
ట్యాగ్ · 16 కథనాలు


సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ

రేపు సినిమాల షూటింగ్ లు బంద్

సూపర్ స్టార్ కృష్ణ మృతి పై ఎన్టీఆర్ స్పందన

కృష్ణ మృతిపై మోదీ ప్రగాఢ సంతాపం

ఒకే ఏడాది మూడు విషాదాలు

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్

లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం

సూపర్ స్టార్ కృష్ణ మృతి ప్రముఖుల సంతాపం
50 వసంతాల "కౌబాయ్"

నాన్నకు ప్రేమతో .. మహేష్ బాబు
మామతో అల్లుడు - ఫ్యాన్ బాయ్ మూమెంట్
కుటుంబ కథా చిత్రం "పండంటి కాపురం"

తాతపై సితార ఎమోషనల్ పోస్ట్
సూపర్ స్టార్ కృష్ణ నిన్న మరణించిన సంగతి తెలిసిందే. మొన్న ఉదయం గుండెపోటుకు గురైన కృష్ణను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి కాస్త విషమించడంతో నిన్న తెల్లవారు జామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. ఈరోజు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహా ప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు కూడా ముగిశాయి. ఇక ఇదిలా ఉండగా తాజాగా మనవరాలు కృష్ణ తన తాతను గుర్తుచేసుకొని సోషల్ మీడియా ద్వారా గుర్తుచేసుకుంది. వీక్ డే భోజనం మళ్లీ ఎప్పటికీ ఉండదు. మీరు నాకు చాలా విలువైన విషయాలు నేర్పించారు. ఎల్లప్పుడూ నన్ను నవ్వించారు, ఇప్పుడు మిగిలి ఉన్నది మీ జ్ఞాపకం. మీరు నా హీరో, ఏదో ఒక రోజు నేను మిమ్మల్ని గర్వపడేలా చేయగలనని…

సూపర్ స్టార్ కు పాన్ ఇండియా స్టార్ పరామర్శ
టాలీవుడ్ సూపర్ స్టార్. మహేష్ బాబు తండ్రి కృష్ణ కార్డియాక్ అరెస్ట్ తో మరణించిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆదివారం అర్థరాత్రి చేరిన కృష్ణ... చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమ తీవ్ర శోక సంద్రంలో మునిగిపోయింది. టాలీవుడ్ హీరోలు చిరంజీవి , పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , విజయ్ దేవరకొండ , నాగ చైతన్య తదితరులు నటశేఖర్ కృష్ణ కి ఘన నివాళులర్పించారు, మహేష్ బాబును ఓదార్చుతూ ధైర్యం నింపారు.

రేపు సినిమాల షూటింగ్ లు బంద్
నిన్న ఉదయం గుండెపోటుకు గురైన కృష్ణను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఇక వైద్యులు కూడా పరిస్థితి కాస్త విషమంగానే ఉందని చెప్పారు. ఈలోపే నేడు తెల్లవారు జామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని చూడటానికి వచ్చి మహేష్ కుటుంబానికి నివాళులర్పించారు.

సూపర్ స్టార్ కృష్ణ మృతి పై ఎన్టీఆర్ స్పందన
కార్డియాక్ అరెస్టుతో బాధపడుతున్న కృష్ణను కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కృష్ణ మంగళవారం ఉదయం కన్నుమూశారు.సూపర్ స్టార్ కృష్ణ మరణ వార్త తో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ మరణవార్త తెలిసిన అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ.. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలుపుతున్నారు.

స్పై జోనర్ చిత్రాలను టాలీవుడ్ కు పరిచయం చేసిన హీరో కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ తేనె మనసులు (1965) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. 5 దశాబ్దాలపాటు సుమారు 350 సినిమాలలో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించారు. సాహసాలకు , ప్రయోగాత్మక చిత్రాలకు హీరో కృష్ణ పెట్టింది పేరుగా మారారు. మైథలాజికల్, డ్రామా, వెస్టర్న్, ఫాంటసీ, యాక్షన్, స్పై జోనర్‌తోపాటు చారిత్రాత్మక చిత్రాల్లో హీరోగా నటించి కృష్ణ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు.టాలీవుడ్ లో ఎంతమంది హీరోలున్నా అభిమానులు ఒక్క కృష్ణనే హీరో కృష్ణగా పిలవడం విశేషం.

