కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 8

nara rohit marries sireesha in a grand ceremony
సినిమా వార్తలు

గ్రాండ్ గా నారా రోహిత్ వివాహం

నారా వారి కుటుంబంలో పెళ్లి సందడి అంగరంగ వైభవంగా జరిగింది.టాలీవుడ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల (సిరి) వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ వివాహ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

Mahender Reddyవాట్సాప్
baahubali: the epic review in telugu
సినిమా వార్తలు

బాహుబలి: ది ఎపిక్ రివ్యూ

పదేళ్ల క్రితం భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన బాహుబలి: ది బిగినింగ్‌ ఆ తరువాత రెండేళ్ల క్రితం వచ్చిన బాహుబలి: ది కన్‌క్లూజన్‌ చిత్రాలను కలిపి, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్‌' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ రెండు భాగాలను ఒకేసారి,ఒకే టికెట్‌పై చూసే అవకాశం ప్రేక్షకుడికి దక్కింది. ఈరోజే ఈసినిమా విడుదలైంది.మరి ఈ ఎపిక్ ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో రివ్యూలో తెలుసుకుందాం.

Mahender Reddyవాట్సాప్
Lokah Chapter 1 Chandra is now streaming JioHotstar
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి కొత్త లోక

ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్టు చివర్లో థియేటర్లలోకి వచ్చిన మలయాళ సినిమా లోక: చాప్టర్ 1 -చంద్ర ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.2 కోట్ల ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయిన ఈసినిమా ఫుల్ రన్ లో 300కోట్ల వసూళ్లను రాబట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ రోజు నుంచి జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.

Mahender Reddyవాట్సాప్
Kantara Chapter 1 streaming now on prime video
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన కాంతార చాప్టర్ 1

ఈనెల 2న దసరా రోజు భారీ అంచనాల మధ్య విడుదలై నిన్నటి వరకు 800కోట్లకు పైగా వసూళ్ళతో ఈఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది రిషబ్ శెట్టి నటించి డైరెక్ట్ చేసిన కాంతార: చాప్టర్ 1.ఇంకా థియేటర్లలో సాలిడ్ వసూళ్లను రాబడుతున్న ఈసినిమా ఓటీటీలోకి కూడా వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను అమెజాన్ ప్రైమ్, దక్షిణాది భాషల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.నవంబర్ లో హిందీలో కూడా స్ట్రీమింగ్ లోకి రానుంది.

Mahender Reddyవాట్సాప్
Get Ready for the Biker Glimpse
ట్రైలర్ & టీజర్

బైకర్ గ్లింప్స్ రానుంది

చార్మింగ్ స్టార్ శర్వా తన అప్ కమింగ్ మూవీ బైకర్‌ లో మోటార్‌సైకిల్ రేసర్‌గా ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో యువి క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.ఈచిత్రం పూర్తయ్యే దశకు చేరుకుంది. ఫస్ట్ లుక్, టైటిల్ తో ఇప్పటికే మంచి బజ్‌ క్రియేట్ చేసింది.

Mahender Reddyవాట్సాప్
Rage Of Kaantha Lyrical video from Kaantha out now
సినిమా వార్తలు

కాంత నుండి ది రేజ్ ఆఫ్ కాంత రిలీజ్

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ బైలింగ్వల్ పీరియాడికల్ డ్రామా 'కాంత' తో రానున్నాడు. నవంబర్ 14న ఈసినిమా రిలీజ్ కానుంది. 1950 మద్రాస్, సినిమా గోల్డెన్ ఏజ్ బ్యాక్ డ్రాప్ రూపొందుతున్న ఈ చిత్రానికి సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Peddhi Wraps Up Sri Lanka Schedule
షూటింగ్ అప్‌డేట్

పెద్ది శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చి బాబు సాన కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది.రూరల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నిన్నటి తో శ్రీలంక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది.దాదాపు 5 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు హీరో హీరోయిన్ పై సాంగ్ ను చిత్రీకరించారు.

