
ట్యాగ్ · 329 కథనాలు · పేజీ 17

మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?

నటసింహ బాలకృష్ణ ‘లెజెండ్’కు ఆరేళ్ళు

మలయాళ రీమేక్ లో బాలకృష్ణ?

బాలయ్యతో ఆ ఇద్దరు.. నాలుగోసారి?

"తలైవి " మూవీ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ నటుడు ?
విబ్రి మీడియా, కర్మా మీడియా &ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై లెజెండరీ యాక్ట్రెస్, పొలిటికల్ లీడర్, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో "తలైవి " మూవీ తమిళ , తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. జయలలిత రీల్, రియల్ లైఫ్ లో జరిగిన ముఖ్య సంఘటనలతో తెరకెక్కుతున్న "తలైవి " మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జయలలిత, అరవింద్ స్వామి MGR, ప్రకాష్ రాజ్ కరుణానిథి , శోభన్ బాబు జిషు సేన్ గుప్తా, శశికళ గా పూర్ణ నటిస్తున్నారు. జి వి ప్రకాష్ కుమార్, రచిత అరోరా సంగీతం అందించారు.
మల్టీ స్టారర్ మూవీ లో బాలకృష్ణ ?
టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ మూవీస్ ట్రెండ్ నడుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ ల "F2", వేంకటేష్ , నాగచైతన్య "వెంకీ మామ" మల్టీస్టారర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. నాని, సుధీర్ బాబు నటించిన మల్టీ స్టారర్ మూవీ "V" విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ "రౌద్రం రణం రుధిరం " మూవీ షూటింగ్ జరుపుకుంటుంది. యంగ్ హీరోలతోపాటు సీనియర్ హీరోలు కూడా మల్టీ స్టారర్ మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు.

బాబోయ్ మళ్లీ ఎన్టీఆర్ పాత్రలో చేయను...!
మళ్లీ ఎన్టీఆర్ పాత్రను చేయనని నిర్ణయించుకున్నట్టు ఉన్నాడు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. అసలు సంగతేంటంటే...ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్టీఆర్ కథానాయకుడు', ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాలో తన తండ్రి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బయోపిక్ లో ఎన్టీఆర్ పాత్రలో నటించిన బాలకృష్ణ నటనకు మంచి మార్కులే పడ్డాయి కానీ.. సినిమా మాత్రం అనుకున్నంత విజయం దక్కించుకోలేకపోయింది అని చెప్పొచ్చు. దీనితో బాలకృష్ణ కాస్త నిరాశపడ్డారట. అందుకే మరోసారి ఎన్టీఆర్ పాత్రలో నటించడానికి నో చెప్పారట.

`రామారావు`కి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్?
`పటాస్` నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు వరుసగా ఐదు విజయాలు నమోదు చేసి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి. కాగా, ‘సరిలేరు నీకెవ్వరు’ తరువాత అనిల్ చేయబోయే సినిమా ఏంటో ఇంకా క్లారిటీ రాలేదు. `ఎఫ్ 2` సీక్వెల్ చేయబోతున్నాడంటూ ఒకవైపు.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ పక్కా అంటూ మరోవైపు కథనాలు వస్తున్నాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే... నటసింహ బాలకృష్ణతో అనిల్ నెక్స్ట్ వెంచర్ ఉంటుందని టాక్.

నటసింహ బాలకృష్ణ ‘లెజెండ్’కు ఆరేళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. అలాంటి బాలయ్య, బోయపాటి కలయికలో ‘సింహా’(2010) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటించారు. జగపతిబాబు, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, అజయ్, బ్రహ్మాజీ, ‘ఆహుతి’ ప్రసాద్, సుజాతా కుమార్, కళ్యాణి, ఈశ్వరీ రావు, సితార తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సుహాసిని అతిథి పాత్రలో కనిపించగా... హంసా నందిని ఐటమ్ సాంగ్‌లో నర్తించింది.

మలయాళ రీమేక్ లో బాలకృష్ణ?
నటసింహ నందమూరి బాలకృష్ణ పలు రీమేక్ చిత్రాల్లో నటించడమే కాకుండా... ఘనవిజయాలను సైతం అందుకున్నారు. తన కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలచిన `మంగమ్మ గారి మనవడు` రీమేక్ మూవీనే. అలాగే `ముద్దుల మావయ్య`, `లక్ష్మీ నరసింహ`... ఇలా పలు సక్సెస్ ఫుల్ రీమేక్స్ లోనూ నటించిన వైనం బాలయ్య సొంతం. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రం, ఆపై బి.గోపాల్ డైరెక్షన్ లో మరో సినిమా చేయనున్న నటసింహ... త్వరలో ఓ రీమేక్ ఫిల్మ్ లో నటించే అవకాశముందట. అది కూడా.. ఓ మల్టీస్టారర్ సబ్జెక్ట్ కోసం.
కలర్ ఫుల్ సాంగ్ తో `యన్.బి.కె. 106` నెక్స్ట్ షెడ్యూల్
`నారీ నారీ నడుమ మురారి` తరహా గీతాలకు పెట్టింది పేరు నటసింహ నందమూరి బాలకృష్ణ. పలు చిత్రాల్లో ఈ తరహా పాటలతో మాస్ ని ఉర్రూతలూగించారాయన. కట్ చేస్తే.. తన నెక్స్ట్ వెంచర్ లో కూడా ఇలాగే ఇద్దరు నాయికలతో కలసి ఓ మాస్ సాంగ్ లో ఆడిపాడనున్నారట బాలయ్య.

బాలయ్యతో ఆ ఇద్దరు.. నాలుగోసారి?
నటసింహ బాలకృష్ణ, యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ బోయపాటి శ్రీనుది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గతంలో ఈ ఇద్దరి కలయికలో వచ్చిన `సింహా`, `లెజెండ్` సంచలన విజయం సాధించాయి. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ ఇరువురు జట్టుకట్టారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న సదరు చిత్రం... త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభించుకోనుంది.

45 ఏళ్ళ కెరీర్‌ని పూర్తిచేసుకున్న నందమూరి బాలకృష్ణ
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం... ఇలా జానర్ ఏదైనా తన నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించారు, మెప్పిస్తున్నారు. అలాంటి బాలకృష్ణ నటప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘తాతమ్మ కల’. తన తండ్రి, మహానటుడు యన్.టి.రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాల నటుడిగా (14 ఏళ్ళు) దర్శనమిచ్చారు బాలయ్య. తొలి చిత్రంతోనే అభినయానికి పుష్కలంగా అవకాశమున్న పాత్రలో నటించి ప్రశంసలు పొందారు.