కృష్ణ మృతిపై మోదీ ప్రగాఢ సంతాపం
అలనాటి నటుడు సూపర్ స్టార్ కృష్ణ నేడు తుది శ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో నేడు మరణించారు. దీంతో మహేష్ కుటుంబం ఒక్కసారిగా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఇక ఇప్పటికే కృష్ణ మృతిపట్ల సినీ రాజకీయ ప్రముఖుల దగ్గర నుండి అందరూ సంతాపం తెలియచేస్తున్నారు. ఇక తాజాగా ప్రధానమంత్రి మోడీ కూడా తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ సంతాపం తెలియచేశారు. కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో,ఉన్నతమైన,స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్.ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు.ఈ విషాదకర సమయంలో మహేష్ బాబుకు అలానే వారి…

ఒకే ఏడాది మూడు విషాదాలు
ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది మూడు విషాదాలు సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మహేష్ తీవ్ర విషాదాన్ని మిగిల్చి మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోయింది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. కాలేయ సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో మరణించారు. ఇక ఆ బాధ నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి పద్మావతి కొద్ది రోజుల క్రిందటే మరణించారు. సెప్టెంబర్ లో ఆమె మృతి చెందారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నారు మహేష్ బాబు. ఇంతలోనే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది.

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్
మొదటి తరం హీరోలు నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వర రావు , కాంతారావు కాంబినేషన్ లో పలు సినిమాలలో నటించిన హీరో కృష్ణ , రెండవతరం హీరోలు శోభన్ బాబు , కృష్ణం రాజు కాంబినేషన్ లో నటించారు. మూడవతరం హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , రవితేజ ల కాంబినేషన్ లో కృష్ణ నటించారు. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్
తెలుగు సినీ పరిశ్రమలో మహామహులకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను తిరగరాస్తూ అసాధ్యుడిగా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆయన సాధించిన పలు రికార్డులు నేటికి చెక్కుచెదరలేదు.తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం కృష్ణ రికార్డులు శాశ్వతంగా నిలిచిపోతాయి.హీరోగా అత్యధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎక్కువ మంది దర్శకులతో పనిచేసిన ఏకైక హీరో కృష్ణనే యాభై ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 108 మంది దర్శకులతో కృష్ణ సినిమాలు చేశారు.

లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
కులగోత్రాలు (1961), పదండి ముందుకు (1962), పరువు ప్రతిష్ట (1963) చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన కృష్ణ తేనెమనసులు (1965) చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350 సినిమాలలో నటించిన కృష్ణ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందారు. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్‌డమ్‌ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు) వంటి రికార్డ్స్ ను కృష్ణ క్రియేట్ చేశారు. హీరో , నిర్మాత , దర్శకుడు , స్టూడియో…