Mahender Reddyవాట్సాప్
The Girlfriend Team Drops Third Single
సినిమా వార్తలు

ది గర్ల్ ఫ్రెండ్ థర్డ్ సింగిల్ రిలీజ్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న లీడ్ రోల్ లో నటించిన సినిమా ది గర్ల్‌ఫ్రెండ్. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్ , సాంగ్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ రోజు మూడో సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.లాయి లే అంటూ సాగె ఈ పాట మెలోడియస్ గా ఉంది. కపిల్ కపిలాన్ వోకల్స్ , హేషమ్ అబ్దుల్ వాహబ్ ట్యూన్స్ సాంగ్ ని రీపీట్ మోడ్ లో వినేలా చేశాయి.రాకేందు మౌళి ఈ పాటను రచించాడు.

Mahender Reddyవాట్సాప్
Mahakali First Look Poster Released
ఫస్ట్ లుక్

మహాకాళి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ప్రశాంత్ వర్మ సినీమాటిక్ యూనివర్స్ (PVCU) నుంచి వస్తున్న మరో సూపర్ హీరో చిత్రం 'మహాకాళి' గురించి కీలక అప్‌డేట్ విడుదలైంది. 'హనుమాన్' చిత్రంతో విజయవంతంగా తన సూపర్ హీరో యూనివర్స్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఈ కొత్త ప్రాజెక్ట్‌కు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Makers Confirm No Change in Toxic Release Date
రిలీజ్ అప్‌డేట్

టాక్సిక్ రిలీజ్ డేట్ అదే

కెజియఫ్ తో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్, తన తదుపరి చిత్రం టాక్సిక్ విషయంలో తీసుకుంటున్న అధిక జాగ్రత్తల కారణంగా ఈ ప్రాజెక్ట్ డోలాయమానంలో పడిందని దర్శకురాలు గీతూ మోహన్ దాస్ చిత్రీకరించిన ఫుటేజ్ విషయంలో యష్ సంతృప్తి చెందకపోవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపేసారని మరికొంత కాలం స్క్రిప్ట్‌పై మళ్లీ కసరత్తు చేయాలని యష్ ఆమెకు సూచించినట్లు దాంతో టాక్సిక్ అనుకున్న తేదీకి రాకపోవచ్చని గత కొద్దీ రోజులుగా ప్రచారం జరుగుతుంది.

Mahender Reddyవాట్సాప్
Venkatesh 77 Getting Ready to Hit the Floors
సినిమా వార్తలు

సెట్స్ మీదకు వెళ్లనున్న వెంకీ 77

సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ , స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తన 77వ సినిమా చేయనున్నారని తెలిసిందే. రీసెంట్ గానే ఈసినిమాను అఫీషియల్ గా లాంఛ్ కూడా చేశారు..ఇక ఈసినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ అవుతుంది.నవంబర్ మొదటి వారం లో షూటింగ్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. వారం రోజులపాటు ఈ ఫస్ట్ షెడ్యూల్ జరుగనుంది.ఈసినిమాను వీలైనంత తొందరగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mass Maharaja Ravi Teja’s Speech at Mass Jathara Pre-Release Event
సినిమా వార్తలు

తమ్ముళ్లూ మొన్నటి వరకు మీకు చిరాకు తెప్పించాను - రవితేజ

మాస్ మహారాజా రవితేజ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మాస్ జాతర'. ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో, సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చాలా గ్రాండ్‌గా నిర్వహించారు.ఈ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu’s Niece Janvi All Set for Her Heroine Debut
సినిమా వార్తలు

హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు మేన కోడలు

తెలుగు సినీ పరిశ్రమలోకి మరో స్టార్ వారసురాలు అడుగుపెట్టడానికి రంగం సిద్ధమైంది. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తొలిసారిగా కథానాయికగా ఒకరు పరిచయం కాబోతున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి, ప్రముఖ నిర్మాత మంజుల ఘట్టమనేని కుమార్తె జాన్వీ స్వ‌రూప్‌ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
Idli Kottu Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన ఇడ్లీ కొట్టు

తమిళ హీరో ధనుష్ నటించి డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇడ్లీ కడై. ఈనెల 1న థియేటర్లలోకి వచ్చిన ఈసినిమా ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద 70కోట్ల వసూళ్లను రాబట్టుకొని డీసెంట్ హిట్ అనిపించుకుంది. అయితే అదే టైంలో కాంతార చాప్టర్ 1 కూడా విడుదలకావడంతో ఇడ్లీ కడై అనుకున్న వసూళ్లను సాధించలేకపోయింది. ఈసినిమాను తెలుగులో ఇడ్లీ కొట్టు గా శ్రీ వేదాక్షర మూవీస్ అనే సంస్థ విడుదలచేసింది.

