కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Movie News

ట్యాగ్ · 1012 కథనాలు · పేజీ 47

సినిమా వార్తలు

టార్గెట్ క్రిస్మస్..!

మొత్తానికి ఈ ఏడాది ఇప్పటివరకు పలు సినిమాలు విడుదలై సినీ ప్రేక్షకులను సందడి చేశాయి. ఇక దసరా పండగ హడావుడి కూడా అయిపోయింది. ఇక ఈ పండుగకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న సినిమాలు రిలీజ్ అయిపోయాయి. వచ్చేది దీపావళి పండగ.. అయితే ఈ పండుగకు పెద్దగా సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా లేవు. వచ్చేది సంక్రాంతి సీజన్. సంక్రాంతి సీజన్ కు ఎక్కువగా పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతాయి. ఈ పెద్ద పండగకు ఇప్పటికే మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' రజినీ 'దర్బార్' సినిమాలు ఇలా పెద్ద పెద్ద సినిమాలు అన్నీ సంక్రాంతికి స్లాట్స్ బుక్ చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh Bollywood Debut Film Completes First Schedule Shoot,Latest Telugu Movie News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Keerthy Suresh Bollywood Debut Film,Actress Keerthy Suresh Bollywood Film,Keerthy Suresh La
షూటింగ్ అప్‌డేట్

కీర్తిసురేష్ బాలీవుడ్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క హిందీలో కూడా సినిమాలు చేస్తుంది. బాలీవుడ్ లో కూడా కీర్తీ సురేష్ ‘మైదాన్‌’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘బదాయి హో’ ఫేమ్ అమిత్ శర్మ 1950-63 మధ్య కాలంలో భారత ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితకథను తెరకెక్కించనున్నారు. ఈసినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు మూవీ కి సై !

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఇప్పుడు తెలుగు మూవీ లో నటించడానికి సై అంటున్నారు. దక్షిణాది మూవీస్ హిందీ రీమేక్ మూవీస్ లో అక్షయ్ కుమార్ నటించి విజయాలు సాధించారు.అక్షయ్ ప్రస్తుతం కాంచన మూవీ హిందీ రీమేక్ లక్ష్మీ బాంబ్ మూవీ లో నటిస్తున్నారు. అక్షయ్ కుమార్ నటించిన హౌస్ ఫుల్ 4 మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఆ మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో అక్షయ్ కుమార్ మీడియా తో సమావేశమయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ మూవీ ?

బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి మూవీ తో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ తన రెండవ మూవీ ని బాలీవుడ్ లో తెరకెక్కించారు. సినీ వన్ స్టూడియోస్, టి -సిరీస్ బ్యానర్స్ పై షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ ఘనవిజయం సాధించింది.కబీర్ సింగ్ మూవీ 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా నిలిచింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేమికుల రోజున శేఖర్ కమ్ముల మూవీ

బ్లాక్ బస్టర్ ఫిదా మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమ కథ రూపొందుతున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ సమర్పణ లో ఆసియన్ సినిమాస్ నారాయణ దాస్ K నారంగ్, P రామ్మోహనరావు నిర్మాతలుగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ రొమాంటిక్ డ్రామా షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభమయింది. పవన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కొత్త మూవీ ప్రారంభం

సక్సెస్ ఫుల్ మూవీస్ F2, గద్దలకొండ గణేష్ లతో ప్రేక్షకులను అలరించిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తో అలరించనున్నారు. హీరో వరుణ్ తేజ్ ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్నారు . US లో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. థమన్ SS సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరు, కొర‌టాల సినిమాలో చ‌ర‌ణ్!?

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. విజ‌యద‌శ‌మి సంద‌ర్భంగా పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌... న‌వంబ‌ర్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌్యూజిక‌ల్ హిట్‌ ‘నువ్వే నువ్వే’కు 17 ఏళ్ళు

తెలుగునాట తండ్రీకూతుళ్ల అనుబంధంతో పలు సినిమాలు తెరకెక్కాయి. వాటిలో... ముందువ‌రుస‌లో నిలిచే చిత్రాల‌లో ‘నువ్వే నువ్వే’ ఒకటి. త‌రుణ్, శ్రియా శరన్, ప్ర‌కాష్ రాజ్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ద్వారానే నేటి అగ్ర‌శ్రేణి ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్దేశ‌కుడిగా తొలి అడుగులు వేశాడు. ఇందులో చంద్రమోహన్, రాజీవ్ కనకాల, సునీల్, సుధ, ప్రగతి, అనితా చౌద‌రి తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చారిత్రాత్మక చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’కు 33 ఏళ్ళు

