
ట్యాగ్ · 70 కథనాలు · పేజీ 4


2022 సంక్రాంతి బరిలోకి 'పొన్నియన్ సెల్వన్'..!
నటి కావాలని కలలు కన్నా- అదితి రావు హైదరి
హైదరాబాద్ లో ఐశ్వర్య రాయ్
"పొన్నియిన్ సెల్వన్ " మూవీ అప్ డేట్
తెలుగు దర్శకులతో మణిరత్నం వెబ్ సిరీస్ ?
"రోజా 2 " మూవీ లో హీరో దుల్కర్ సల్మాన్ ?
హీరోలు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి..!

ఆ లిస్ట్ లో మణిరత్నం కొడుకు కూడా..!

`పొన్నియిన్ సెల్వన్` సెకండ్ షెడ్యూల్ పూర్తి

'సినిమాటిక్ జీనియస్' కు హ్యాపీ బర్త్ డే
దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలి మేకింగ్‌తో చిత్రాలను తెరకెక్కిస్తూ… అభిరుచి గల ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. ఇప్పుడు కొత్త కొత్త దర్శకులు.. కొత్త కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా ఆయనకు ఉండే ఫ్యాన్ బేస్ సెపరేట్ గానే ఉంటుంది. కన్నడలో పల్లవి అనుపల్లవి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మణిరత్నం ఆ తర్వాత మౌనరాగం మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. చిన్న కథే అయినా.. తన టేకింగ్ ఎలా ఉంటుందో స్పష్టంగా ఆ సినిమా ద్వారా చూపించాడు. ఈ సినిమాతో మణిరత్నం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ కూడా అయ్యింది. ఇక…

