
ట్యాగ్ · 8 కథనాలు


షూటింగ్ పూర్తి చేసుకున్న ఆనంద్ దేవరకొండ 'హైవే'

ఆనంద్ దేవరకొండ 'హైవే' లో మిర్జాపూర్ నటుడు

కె.వి గుహన్ తో ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ ప్రారంభం

'అఫీషియల్' కె.వి గుహన్ తో కళ్యాణ్ రామ్

ఆనంద్ దేవరకొండ "హైవే "మూవీ ప్రారంభం

మరో థ్రిల్లర్ తో వస్తున్న ‘118’ డైరెక్టర్

"హైవే " మూవీ కాన్సెప్ట్ పోస్టర్స్ రిలీజ్
యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ విభిన్న కథాంశాల చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఆనంద్ దేవరకొండ హీరోగా సైకో క్రైమ్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కింది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్ పై వెంకట్ తలారి నిర్మాతగా సూపర్ హిట్ "118 "మూవీ ఫేమ్ గుహన్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, మానస రాధా కృష్ణన్ జంటగా "హైవే మూవీ తెరకెక్కింది. సరి కొత్త లుక్ లో ఆనంద్ కనిపించనున్న ఈ మూవీ లో బాలీవుడ్ నటుడు అభిషేక్ బెనర్జీ కీలకపాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ హాట్ బ్యూటీ సయామీఖేర్ ముఖ్య పాత్రలో నటించారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఆనంద్ దేవరకొండ 'హైవే'
దొరసాని తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆనంద్ దేవరకొండ. మొదటి సినిమాతోనే నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు ఆనంద్ దేవరకొండ. ఇక రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ తో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైకో క్రైమ్ థ్రిల్లర్ ‘హైవే’. ఈ సినిమా ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది.

ఆనంద్ దేవరకొండ 'హైవే' లో మిర్జాపూర్ నటుడు
విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ తన అన్న పేరును వాడుకోకుండానే వచ్చిన అవకాశాలు అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన మొదటి సినిమా దొరసాని తోనే నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మిడిల్ క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో వస్తున్నాడు.

కె.వి గుహన్ తో ఆనంద్ దేవరకొండ ‘హైవే’ షూటింగ్ ప్రారంభం
విజయ్ దేవరకొండ తమ్ముడిగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆనంద్ దేవరకొండ మొదటి సినిమా దొరసాని తోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత మిడిల్క్లాస్ మెలొడీస్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ఇక మొదటి నుండి కాస్త డిఫరెంట్ సినిమాలు ఎంపిక చేసుకునే ఆనంద్ దేవరకొండ ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. ఆనంద్ దేవరకొండ, మానస రాధాకృష్ణన్ జంటగా కేవీ గుహన్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ‘హైవే’ అనే టైటిల్ తో వస్తున్న ఈసినిమా రెగ్యులర్ షూటింగ్ నేటి నుండి ప్రారంభమైంది.

'అఫీషియల్' కె.వి గుహన్ తో కళ్యాణ్ రామ్
సినిమాల రిలీజ్ ల సంగతి పక్కన పెడితే హీరోలు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే మరోసినమాను లైన్ లో పెడుతున్నారు. ఇక కళ్యాణ్ రామ్ కూడా అదే పని చేస్తున్నాడు. ఇప్పటికే కళ్యాణ్ రామ్ నూతన దర్శకుడు మల్లిడి వశిష్టతో కలిసి బింబిసార సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా పెద్ద హడావుడి లేకుండానే స్టార్ట్ అయి షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతుంది.

ఆనంద్ దేవరకొండ "హైవే "మూవీ ప్రారంభం
సక్సెస్ ఫుల్ "దొరసాని "మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ"మిడిల్ క్లాస్ మెలోడీస్ "మూవీ తో ప్రేక్షకులను అలరించారు. ఆనంద్ ఇప్పుడు హైవే బ్యాక్ డ్రాప్ లో రూపొందే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మహేష్ చేతుల మీదుగా 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ' టీజర్ రిలీజ్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ మరో డిఫరెంట్ థ్రిల్లర్ కథతో వచ్చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి `డబ్లూడబ్లూడబ్లూ` (హూ,వేర్,వై) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవలే రానా చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారు చిత్రయూనిట్.

మరో థ్రిల్లర్ తో వస్తున్న ‘118’ డైరెక్టర్
కరోనా టైంలో సినీ ఇండస్ట్రీ మొత్తం షట్ డౌన్ అయిందని చెప్పొచ్చు. అన్ని సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి.. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి.. రామ్ గోపాల్ వర్మ ఒక్కడే వరుసపెట్టి సినిమాలు తీసినట్టు కనిపించాడు. అయితే మనకు తెలియకుండా చాలా మంది సినిమాల షూటింగ్ లు కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది. దానికి కారణం కొన్ని సినిమాలు ఎప్పుడు మొదలవుతున్నాయో తెలియదు కానీ సైలెంట్ గా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్నాయి.