రెబల్ స్టార్ కృష్ణంరాజుకు బాగా కలిసొచ్చిన దర్శకుల్లో దర్శకరత్న దాసరి నారాయణరావు ఒకరు. వీరిద్దరి కలయికలో పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘తాండ్ర పాపారాయుడు’ ఒకటి. 17వ శతాబ్దంలో విజయనగరం, బొబ్బిలి రాజ్యాల మధ్య జరిగిన ఆధిపత్యపోరు నేపథ్యంలో ఈ చారిత్రాత్మక చిత్రం రూపొందింది. కృష్ణంరాజుకు జంటగా జయప్రద నటించగా... జయసుధ, సుమలత, మోహన్‌బాబు, రామకృష్ణ, బాలీవుడ్ నటుడు ప్రాణ్, బాలయ్య, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అంజలీ దేవి, సూర్యకాంతం, విజయలలిత, ప్రభ, నిర్మలమ్మ తదితరులు ఇతర ముఖ్య‌ పాత్రలను పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరంజీవి అభిన‌యప‌ర్వంలో క‌లికితురాయి ‘ఆప‌ద్బాంధవుడు’కి 27 ఏళ్ళు

మెగాస్టార్ చిరంజీవి అభిన‌య‌ప‌ర్వంలో క‌లికితురాయిలా నిలిచిన చిత్రాల‌లో ‘ఆప‌ద్బాంధవుడు’ ఒక‌టి. ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’ వంటి క్లాసిక్ హిట్స్ తరువాత క‌ళాత‌ప‌స్వి కె.విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టించిన మూడో సినిమా ఇది. చిరంజీవిలోని నటుణ్ణి మరో స్థాయికి తీసుకువెళ్ళిన ఈ చిత్రంలో మీనాక్షి శేషాద్రి నాయిక‌గా నటించింది. కైకాల సత్యనారాయణ, శరత్‌బాబు, అల్లు రామలింగయ్య, గీత, బ్రహ్మానందం, నిర్మ‌ల‌మ్మ‌, శిల్ప తదితరులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలు పోషించగా... “హాస్యబ్రహ్మ” జంధ్యాల కీలక పాత్రలో దర్శనమిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ్యూజిక‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ‘పెళ్లి చేసుకుందాం’కు 22 ఏళ్ళు

కొన్ని జంట‌లు వెండితెరపై భలే మ్యాజిక్ చేస్తాయి. అలాంటి కాంబినేష‌న్స్‌లో ‘విక్టరీ’ వెంకటేష్, అభినేత్రి సౌంద‌ర్య‌ జోడి ఒకటి. వీరిద్దరూ జంటగా నటించిన పలు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో ‘పెళ్లి చేసుకుందాం’కి ప్ర‌త్యేక స్థానం ఉంది. “శీలం అనేది మనసుకు సంబంధించినది... శరీరానికి సంబంధించినది కాదు” అనే పాయింట్‌తో ‘పెళ్లి చేసుకుందాం’ తెర‌కెక్కింది. ‘పవిత్రబంధం’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం తరువాత వెంకీ, సౌందర్య జంటగా ముత్యాల సుబ్బయ్య రూపొందించిన‌ ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ కూడా ప్రేక్ష‌కుల‌ను విశేషంగా అలరించింది. లైలా మ‌రో నాయిక‌గా న‌టించిన ఈ సినిమాలో మోహన్‌రాజ్, దేవన్, స‌త్య‌ప్ర‌కాశ్‌…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

య‌న్టీఆర్‌ ‘బాలనాగమ్మ’కు 60 ఏళ్ళు

మహానటుడు యన్.టి.రామారావు, దిగ్గజ నటీమణి అంజలీ దేవి జంటగా పలు విజయవంతమైన చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో ‘బాలనాగమ్మ’ ఒకటి. వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ఈ సినిమాలో ఎస్.వి.రంగారావు, రేలంగి, లంక సత్యం, సీఎస్సార్, ఎ.వి.సుబ్బారావు, రాజసులోచన, హేమలత, సూర్యకళ, మాస్ట‌ర్ స‌త్య‌నారాయ‌ణ త‌దిత‌రులు ముఖ్య భూమికలు పోషించారు. 1942లో వచ్చిన ‘బాలనాగమ్మ’(సి.పుల్ల‌య్య ద‌ర్శ‌కుడు) చిత్రానికి రీమేక్‌గా 17 ఏళ్ల అనంతరం ఈ ‘బాలనాగమ్మ’రూపొందింది. ఆస‌క్తిక‌ర‌మైన అంశ‌మేమిటంటే... ఈ రెండు చిత్రాలలోనూ రేలంగి, లంక సత్యం నటించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దర్శకుడు VV వినాయక్ హీరోగా మూవీ ప్రారంభం

