
ట్యాగ్ · 28 కథనాలు · పేజీ 2


'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్

'అనబెల్ అండ్ సేతుపతి' ట్రైలర్ రిలీజ్

'తిమ్మరుసు' ట్రైలర్ రిలీజ్

'నారప్ప' ట్రైలర్ రిలీజ్

2020 ఎండింగ్ ఫొటో - థ్యాంక్స్ అన్నయ్య

'లాభం' ట్రైలర్ రిలీజ్
టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్‌లు హీరోహీరోయిన్లుగా వస్తున్న సినిమా లాభం. ఎస్‌పీ జననాథన్ దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈసినిమాను తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా రిలీజ్ కూడా కరోనా వల్ల లేట్ అయింది. ఇక ఇటీవలే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ కూడా ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.

'టక్ జగదీష్' ట్రైలర్ రిలీజ్
శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా టక్ జగదీష్. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఈసినిమా రిలీజ్ విషయంలో చాలా రోజుల కన్ప్యూజన్ తరువాత క్లారిటీ వచ్చింది. ముందు నుండి అనుకుంటున్నట్టే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. అమెజాన్ ప్రైమ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 10 న స్ట్రీమింగ్ కానుంది.

'అనబెల్ అండ్ సేతుపతి' ట్రైలర్ రిలీజ్
వైవిద్యమైన సినిమాలతో మోస్ట్ వాంటెడ్ నటుడిగా మారిపోయాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. కేవలం తమిళ్ లోనే కాదు దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. విజయ్ సేతుపతి, తాప్సీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అనబెల్ అండ్ సేతుపతి.కేవలం తమిళ్ లోనే కాదు తెలుగు, కన్నడ,మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు.

'తిమ్మరుసు' ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతున్నాడు. ఇప్పటికే సత్యదేవ్ తమన్నాతో కలిసి గుర్తుందా శీతాకాలం, నిత్యమీనన్ తో కలిసి సైంటిఫిక్ థ్రిల్లర్ స్కై లాబ్ చిత్రాలు చేస్తున్నాడు. ఇక వీటితోపాటు తిమ్మరుసు సినిమా కూడా చేస్తున్నాడు. శరన్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక ఈసినిమాలో సత్యదేవ్ అడ్వకేట్ రోల్‌లో కనిపించనున్నాడు. మరోవైపు ఈసినిమా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఈనేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు చిత్రయూనిట్…

'నారప్ప' ట్రైలర్ రిలీజ్
తమిళంలో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమాను తెలుగులో నారప్పగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వెంకీ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ఓటీటీలో ఈసినిమా రిలీజ్ అవుతున్న సంగతి కూడా తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ లో ఈనెల 20న ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా నారప్ప ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర బృందం. ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ‘నారప్ప’గా వెంకటేష్ నటన ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుంది. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప’ అంటూ…

2020 ఎండింగ్ ఫొటో - థ్యాంక్స్ అన్నయ్య
కంటెంట్ ఉన్న కథల్ని ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. టాలీవుడ్ లో ఉన్న టాలెంటడ్ నటుల్లో సత్యదేవ్ ఒకడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఏడాది ఓటీటీ లో రిలీజ్ అయిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో మరోసారి తన నట నిజస్వరూపం చూపించాడు. రీసెట్ గా గువ్వ గోరింక అనే సినిమాను కూడా రిలీజ్ చేయగా దానికి కూడా మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ గా వున్నాడు.
'గువ్వ గోరింక'.. ఈ కారణాలు చాలు సినిమాను చూడడానికి...
సత్యదేవ్, మలయాళం నటి ప్రియాలాల్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా 'గువ్వ గోరింక'. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించిన ఈసినిమాను.. జీవన్, దాము సంయుక్తంగా నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మధుమిత కృష్ణ, ఫిష్ వెంకట్, ప్రభాకర్ ఇతరులు ఈ చిత్రంలో నటించారు. ఇక ఈ సినిమా ఈనెల 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాకు మంచి స్పందనే వస్తుంది. ఈ చిత్రాన్ని చూడడానికి ప్రధానంగా ఉన్న కొన్ని కారణాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం.
'గువ్వ గోరింక' ట్రైలర్ రిలీజ్ - డిసెంబర్ 17న అమెజాన్ ప్రైమ్ లో
టాలెంటెడ్ హీరో సత్యదేవ్ వరుస సినిమాలతో కెరీర్ ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసాడు. ఆ సినిమాకు ఎంత మంచి విమర్శలు దక్కాయో తెలుసు. ఇక ప్రస్తుతం మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ రీమేక్ గుర్తుందా శీతాకాలం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు నాగ శేఖర్ దర్శకత్వం వహిస్తున్నాడు.