“V” మూవీ టీమ్ కు అదితిరావు హైదరి థ్యాంక్స్

Actress Aditi Rao Hydari Thanks V Movie Team For Her Role In The Movie

ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు , నివేద థామస్ , అదితిరావు హైదరి ప్రధాన పాత్రలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. నాని , అదితిరావు జంట , సుధీర్ బాబు , నివేద జంట అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ రోల్ లో నటించి ప్రేక్షక , అభిమానుల ప్రశంసలు అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” లో సాహెబా గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన అదితి రావు తన నటనను ప్రశంసించిన ప్రేక్షక , అభిమానులకు , “V” మూవీ టీమ్ కు థ్యాంక్స్ చెప్పారు. “V” మూవీ సెట్స్ లో అదితి రావు అద్దం ముందు ఉండగా హీరో నాని తీసిన ఫొటో ను అదితి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసి, నాని ఫొటోగ్రఫీ స్కిల్స్ ను ప్రశంసించారు. సాహెబా వంటి అద్భుత క్యారెక్టర్ కు తనను ఎంపిక చేసినందుకు దర్శకుడు ఇంద్రగంటిని, తమ కెమిస్ట్రీ పండించినందుకు నాని కి , మొత్తం టీమ్ కు అదితిరావు థ్యాంక్స్ చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 5 =