
ట్యాగ్ · 10 కథనాలు


హంట్ నుండి శ్రీకాంత్ రోల్ రివీల్

రాజమండ్రి లో "#RC15 "మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్

శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్..!

"అఖండ " మూవీ లో తన పాత్ర గురించి శ్రీకాంత్

"అఖండ " మూవీ లో కొత్తగా కనిపిస్తా - శ్రీకాంత్

"అఖండ " లో శ్రీకాంత్ , పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్

'ఇదే మా కథ' రిలీజ్ డేట్ ఫిక్స్
"పెళ్ళిసందD " లో ప్రత్యేక పాత్రలో శ్రీకాంత్ ?
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు

వారసుడు మూవీ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ - శ్రీకాంత్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , పివిపి సినిమా బ్యానర్స్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తమిళ స్టార్ హీరో, దళపతి విజయ్, సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక జంటగా తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కిన వారసుడు మూవీ 2023 జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరో శ్రీకాంత్ ఒక కీలక పాత్రలో, ప్రకాష్ రాజ, జయసుధ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. సూపర్ స్టార్ విజయ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ తెలుగులో వారసుడుగా, తమిళంలో వారిసుగా రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ రంజితమే, సెకండ్ సింగిల్ థీ దళపతి, థర్డ్…

హంట్ నుండి శ్రీకాంత్ రోల్ రివీల్
నైట్రో స్టార్ సుధీర్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లాంటి లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. అయితే అ సినిమాకు మిక్డ్స్ టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మహేష్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా ఒక సినిమా వస్తుంది. సుధీర్ బాబు 16వ సినిమాగా ఈసినిమా తెరకెక్కుతుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈసినిమాకు హంట్.. (గన్స్ డోంట్ లై) అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమాలో సుధీర్ బాబు పోలీస్ పాత్రలో కనిపించనున్నట్టు తెలుస్తుంది.

రాజమండ్రి లో "#RC15 "మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పుణె లో #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్..!
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం కాస్త ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. కరోనా వైరస్ చాలా తొందరగా వ్యాప్తి చెందుతుంది. ఇక తెలిసిందే కదా అన్ని పరిశ్రమల సంగతి ఏమో కానీ కరోనా వల్ల ఎక్కువ నష్టం కలుగుతుంది సినీ పరిశ్రమలకే కలుగుతుంది. ఇప్పటికే మరోసారి థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. సినిమా రిలీజ్ లు మళ్లీ వరుసగా వాయిదా పడుతున్నాయి. దానికితోడు వరుసపెట్టి సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నాడు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తనకు కరోనా పాజిటివ్ అని సోషల్ మీడియాలో తెలియచేశారు.

"అఖండ " మూవీ లో తన పాత్ర గురించి శ్రీకాంత్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరో గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక. థమన్ ఎస్ సంగీతం అందించారు. శ్రీకాంత్ , పూర్ణ , జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ,ట్రైలర్ లకు ప్రేక్షకులనుండి అనూహ్య స్పందన లభించింది. హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన “అఖండ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

"అఖండ " మూవీ లో కొత్తగా కనిపిస్తా - శ్రీకాంత్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో హీరో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటించిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. హీరో శ్రీకాంత్ ,ప్రతినాయకుడిగా , జగపతిబాబు ఒక ముఖ్య పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు హీరో బాలకృష్ణ నటిస్తున్న అఘోర పాత్ర, యాక్షన్ సీన్స్ “అఖండ “మూవీకి హైలైట్ కానున్నాయి.

"అఖండ " లో శ్రీకాంత్ , పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న "అఖండ " మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “అఖండ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

'ఇదే మా కథ' రిలీజ్ డేట్ ఫిక్స్
గురుపవన్ దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ఇదే మా కథ. రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నలుగురు వ్యక్తులు కలిసి రోడ్ ట్రిప్ ను ఎలా కొనసాగించారన్నదే ఈ సినిమా కథ. ఇప్పటికే రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన ‘ఇదే మా కథ’ టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించింది. దీనితో సినిమాపై అంచనాలు పెరిగాయి.
"పెళ్ళిసందD " లో ప్రత్యేక పాత్రలో శ్రీకాంత్ ?
కె రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "పెళ్ళిసందడి " మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రవళి , దీప్తి భట్నాగర్ కథానాయికలు. కీరవాణి స్వరకల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని "పెళ్ళిసందడి " మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తో శ్రీకాంత్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. క్లీన్ ఎంటర్ టైనర్ గా "పెళ్ళిసందడి " మూవీని తెరకెక్కించి దర్శకుడు రాఘవేంద్ర రావు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. 25 సంవత్సరాల తరువాత "పెళ్ళిసందడి " మూవీ సీక్వెల్ తెరకెక్కనుంది.
'పెళ్లి సందడి' కోసం శ్రీకాంత్ తనయుడు
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాకర్ కాంబినేషన్ లో పాతికేళ్ల క్రితం వచ్చిన పెళ్లి సందడి సినిమా ఎంత సంచలన విజయం దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. చాలా తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ కొట్టింది. ముఖ్యంగా ఈ సినిమాకి కీరవాణి అందించిన పాటలు బాగా ప్లస్ అయ్యాయి.. ఈ సినిమా శ్రీకాంత్ కి మంచి ఇమేజ్ ని తీసుకువచ్చింది.