సూపర్ హిట్ మూవీ ఆది తో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమైన VV వినాయక్ దర్శకత్వంలో రూపొందిన దిల్ ,ఠాగూర్, లక్ష్మీ , నాయక్, ఖైదీ నెం 150 మూవీస్ బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు దర్శకుడు VV వినాయక్ హీరోగా మారారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నరసింహా దర్శకత్వంలో వినాయక్ హీరో గా సీనయ్య మూవీ వినాయక్ బర్త్ డే సందర్భంగా ఈ రోజుప్రారంభమయింది. 8 వ తేదీ విజయదశమి రోజున టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నంద‌మూరి కళ్యాణ్ రామ్ న‌ట‌నాప్ర‌స్థానానికి ప‌ద‌హారేళ్ళు

వైవిధ్యభరితమైన క‌థాంశాల‌కు పెద్ద‌పీట వేసే కథానాయకుల్లో నందమూరి కళ్యాణ్ రామ్ ఒకరు. అలాంటి క‌ళ్యాణ్ రామ్‌ న‌ట‌నాప్ర‌స్థానానికి బీజం వేసిన చిత్రం ‘తొలిచూపులోనే...’. తన తాత, మహానటుడు యన్.టి.రామారావు నటించిన ‘జస్టిస్ చౌదరి’ చిత్రంలోని “నీ తొలిచూపులోనే” అనే పాటలోని తొలి ప‌దాన్ని టైటిల్‌గా ఎంచుకుని... కథానాయకుడిగా తొలి అడుగులు వేసాడు ఈ నంద‌మూరి హ్యాండ్స‌మ్ హీరో.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీ‌దేవి న‌ట విశ్వ‌రూపం ‘క్షణక్షణం’కు 28 ఏళ్ళు

కొన్ని సినిమాలు చూడడానికే కాదు... వాటి గురించి మాట్లాడుకోవడానికి కూడా భలే సరదాగా ఉంటాయి. అటువంటి చిత్రాలలో ‘క్షణక్షణం’ ఒకటి. ‘శివ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రమిది. థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మూవీలో ఓ వైపు ఉత్కంఠ‌కు గురిచేస్తూనే... మరోవైపు నటీనటుల హావభావాలతో, వారి వైవిధ్యమైన డైలాగ్ డెలివరీతో కడుపుబ్బా నవ్వించాడు దర్శకుడు. ఇక ఈ సినిమా పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చేది “సత్య” పాత్ర. ఈ పాత్రలో నటించిన శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. తనకు మాత్రమే సాధ్యమయ్యేలా... ఓ వైపు అమాయకత్వాన్ని, మరోవైపు భయాన్ని అభినయించి నటిగా తన నట…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

ఎంత మంచివాడవురా! టీజర్ రిలీజ్

శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణ లో ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ , మెహరీన్ జంటగా రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఎంత మంచివాడవురా!మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తనికెళ్ళ భరణి, విజయ్ కుమార్, నరేష్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . ఈ మూవీ కి గోపిసుందర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Pratiroju Pandaage Movie Interesting Update
సినిమా వార్తలు

‘ప్రతి రోజూ పండగే’... ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు

మెగా హీరో సాయితేజ్, యూత్‌ఫుల్ మూవీస్ స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘ప్రతి రోజూ పండగే’. తేజ్ కి జోడీగా రాశి ఖన్నా నటిస్తోంది. కుటుంబ బంధాల నేప‌థ్యంలో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో స‌త్య‌రాజ్, రావుర‌మేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ కొత్త చిత్రానికి ముహూర్తం ఖరారు?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా డెబ్యూ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా రానున్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కనున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్స‌ర్‌గా దర్శనమివ్వనున్నాడు. అంతేకాదు... ఈ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నాడు ఈ మ్యాచో స్టార్‌. తాజాగా ప్రీ-ప్రొడక్షన్ ప‌నులు పూర్తి చేసుకున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్... ఈ నెల 10న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుందని సమాచారం. అయితే, రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2020 ఆరంభంలో మొదలవుతుందని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాజ్ త‌రుణ్‌

యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న యువ కథానాయకుల్లో రాజ్ తరుణ్ ఒకరు. కెరీర్ ఆరంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన ఈ హ్యాట్రిక్ హీరో... ప్రస్తుతం ఆ స్థాయి విజయాలను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆచి తూచి అడుగులు వేస్తున్న రాజ్... ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాడు. వాటిలో ఒకటి టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘ఇద్దరి లోకం ఒకటే’ కాగా... మరొకటి ‘గుండెజారి గ‌ల్లంత‌య్యిందే’ ఫేమ్ విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఈ రెండు సినిమాలు సెట్స్‌పై ఉండ‌గానే... ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్నల్…

Team TFNవాట్సాప్
Miss India Finalist In Akhil New Movie
సినిమా వార్తలు

అఖిల్ సినిమాలో మాజీ మిస్ ఇండియా ఫైన‌లిస్ట్‌?

యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో... అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్టు సమాచారం. అంద‌మైన ప్రేమ‌క‌థ‌తో పాటు కుటుంబ బంధాల‌కు పెద్ద పీట వేస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్