కె.106’?
‘సింహా’, ‘లెజెండ్’.. ఇలా నటసింహ బాలకృష్ణ మాస్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు బాక్సాఫీస్‌ని షేక్ చేశాయి. విశేషంగా ఈ రెండు సినిమాలు కూడా ఆ యా సంవత్సరాల్లో సమ్మర్ సీజన్‌లోనే సందడి చేశాయి. కట్ చేస్తే.. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న తదుపరి చిత్రం మాత్రం అందుకు భిన్నంగా మరో సీజన్‌లో వినోదాలు పంచనుందని టాక్.
`యన్.బి.కె. 106` కోసం పాయల్ తో సంప్రదింపులు?
`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కాకపోతే, సీనియర్ స్టార్ వెంకటేష్ తో కలసి నటించిన `వెంకిమామ` కాస్త ఊరటనిచ్చింది. కాగా, మరో సీనియర్ హీరోతో పాయల్ నటించే అవకాశముందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ తో కథనాలు వినిపిస్తున్నాయి.
మరోసారి బాలయ్యతో..!
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా..సెకండ్ షెడ్యూల్ ను ఏప్రిల్ నుండి మొదలుపెట్టనున్నారు. కరోనా కారణంగా కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఏప్రిల్ నుండి మరో షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు.

`యన్.బి.కె 106`లో బాలకృష్ణ చార్ట్ బస్టర్ సాంగ్ రీమిక్స్?
నటసింహ నందమూరి బాలకృష్ణ కెరీర్ లో పలు మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `బంగారు బుల్లోడు` (1993) ఒకటి. ఇందులోని అన్ని పాటలూ అప్పట్లో విశేషాదరణ పొందాయి. మరీ ముఖ్యంగా... `స్వాతిలో ముత్యమంత` పాట అయితే ఇప్పటికీ ఎవర్ గ్రీన్. కట్ చేస్తే.. ఇప్పుడీ చార్ట్ బస్టర్ సాంగ్ ని `యన్.బి.కె. 106`కోసం రీమిక్స్ చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

ఈ నెల 26 నుంచి `యన్.బి.కె 106` రెగ్యులర్ షూటింగ్
నటసింహ బాలకృష్ణ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న `యన్.బి.కె. 106` ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్ళనుంది. బాలయ్య లక్కీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందనున్న ఈ డివోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్.. ఈ నెల 26 నుండి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుందట. వారణాసి నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో దర్శనమివ్వనుండగా.. ఒక పాత్ర కోసం అఘోరాగా కనిపిస్తాడని టాక్. ఇక ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో శ్రియ, నయనతార ఆ పాత్రల్లో నటిస్తారని ప్రచారం సాగుతోంది.