సూపర్ స్టార్ కృష్ణ మృతి ప్రముఖుల సంతాపం
గత రెండేళ్ల నుండి ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలను కోల్పోయాం. ఇక రీసెంట్ గానే సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మరో లెజెండరీ నటుడిని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ మరోసారి విషాదంలో మునిగిపోయింది. నిన్న సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఇక వైద్యులు కూడా కృష్ణ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. అంతేకాదు 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని చెప్పారు. ఇక ఈలోపే కృష్ణ తుదిశ్వాస విడిచారు. దీంతో అటు ఇండస్ట్రీతో పాటు…
50 వసంతాల "కౌబాయ్"
పద్మాలయ స్టూడియోస్ బ్యానర్ పై కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో కృష్ణ , విజయ నిర్మల జంటగా ఇంగ్లీష్ మూవీస్ ఇన్ స్పి రేషన్ తో రూపొందిన "మోసగాళ్ళకు మోసగాడు "మూవీ 1971 సంవత్సరం ఆగష్టు 27 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది . తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫస్ట్ కౌ బాయ్ మూవీ , ఫస్ట్ కలర్ ఫిల్మ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. నాగభూషణం , గుమ్మడి , కైకాల , ప్రభాకరరెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. పి. ఆదినారాయణ రావు సంగీతం అందించారు. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్స్ ఇంగ్లిష్ , హిందీ , తమిళ భాషలలో రిలీజ్ అయ్యాయి.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన సూపర్ స్టార్ కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. సాహసాలకు మారు పేరు కృష్ణ. ప్రయోగాత్మక సినిమాలు తీయాలంటే ఆయన తరువాతే. ఎన్టీఆర్, ఏఎన్నాఆర్ రాజ్యమేలుతున్న వేళ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కృష్ణ తనదైన మార్గం నిర్దేశించుకున్నారు. ఒకరు జానపదం మరొకరు పౌరాణికాలకు పెట్టింది పేరుగా ముందుకు సాగుతున్న వేళ.. సాంఘిక చిత్రాలకు కేరాఫ్ గా మారారు కృష్ణ. అందులోనూ విత్ యాక్షన్ అంటే.. నిర్మాతలు దర్శకులకు ప్రముఖంగా సూపర్ స్టార్ కనిపించేవారు. తెలుగు సినీ చరిత్రలో సూపర్ స్టార్ కృష్ణ చేసిన ప్రయోగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా తెలుస్తుంది. తెలుగు వెండి…

నాన్నకు ప్రేమతో .. మహేష్ బాబు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటుడు , నిర్మాత , దర్శకుడిగా పలు రికార్డ్స్ క్రియేట్ చేసి సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. లెజెండరీ యాక్టర్ కృష్ణ ఈ రోజు (మే 31 ) తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు నిన్నటి నుండే తమ అభిమాన హీరో కు సోషల్ మీడియా ద్వారా బర్త్ డే శుభాకాంక్షలు అందజేస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు తన స్పెషల్ విషెస్ ను తెలిపారు.
మామతో అల్లుడు - ఫ్యాన్ బాయ్ మూమెంట్
ఎంత హీరోలు అయినా కూడా వాళ్లకి కూడా ఎవరో ఒకరు ఫెవరెట్ ఉంటారు. ఇప్పుడు అలాంటి ఫ్యాన్ బాయ్ మూమెంట్ ను ఎంజాయ్ చేస్తున్నాడు సుధీర్ బాబు. అసలు సంగతేంటంటే.. ఈరోజు తన ట్విట్టర్ లో ఒక ఫొటో పోస్ట్ చేశాడు. కృష్ణ అక్కడ కుర్చీపై కూర్చుంటే.. కింద సుధీర్ బాబు సిగ్గు పడుతూ కూర్చున్నాడు. దానికి సుధీర్ బాబు.. చాలా ఏళ్లుగా ఆయన్ని దగ్గరిగా చూస్తున్నా.. అయితే ఆయనతో ఉన్న ప్రతిక్షణం ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ లా అనిపిస్తుంటుంది అని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇప్పుడు ఈఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కుటుంబ కథా చిత్రం "పండంటి కాపురం"
జయప్రద పిక్చర్స్ బ్యానర్ పై లక్ష్మీ దీపక్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ , విజయ నిర్మల జంటగా కుటుంబ సంబంధాల నేపథ్యంలో అన్నదమ్ముల కథగా రూపొందిన "పండంటికాపురం "(1972 ) మూవీ ఘనవిజయంసాధించి ప్రేక్షకాదరణ పొందింది. ఎస్ వి రంగారావు , గుమ్మడి , ప్రభాకర్ రెడ్డి , దేవిక , జమున , బి. సరోజాదేవి , అల్లు రామలింగయ్య , రాజ బాబు వంటి నటీనటులతో రూపొందిన "పండంటి కాపురం" బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఎస్ పి కోదండపాణి స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.