
ట్యాగ్ · 9 కథనాలు

"బంగార్రాజు "మూవీ లో నెగటివ్ రోల్ లో భూమిక ?
గుడ్‌బై 'వైల్డ్‌డాగ్' - చాలా బాధగా ఉంది
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మన్మథుడు "
యాక్షన్ సీన్స్ లో నాగార్జున
'హిమాలయాల్లో' వైల్డ్ డాగ్ - 3980 మీటర్ల ఎత్తులో షూట్

నాగార్జున "వైల్డ్ డాగ్ "మూవీ అప్ డేట్
'అన్నపూర్ణ స్టూడియోస్' పై వార్తలు నమ్మొద్దు

ఊటీ షెడ్యూల్ స్టార్ట్ చేసిన నాగార్జున 'ది ఘోస్ట్'
కింగ్ నాగార్జున మాత్రం హడావుడి లేకుండా కూడా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది బంగార్రాజు సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు కింగ్ నాగార్జున. సోగ్గాడే చిన్న నాయన సినిమాకు వచ్చిన సీక్వెల్ ఇది. ఇక ఇప్పుడు ప్రస్తుతం నాగ్ తన కొత్త సినిమా ది ఘోస్ట్ పై ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు దుబాయ్ షెడ్యూల్ తో బిజీగా ఉన్న చిత్రయూనిట్ ఇప్పుడు మరో కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఊటీలో నేడు కొత్త షెడ్యూల్ ను స్టార్ట్…
"బంగార్రాజు "మూవీ లో నెగటివ్ రోల్ లో భూమిక ?
"యువకుడు " (2000) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన భూమిక "ఖుషి ", "ఒక్కడు ", "సింహాద్రి ", "మిస్సమ్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషా చిత్రాలలో భూమిక నటిస్తున్నారు. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ "బంగార్రాజు "మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
గుడ్‌బై 'వైల్డ్‌డాగ్' - చాలా బాధగా ఉంది
అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కోసం హిమాలయాస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు హిమాచల్ ప్రదేశ్‌లో మనాలీలో షూటింగ్ జరుపుకుంది. అక్కడికి వెళ్ళినప్పుడే నాగ్ దాదాపు మూడు వారాలపాటు షూటింగ్ జరుపుకోనున్నట్టు తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే తన షూటింగ్ ను పూర్తిచేసుకున్నాడు. ఇక ఈ విషయాన్ని నాగ్ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. "వైల్డ్‌డాగ్‌లో నా పాత్ర చిత్రీకరణ ఈరోజుతో పూర్తయ్యింది. ఇంటికి బయలుదేరాను. నా టాలెంటెడ్ టీమ్‌కు, హిమాలయాస్‌కు గుడ్‌బై చెబుతున్నందుకు చాలా…
రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మన్మథుడు "
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా రూపొందిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ "మన్మథుడు " మూవీ ఘనవిజయం సాధించింది. సొనాలీ బింద్రే , అన్షు కథానాయికలు. "మన్మథుడు " మూవీ కి స్టోరీ , డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. త్రివిక్రమ్ డైలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ప్రేక్షకులను అలరించింది. హీరో నాగార్జున కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీ గా నిలిచింది.
యాక్షన్ సీన్స్ లో నాగార్జున
మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అషిషోర్ సాల్మన్ దర్శకత్వంలో నాగార్జున హీరో గా వాస్తవ సంఘటనల ఆధారంగా యాక్షన్ థ్రిల్లర్ "వైల్డ్ డాగ్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. దియా మీర్జా , సయామీ ఖేర్ కథానాయికలు. హీరో నాగార్జున ఎన్ఐఎ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో అతుల్ కులకర్ణి , అలీ రెజా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. లాక్ డౌన్ కు ముందు "వైల్డ్ డాగ్" మూవీ 70శాతం షూటింగ్ పార్ట్ ను కంప్లీట్ చేసుకుంది.
'వైల్డ్ డాగ్' - నాగ్ కోసం స్టంట్స్ కంపోజ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో తండ్రి
ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ లో ఉన్నసంగతి తెలిసిందే. అహిషోర్ సాల్మన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్ళింది చిత్రయూనిట్. ఈ సినిమా తాజా షెడ్యూల్ హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీలో మొదలైంది. దాదాపు మూడు వారలు అక్కడే నిర్విరామంగా షూటింగ్ చేసుకోనున్నారు. సుదీర్ఘంగా కొనసాగే ఈ షెడ్యూల్‌లో నాగార్జునతో సహా ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
'హిమాలయాల్లో' వైల్డ్ డాగ్ - 3980 మీటర్ల ఎత్తులో షూట్
ప్రస్తుతం కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా ఎప్పుడో మొదలైంది. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల లేట్ అయితే కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఇక ఇటీవలే షూటింగ్ ను మళ్లీ స్టార్ చేశారు. ఇక ఇన్ని రోజులు ఇక్కడే చిత్రీకరణ జరుపుకున్న చిత్రబృందం ఇప్పుడు ఈ సినిమా కోసం హిమాలయాలకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఇక అక్కడకు వెళ్లిన నాగ్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో వీడియో ద్వారా తెలిపారు.

నాగార్జున "వైల్డ్ డాగ్ "మూవీ అప్ డేట్
తమిళ సూపర్ స్టార్ , తలైవా ఆధ్యాత్మిక చింతనతో తరచూ హిమాలయాలకు వెళుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో నాగార్జున షూటింగ్ కై హిమాలయాలకు వెళ్ళారు. కరోనా కారణంగా స్టార్ హీరోస్ సుమారు 7నెలలు ఇళ్ళకే పరిమితం అయ్యారు. 60 సంవత్సరాల నాగార్జున ధైర్యం గా షూటింగ్స్ లో పాల్గొనడం విశేషం. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 4 కు నాగార్జున హోస్ట్ గా ఉన్నారు. కంటిన్యూ గా బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొంటున్న నాగార్జున ఇప్పుడు "వైల్డ్ డాగ్ "మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
'అన్నపూర్ణ స్టూడియోస్' పై వార్తలు నమ్మొద్దు
అన్నపూర్ణ స్టూడియోలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నట్టు ఈ రోజు ఉదయం నుండి వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకొని మంటల్ని ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఏమి జరగకపోగా, ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు.