కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 108

Saripodhaa Sanivaaram Pre Release Event Date Announced
సినిమా వార్తలు

సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తుండగా.. SJ సూర్య, సాయికుమార్, అజయ్, అదితిబాలన్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ అడ్రినలిన్‌ ఫిల్డ్ యాక్షన్-అడ్వెంచర్‌ ఇప్పటికే ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Thalapathy Vijay's The GOAT Censored With UA Certificate
సినిమా వార్తలు

ది గోట్ సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కి రెడీ

కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)'. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్‌లో కనిపించనున్నాడు. స్నేహ, మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటించగా ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, లైలా, యోగిబాబు, వీటీవీ గణేష్, జయరామ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Congratulated Aay Team on The Massive Success
సినిమా వార్తలు

ఆయ్ టీమ్‌ను అభినందించిన ఐకాన్ స్టార్

మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ప్రేక్ష‌కాద‌ర‌ణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Telusu Kada Team Welcomes Actress Srinidhi Shetty on Board
సినిమా వార్తలు

తెలుసు కదా.. శ్రీనిధి శెట్టికి వెల్‌కమ్ చెప్పిన టీమ్

స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తోన్న న్యూ మూవీ 'తెలుసు కదా'. రాశి ఖన్నా, కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తుండగా.. వైవా హర్ష ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజ కోన ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమౌతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లావిష్‌గా నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ మొదటి షెడ్యూల్‌లో కొన్ని టాకీ పార్ట్‌లతో పాటు పాటలను కూడా షూట్ చేస్తున్నారు. ఇది మొత్తం 30 రోజుల పాటు సాగే క్రూషియల్ షెడ్యూల్ అని మేకర్స్ తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Producer DVV Danayya Gives Interesting Update on Pawan Kalyan's OG
సినిమా వార్తలు

ఓజీ గురించి అదిరిపోయే అప్‌డేట్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్ని నెలలుగా రాజకీయాలతో బిజీగా ఉంటూ వస్తున్నారు. అయితే ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసినందున ఇకపై ఆయన సినిమాలపై దృష్టి పెడతారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఉస్తాద్ భగత్ సింగ్', 'హరి హరవీరమల్లు', 'ఓజీ' సినిమాలు రూపొందుతోన్న విషయం తెలిసిందే. దీంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆయన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Superstar Mahesh Babu Gives Voice For Mufasa The Lion King
సినిమా వార్తలు

ఆ హాలీవుడ్ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు డబ్బింగ్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు డిస్నీ యొక్క విజువల్ స్టన్నింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ముఫాసా ది లయన్ కింగ్‌ తెలుగు వెర్షన్ కోసం వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నాడు. ఇందులో ప్రధానపాత్ర అయిన ముఫాసాకు ఆయన డబ్బింగ్ చెప్తుండటం విశేషం. కాగా గతంలో వచ్చిన హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘ది లయన్‌ కింగ్‌’ సినిమాకు ‘ముఫాసా: ది లయన్‌ కింగ్’ ప్రీక్వెల్‌గా వస్తోంది. ఇండియాలో ఈ యేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Thandel Hero Naga Chaitanya and Actress Sai Pallavi Congratulated Aay Team
సినిమా వార్తలు

ఆయ్ ఫన్ ఫెస్టివల్‌లో తండేల్ టీమ్ సందడి

మ్యాడ్ ఫేమ్ నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఆయ్’. ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మాత‌లుగా గోదావరి బ్యాక్ డ్రాప్‌లో ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆయ్ చిత్రం రూపొందింది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం అయ్యారు. స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న రిలీజైన ఈ ఫన్ ఎంటర్ టైనర్ ప్రేక్ష‌కాద‌ర‌ణతో పాజిటివ్ టాక్ తెచ్చుకుని థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Narne Nithin To Enter The Dussehra Race With Sri Sri Sri Rajavaru Movie
సినిమా వార్తలు

దసరా బరిలో నార్నె నితిన్ శ్రీ శ్రీ శ్రీ రాజావారు

మ్యాడ్, ఆయ్ లాంటి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాల హిట్‌తో దూసుకుపోతున్నారు నార్నె నితిన్. చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ వరుస హిట్లతో దూసుకుపోతున్నారు. ఇదే ఊపుతో ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేశారు. జాతీయ అవార్డు విన్నర్, "శతమానం భవతి" దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తాజాగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు, ఎమ్.సుబ్బారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంపద హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Randeep Hooda Joins For Gopichand Malineni and Sunny Deol's SDGM
సినిమా వార్తలు

గోపీచంద్ మలినేని, సన్నీడియోల్‌ మూవీలో స్టార్ యాక్టర్

'క్రాక్', 'వీరసింహారెడ్డి' సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద వరుస సక్సెస్‌లు అందుకున్న టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తాజాగా మరో సర్‌ప్రైజింగ్ ప్రాజెక్టుతో ప్రేక్షకులముందుకొస్తున్నాడు. గదర్ 2తో గతేడాది బాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సన్నీ డియోల్‌ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Sudheer Babu Strong Counter To Arshad Warsi Comments Against Prabhas
సినిమా వార్తలు

ప్రభాస్‌పై బాలీవుడ్ నటుడు కామెంట్స్.. సుధీర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్

'బాహుబలి' సినిమాతో తొలిసారిగా బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్. బాహుబలి ముందువరకూ సౌత్ సినిమాలంటే ఒకరకమైన చిన్న చూపు చూసే హిందీ జనాలకి ఈ సినిమా తర్వాత ఆ ధోరణి మారింది. అప్పటినించీ ప్రభాస్ నటించిన ప్రతి సినిమా అక్కడ స్టార్ హీరోలకు సమానంగా, ఒక్కోసారి అంతకుమించి అన్నట్టుగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపే కలెక్షన్స్‌తో సత్తా చాటుతోంది.

Srikanth Mవాట్సాప్
Lucky Baskhar Postponed and New Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

లక్కీ భాస్కర్‌ రిలీజ్ మళ్ళీ వాయిదా.. కొత్త డేట్ ఇదే!

మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌ 'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అప్పటినుంచీ ఆయన తరచుగా తెలుగులో సినిమాలు చేస్తున్నాడు. సీతారామం' చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ అందుకున్న దుల్కర్.. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చినకల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Excited For Indra Grand Re-release on August 22nd
సినిమా వార్తలు

కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర - చిరంజీవి

కమర్షియల్ చిత్రానికి పర్‌ఫెక్ట్ నిర్వచనం 'ఇంద్ర' సినిమా అని, అందులో నటీనటుల పెర్ఫార్మెన్స్ సహా కథ, డైలాగ్స్, సీన్స్, ఎమోషన్స్, మ్యూజిక్, సాంగ్స్, ఫైట్స్, ఫోటోగ్రఫీ.. ఇలా అన్నీ పీక్స్‌లో ఉంటాయని పేర్కొన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన జన్మదినం సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలు సహా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతుంది.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Congratulated The Committee Kurrollu Movie Team
సినిమా వార్తలు

క‌మిటీ కుర్రోళ్లు పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. సీనియ‌ర్ న‌టీన‌టుల‌తో పాటు 11 మంది హీరోలు, న‌లుగురు హీరోయిన్స్‌ను పరిచయం చేస్తూ ఈ చిత్రానికి య‌దు వంశీ దర్శకత్వం వహించారు.ఆగస్ట్ 9న ఈ చిత్రం విడుదల అవ్వగా. డిఫరెంట్ కంటెంట్‌తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని వసూళ్లను రాబడుతోంది.

Srikanth Mవాట్సాప్
Former Team India Cricketer Yuvraj Singh Biopic Getting Ready
సినిమా వార్తలు

యువరాజ్ సింగ్ బయోపిక్‌ అనౌన్స్‌మెంట్‍

ఇండియాలో క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. స్టార్ క్రికెటర్లనైతే దేవుళ్ళు మాదిరి భావిస్తుంటారు ఫ్యాన్స్. అలాంటివారిలో ఒకరు టీమిండియా మాజీ క్రికెటర్‌, స్టార్ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌ సింగ్‌. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ గెలవడంలో కీలక భూమిక పోషించాడు యువీ. ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అయితే ఇంగ్లాండ్‌పై మ్యాచ్‌లో ఏకంగా ఒకే ఓవర్లో 6 సిక్స్ లు బాది ప్రపంచ రికార్డ్ నెలకొల్పిన విషయాన్ని క్రికెట్ ప్రేమికులెవరూ అంత త్వరగా మర్చిపోలేరు.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju Praises Naa Favourite Naa Pellaame Song From Janaka Aithe Ganaka
సాంగ్

ప్ర‌తీ భ‌ర్త త‌న భార్య‌కు డేడికేట్ చేయాల్సిన పాట ఇది - దిల్‌ రాజు

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు. వెర్స‌టైల్ యాక్ట‌ర్‌ సుహాస్ హీరోగా న‌టించగా.. సంగీర్తన హీరోయిన్‍గా నటించింది. రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ కీలక పాత్రలు పోషించారు. సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేసిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 7న గ్రాండ్ రిలీజ్ కానుంది. హీరో సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం ఈ సినిమా నుంచి ‘నా ఫేవ‌రేట్ నా పెళ్లాం’ సాంగ్‌ను లాంచ్ చేశారు.

Srikanth Mవాట్సాప్
kiran abbavarm first single world of vasudev song image
సాంగ్

క నుండి ఫస్ట్ సింగిల్ వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' ను ఈ రోజు రిలీజ్ చేశారు. ఈ పాట హీరో కిరణ్ అబ్బవరం వాసుదేవ్ క్యారెక్టరైజేషన్ ను ఆవిష్కరించింది. 'వరల్డ్ ఆఫ్ వాసుదేవ్..' పాటకు సనాపతి భరద్వాజ పాత్రుడు లిరిక్స్ రాయగా..సామ్ సీఎస్ బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. కపిల్ కపిలన్ ఆకట్టుకునేలా పాడారు.

TFN Adminవాట్సాప్
Icon Star Allu Arjun To Attend For Maruthi Nagar Subramanyam Pre-release Event
సినిమా వార్తలు

ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా అల్లు అర్జున్

క్రియేటివ్ జీనియస్ సుకుమార్ భార్య తబిత సమర్పణలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రావు రమేష్ కథానాయకుడిగా నటించగా.. ఆయన సరసన ఇంద్రజ కథానాయికగా కనిపించనున్నారు. అలాగే యువ నటులు అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో.. అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Shares His Father Old Pic on World Photography Day
సినిమా వార్తలు

వరల్డ్ ఫోటోగ్రఫీ డే.. అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్

ఈరోజు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఓ అరుదైన ఫొటోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఆయన తన తండ్రి పాత ఫోటో ఒకటి షేర్ చేశారు. ఈ ఫొటోలో చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు గారు బ్లాక్ గాగూల్స్‌ పెట్టుకుని సైకిల్ ప‌ట్టుకుని నిల్చుని ఉన్నారు. అయితే ఈ ఫోటోను చిరునే స్వయంగా తీయడం విశేషం.

Srikanth Mవాట్సాప్
Bhale Unnade trailer out now
ట్రైలర్ & టీజర్

భలే ఉన్నాడే ట్రైలర్ రిలీజ్

43రోజుల వ్యవధిలో మూడో సినిమాతో వస్తున్నాడు యంగ్ హీరో రాజ్ తరుణ్.గత నెలలో పురుషోత్తముడు తో అలాగే ఈనెల స్టార్టింగ్ లో తిరగబడరసామీ అనే సినిమాలు వచ్చాయి.అయితే ఈరెండు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.ఇవి ఇంకా ఓటిటిల్లోకి కూడా రాలేదు అప్పుడే మరో సినిమాను దింపుతున్నాడు రాజ్ తరుణ్. అదే భలే ఉన్నాడే! ప్రముఖ డైరెక్టర్ మారుతి ప్రొడక్ట్ గా వస్తుంది దాంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.

Mahender Reddyవాట్సాప్
janaka aithe ganaka movie release date fixed
రిలీజ్ అప్‌డేట్

జనక అయితే గనక రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ టాలెంటెడ్ నటుల్లో సుహాస్ పేరు కూడా ముందుంటుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ సినిమానే జనక అయితే గనక. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వంలో ఈ సినిమాను తెరాకెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్

షేర్