
ట్యాగ్ · 8 కథనాలు


అదితి రావు హైదరి శారీ లుక్
నటి కావాలని కలలు కన్నా- అదితి రావు హైదరి

"మహా సముద్రం " మూవీ లో అదితిరావు హైదరి
కన్ఫామ్ 'మహా సముద్రం'లో అదితి
"V" మూవీ టీమ్ కు అదితిరావు హైదరి థ్యాంక్స్
ప్రేమ కథా చిత్రాలు ఇష్టం -అదితి రావు హైదరి
శర్వానంద్ కు జోడీ గా అదితి

ఆమె బయోపిక్‌లో నటించాలని ఉంది..!
బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన అదితి రావు హైదరి ఈమధ్య టాలీవుడ్ లో కూడా మంచి అవకాశాలను దక్కించుకుంటూ కెరీర్ లో ముందుకు వెళుతుంది. తెలుగులో సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అదితి మొదటి సినిమాతోనే మంచి పేరును దక్కించుకుంది. ఇక ఆతరువాత వి సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్, సిద్దార్థ హీరోగా వస్తున్న సినిమా మహాసముద్రం. ఈ సినిమాలో అదితి హీరోయిన్ గా నటిస్తుండగా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు చిత్రబృందం.

అదితి రావు హైదరి శారీ లుక్
మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హీరోగా రూపొందిన "ప్రజాపతి "మూవీ తో కెరీర్ ప్రారంభించిన అదితి రావు హైదరి , " శృంగారం "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ఢిల్లీ 6 "మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. పలు సూపర్ హిట్ హిందీ , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన అదితి, సక్సెస్ ఫుల్ "సమ్మోహనం "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి , ఆ మూవీలో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "V"మూవీ లో సాహెబా పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అదితి ప్రేక్షకులను అలరించారు.
నటి కావాలని కలలు కన్నా- అదితి రావు హైదరి
అదితి రావు హైదరి “ప్రజాపతి “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. 3 నేషనల్ అవార్డ్స్ అందుకున్న “శృంగారం”మూవీ లో దేవదాసి పాత్రలో నటించి అదితి కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. “ఢిల్లీ -6″మూవీ తో అదితి బాలీవుడ్ లో అడుగు పెట్టారు. బాలీవుడ్ లో బిజీగా మారిన అదితి 10 సంవత్సరాల తరువాత మణి రత్నం దర్శకత్వంలో రూపొందిన "కాట్రు వెళియిదై " (చెలియా ) మూవీ తో కోలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. మణిరత్నం గారితో పనిచేయడం వల్ల ఎంతో పరిణతి సాధించాననీ , మణిరత్నం గారి ఇన్ స్పిరేషన్ తో మూవీస్ ఎంపిక చేసుకుంటున్నాననీ, నటి కావాలనే తన కలలు నెరవేరాయనీ అదితి చెప్పారు.

"మహా సముద్రం " మూవీ లో అదితిరావు హైదరి
సూపర్ హిట్ "RX 100 "మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శర్వానంద్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "మహా సముద్రం " రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో సిద్దార్ద్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెలుగు , తమిళ భాషలలో రూపొందనున్న ఎమోషనల్ ఎంటర్ టైనర్ "మహా సముద్రం " మూవీలో హీరోయిన్ ను చిత్ర యూనిట్ ఎంపిక చేసింది.
కన్ఫామ్ 'మహా సముద్రం'లో అదితి
అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం అనే సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్ గా ఈ మహాసముద్రం చిత్రం తెరకెక్కనుంది. సినిమాతో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్ళీ అలాంటి బలమైన పాత్రలో శర్వా నటించబోతున్నట్టు ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపింది.
"V" మూవీ టీమ్ కు అదితిరావు హైదరి థ్యాంక్స్
ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు , నివేద థామస్ , అదితిరావు హైదరి ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నాని , అదితిరావు జంట , సుధీర్ బాబు , నివేద జంట అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించి ప్రేక్షక , అభిమానుల ప్రశంసలు అందుకున్నారు.
ప్రేమ కథా చిత్రాలు ఇష్టం -అదితి రావు హైదరి
మలయాళ , తమిళ , హిందీ భాష ల చిత్ర నటి అదితి రావు హైదరి ని , దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి సక్సెస్ ఫుల్ "సమ్మోహనం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం చేశారు. అదితి రావు సైన్స్ ఫిక్షన్ "అంతరిక్షం 9000 KMPH " మూవీ తో ప్రేక్షకులను అలరించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
శర్వానంద్ కు జోడీ గా అదితి
"సమ్మోహనం" మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి తరువాత "అంతరిక్షం 9000 KMPH " మూవీ లో నటించారు. అదితి హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. పలు తమిళ, హిందీ మూవీస్ తో బిజీగా ఉన్న అదితి ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.