
ట్యాగ్ · 8 కథనాలు


'లూసిఫర్' రీమేక్.. వివేక్ పాత్రలో సత్యదేవ్..!

"లూసిఫర్ "మూవీ రీమేక్ కు ముహూర్తం ఫిక్స్

చిరు సినిమాలో సముద్రఖని..!

లూసిఫర్ రీమేక్ - ఏప్రిల్ లో సెట్స్ పైకి
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?
‘లూసీఫర్’ రీమేక్ కు ముహూర్తం ఖరారు..?

కాకినాడ పోర్ట్ లో "లూసిఫర్ "
సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధాన పాత్రలలో రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది.కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ మూవీ తెరకెక్కనుంది . లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.ఫస్ట్ సాంగ్‌ను లండన్‌లోని అబ్బేరోడ్ స్టూడియోలో రికార్డ్ చేసినట్టు థమన్ ట్వీట్ చేశారు.

'లూసిఫర్' రీమేక్.. వివేక్ పాత్రలో సత్యదేవ్..!
మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన వచ్చిన లూసిఫర్ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరు రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఆచార్య సినిమా అయిపోయిన వెంటనే చిరు ఈ సినిమానే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నటించే నటుల గురించి ఇప్పటికే పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. చిరు ఒక్క పాత్ర తప్ప మిగిలిన కీలక పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే చిరు జోడిగా నయనతార నటిస్తున్నట్టు ఇప్పటికే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. ఆతరువాత పృథ్వి రాజ్ పాత్రలో బన్నీ, రానా తో పాటు పలువురి పేర్లే తెరపైకి వచ్చాయి.

లండన్ లో "లూసిఫర్"రీమేక్ సాంగ్స్ రికార్డింగ్
సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ తెరకెక్కనుంది . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

"లూసిఫర్ "మూవీ రీమేక్ కు ముహూర్తం ఫిక్స్
ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా రూపొందిన “లూసిఫర్ “మలయాళ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ మూవీ మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ , ఎన్వీ ప్రసాద్ నిర్మాతలుగా తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఈ రీమేక్ మూవీ ని తెరకెక్కించనున్నారు.

చిరు సినిమాలో సముద్రఖని..!
మొత్తానికి టాలీవుడ్ లో తమిళ నటీనటులను బాగానే వాడుతున్నారు. ముఖ్యంగా సముద్రఖని లాంటి వారిని అయితే అస్సలు వదిలిపెట్టట్లేదు. పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించే అవకాశం దక్కించుకుంటున్నాడు సముద్రఖని. ఇక ఇప్పుడు మరో సినిమాలో అవకాశం దక్కించుకున్నట్టు తెలుస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరు సినిమాలో. ప్రస్తుతం చిరు ఆచార్య సినిమాను పూర్తి చేసే పనిలో పనిలో పడ్డాడు. ఈసినిమా అయిపోయిన వెంటనే లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

లూసిఫర్ రీమేక్ - ఏప్రిల్ లో సెట్స్ పైకి
మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క ఆచార్య సినిమా చేస్తూనే మరోపక్క మూడు సినిమాలను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆచార్య సినిమా తరువాత మలయాళ సూపర్ హిట్ సినిమా లూసిఫర్ రీమేక్ చేయనున్నాడు. ఇక దీని తర్వాత మెహర్ రమేష్ తో ఆతర్వాత బాబితో సినిమాలు చేయనున్నాడు. ప్రస్తుతం అయితే ఆచార్య షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. దీనితో లూసిఫర్ రీమేక్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?
సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.
‘లూసీఫర్’ రీమేక్ కు ముహూర్తం ఖరారు..?
మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ విషయంలో మాత్రం కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నా ఇటీవలే ఈ రీమేక్ డైరెక్టర్ విషయంలో క్లారిటీ వచ్చింది. తమిళ ఇండస్ట్రీలో రీమేక్ స్పెషలిస్టుగా పేరుగాంచిన మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.