2022 సంక్రాంతి బరిలోకి 'పొన్నియన్ సెల్వన్'..!
మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తుండటంతో మణిరత్నం కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈసినిమాకు నటీనటులను కూడా అదే రేంజ్ లో తీసుకున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే డెబ్బై శాతం చిత్రీకరణ కూడా పూర్తయ్యింది. మధ్యలో కోరనా వల్ల షూటింగ్ బ్రేక్ పడింది కానీ లేకపోతే ఈపాటికి షూటింగ్ పార్ట్ పూర్తయి ఉండేది. మళ్లీ ఇటీవలే షూటింగ్ ను మొదలుపెట్టాడు మణిరత్నం.
నటి కావాలని కలలు కన్నా- అదితి రావు హైదరి
అదితి రావు హైదరి “ప్రజాపతి “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్న “శృంగారం”మూవీ లో దేవదాసి పాత్రలో నటించి అదితి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఢిల్లీ -6″మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బాలీవుడ్ లో బిజీగా మారిన అదితి 10 సంవత్సరాల తరువాత మణి రత్నం దర్శకత్వంలో రూపొందిన "కాట్రు వెళియిదై " (చెలియా ) మూవీ తో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. మణిరత్నం గారితో పనిచేయడం వల్ల ఎంతో పరిణతి సాధించాననీ , మణిరత్నం గారి ఇన్ స్పిరేషన్ తో మూవీస్ ఎంపిక చేసుకుంటున్నాననీ, నటి కావాలనే తన కలలు నెరవేరాయనీ అదితి చెప్పారు.
హైదరాబాద్ లో ఐశ్వర్య రాయ్
మిస్ వరల్డ్ (1994) ఐశ్వర్య రాయ్ ,మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన "ఇరువర్ " తమిళ తో కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ "ఔర్ ప్యార్ హోగయా" మూవీ తో ఐశ్వర్య రాయ్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. బాలీవుడ్ లో ఐశ్వర్య కథానాయికగా నటించిన పలు మూవీస్ ఘనవిజయం సాధించాయి. సూపర్ హిట్ "జీన్స్ ", "రోబో "వంటి మూవీస్ తో ఐశ్వర్య తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. "హమ్ దిల్ దే చుకే సోనమ్ ", "దేవదాస్ " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఐశ్వర్య బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. 2010 సంవత్సరం లో "ఏంథిరన్ "(రోబో ) మూవీ నటించిన ఐశ్వర్య 10 సంవత్సరాల తరువాత ఒక తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
"పొన్నియిన్ సెల్వన్ " మూవీ అప్ డేట్
మద్రాస్ టాకీస్ , లైకా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కల్కి కృష్ణ మూర్తి నవల "పొన్నియిన్ సెల్వన్ " ఆధారంగా హిస్టారికల్ డ్రామా "పొన్నియిన్ సెల్వన్ " మూవీ రెండు భాగాలుగా రూపొందుతున్న విషయం తెలిసిందే. చియాన్ విక్రమ్ , జయం రవి , కార్తీ , ఐశ్వర్య రాయ్ , త్రిష , శోభిత ధూళిపాళ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ థాయ్ ల్యాండ్ లో జరుపుకున్న "పొన్నియిన్ సెల్వన్ " మూవీ షూటింగ్ సెకండ్ షెడ్యూల్ పుదుచ్చేరి లో జరుపుకుంది. కరోనా కారణం గా ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది.
తెలుగు దర్శకులతో మణిరత్నం వెబ్ సిరీస్ ?
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం భారత పురాణ కథలతో అమెజాన్ ప్రైమ్ కొరకు ఒక వెబ్ సిరీస్ రూపొందించనున్నారని సమాచారం. ఈ వెబ్ సిరీస్ లో 9 ఎపిసోడ్స్ ఉంటాయని, ఒక్కొక్క ఎపిసోడ్ కు ఒక తెలుగు దర్శకుడు దర్శకత్వం వహిస్తారని, కొంతమంది తెలుగు దర్శకులతో మణిరత్నం చర్చలు జరుపుతున్నారని సమాచారం.
"రోజా 2 " మూవీ లో హీరో దుల్కర్ సల్మాన్ ?
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో అరవింద్ స్వామి, మధూ జంటగా రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ "రోజా " తమిళ మూవీ 1992 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. తెలుగు , మలయాళ , హిందీ, మరాఠీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. 3 నేషనల్ అవార్డ్స్ తో పాటు పలు అవార్డ్స్ అందుకున్న "రోజా " మూవీ కి ఇప్పుడు సీక్వెల్ రూపొందనుందని సమాచారం.
హీరోలు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి..!
కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దీనితో నిర్మాతలు కాస్త ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో లాగ షూటింగ్ లు పూర్తి చేసి సినిమాలు రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పరిస్థితులను అర్థంచేసుకోవాలని అన్నారు మణిరత్నం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘‘థియేట్రికల్ బిజినెస్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంత వరకు స్టార్ హీరోలు, పెద్ద టెక్నీషియన్లు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది’’ అని అన్నారు. మరి ఇప్పటికే కొంతమంది హీరోలు…

ఆ లిస్ట్ లో మణిరత్నం కొడుకు కూడా..!
కరోనా వల్ల ప్రపంచం మొత్తం ఒక్కసారిగా స్తంభించి పోయింది. రోజు రోజుకి ఈ వైరస్ తీవ్రత ఎక్కువవుతుండటంతో.. ప్రజలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు. కరోనా వైరస్ బాధితుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అయ్యాయి. అంతేకాదు ఎవరికి వారు స్వయంగా జాగ్రత్తులు తీసుకుంటున్నారు. స్వతహాగా గృహ నిర్బంధం అవుతున్నారు. ఇప్పటికే సెలెబ్రిటీస్ అందరు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు.

`పొన్నియిన్ సెల్వన్` సెకండ్ షెడ్యూల్ పూర్తి
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం `పొన్నియిన్ సెల్వన్`. మోహన్ బాబు, విక్రమ్, `జయం` రవి, కార్తి, ఐశ్వర్యా రాయ్, త్రిష తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని లైకా సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. డబుల్ ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ సంగీతమందిస్తున్నాడు.