Mahender Reddyవాట్సాప్
Revanth Reddy’s Big Announcements for Film Industry Workers
సినిమా వార్తలు

సినీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలనచిత్ర కార్మికుల సంక్షేమానికి సంబంధించి కీలక ప్రకటనలు చేశారు. నిన్న యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభ గ్రాండ్ గా జరిగింది.ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డిని గజమాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

Mahender Reddyవాట్సాప్
CM Revanth Reddy Sets Conditions for Ticket Price Increase
సినిమా వార్తలు

అలా చేస్తేనే టికెట్ ధరల పెంపు :సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చలనచిత్ర కార్మికుల సంక్షేమానికి సంబంధించి కీలకమైన ప్రకటన చేశారు. నిన్న యూసఫ్ గూడలోని పోలీస్ లైన్స్ లో సినీ కార్మికులు ఏర్పాటు చేసిన అభినందన సభ గ్రాండ్ గా జరిగింది.టి ఎఫ్ డి సి చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డిని గజ మాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

Mahender Reddyవాట్సాప్
Parasakthi First Single Coming Soon
సినిమా వార్తలు

పరాశక్తి ఫస్ట్ సింగిల్ రానుంది

మదరాసి తరువాత తమిళ హీరో శివ కార్తికేయన్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా పరాశక్తి. శివ కార్తికేయన్ కు ఇది 25వ సినిమా.ఈ ల్యాండ్ మార్క్ మూవీ ని ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర డైరెక్ట్ చేస్తుండగా అథర్వ , శ్రీలీల ,రవి మోహన్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.శ్రీ లీల కి కోలీవుడ్ లో ఇదే మొదటి సినిమా.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Dacoit Release Date Locked
రిలీజ్ అప్‌డేట్

డెకాయిట్ రిలీజ్ డేట్ ఫిక్స్

యంగ్ హీరో అడివి శేష్ నుండి నెక్స్ట్ వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డెకాయిట్. లీడ్ క్యారెక్టర్స్ ని పరిచయం చేసిన ఫైర్ గ్లింప్స్ రిలీజ్ తో ఈసినిమాకు హ్యుజ్ బజ్ క్రియేట్ అయ్యింది. ప్రేమ-ప్రతీకార కథనం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకత్వం వహిస్తున్నారు.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ మారింది. నిజానికి డిసెంబర్ లో రావల్సిన ఈసినిమా వెనక్కి వెళ్ళిపోయింది.

Mahender Reddyవాట్సాప్
Meesala Pilla Song Continues Its Trending Streak
సాంగ్

ఇంకా ట్రెండింగ్ లో కొనసాగుతున్న మీసాల పిల్ల

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ మీసాల పిల్లతో మెగాస్టార్ చిరంజీవి ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన ఈ ఎనర్జిటిక్ మెలోడీ ఇన్స్టంట్ చార్ట్‌బస్టర్‌గా మారడమే కాకుండా, తెలుగు పాటకు దేశవ్యాప్తంగా అరుదైన ఘనతను సాధించింది.

Mahender Reddyవాట్సాప్
Happy to Make My Telugu Comeback with Jatadhara – Shilpa Shirodkar
ఇంటర్వ్యూ

జటాధర తో తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం చాలా ఆనందంగా వుంది - శిల్పా శిరోధ్కర్

నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరు‍ణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మించారు. ఈ చిత్రంలో శిల్పా శిరోధ్కర్ కీలక పాత్ర పోషించారు. జటాధర నవంబర్ 7న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు…

Mahender Reddyవాట్సాప్

షేర్