
ట్యాగ్ · 13 కథనాలు


హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ మారలేదు

హరిహర వీరమల్లు షూటింగ్ షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్

హరి హర వీరమల్లు రిలీజ్ అప్పుడే

హరి హర వీరమల్లు రిలీజ్ పై మరో ట్విస్ట్

దసరా దిశగానే వీరమల్లు అడుగులు

'హరిహర వీరమల్లు' మళ్లీ మొదలు పెట్టిన పవన్..!

"హరిహరవీరమల్లు" షూటింగ్ పునః ప్రారంభం

"హరిహర వీరమల్లు" లేటెస్ట్ అప్ డేట్

'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్

గేరు మార్చిన హరిహర వీరమల్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న పలు ప్రాజెక్టులలో 'హరిహర వీరమల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ మారలేదు
బ్రో తరువాత పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు తో ప్రేక్షకులను పలకరించనున్నాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రెండు భాగాలుగా వస్తున్న సినిమా ఇది.షూటింగ్ కూడా పూర్తి కావొచ్చింది.పవన్ డేట్స్ ఇస్తే వచ్చే నెలలో బ్యాలెన్స్ షూట్ పూర్తి కానుంది.ఫస్ట్ పార్ట్ స్వోర్డ్ వెర్సెస్ స్పిరిట్ ను మార్చి 28న రిలీజ్ చేయనున్నారు.అయితే రీసెంట్ గా అదే డేట్ కు నితిన్ రాబిన్ హుడ్ అలాగే 29న మ్యాడ్ స్క్వేర్ విడుదలను ప్రకటించాయి.దాంతో హరి హర వీరమల్లు వాయిదా పడనుందని అందుకే ఈ రెండు సినిమాలు ఆ టైంలో వస్తున్నాయని వార్తలు వచ్చాయి.

ప్రభాస్, పవన్ సినిమాలపై నిధి అగర్వాల్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌తో 'ది రాజాసాబ్', పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' వంటి ప్రెస్టీజియస్ మూవీస్‌లో నటిస్తోంది బ్యూటిఫుల్ హీరోయిన్ నిధి అగర్వాల్. రాజాసాబ్ చిత్రానికి మారుతి, హరిహర వీరమల్లు సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఇవి సెట్స్ పైన ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ హీరోయిన్ తాజాగా 'ఆస్క్ నిధి' పేరుతో నెటిజెన్లతో ఛాట్ నిర్వహించింది.

హరిహర వీరమల్లు షూటింగ్ షురూ.. రిలీజ్ డేట్ ఫిక్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. ఆయన హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' షూటింగ్ ఈరోజు పునఃప్రారంభం అయింది. వెండితెరపై ప్రేక్షకులకు మరపురాని అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో, నిర్మాతలు కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేటినుంచి విజయవాడలో కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ కీలకమైన విజయవాడ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంటుంది.

హరి హర వీరమల్లు రిలీజ్ అప్పుడే
పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు.ఇది రెండు భాగాలుగా రానుందని తెలిసిందే.ఇక ఈసినిమా స్టార్ట్ అయ్యి మూడు ఏళ్లు అవుతున్నా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.పవన్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ఇక ఇప్పుడు ఈసినిమాను తొందరగా పూర్తి చేయడానికి టీం రెడీ అవుతుంది.పవన్ కూడా ఎలక్షన్స్ రిజల్ట్ తరువాత ఈసినిమాకు డేట్స్ ఇవ్వనున్నాడని సమాచారం దాంతో ఈసినిమాను ఆగస్టు లోగా పూర్తి చేసి డిసెంబర్ లో తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.మరోవైపు ఓజీ సెప్టెంబర్ 27న వస్తుందని ముందు ప్రకటించినా వెనక్కి వెళ్లడం తప్పేలా లేదు.

హరి హర వీరమల్లు రిలీజ్ పై మరో ట్విస్ట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రస్తుతం ఆసక్తిగా ఎదురుచూస్తుంది హరి హర వీరమల్లు సినిమా కోసం. రీఎంట్రీ తరువాత పవన్ కళ్యాణ్ నుండి వచ్చిన వకీల్ సాబ్ అలానే భీమ్లా నాయక్ సినిమాలు రెండూ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. దీంతో ఈసినిమాతో పవన్ ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని కోరుకుంటున్నారు. అందుకే రిలీజ్ కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. పవన్ బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్ ఒక్కసారిగా సినిమా అంచనాలను పెంచింది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఇప్పటివరకూ ఈసినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా.. మిగిలిన భాగాన్ని ఏఎం రత్నం తనయుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించనున్నాడు.

దసరా దిశగానే వీరమల్లు అడుగులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా. అయితే ఈసినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అంతలా లేట్ అవుతుంది. మరోవైపు పవన్ మాత్రం వేరే సినిమాలను పూర్తి చేసుకుంటూ వెళుతున్నాడు. అలా మొదలుపెట్టాడో లేదో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న సినిమాలో తన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేశాడు. ఈనేపథ్యంలోనే హరిహర వీరమల్లు పరిస్థితి ఏంటా అని అందరూ అనుకుంటున్నారు.

'హరిహర వీరమల్లు' మళ్లీ మొదలు పెట్టిన పవన్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈసినిమా తరువాత పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో చేస్తున్న సంగతి కూడా విదితమే కదా. నిజానికి ఈసినిమా భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే మొదలైంది. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే కరోనా వల్ల బ్రేక్ పడగా మళ్లీ ఇంతవరకూ సెట్స్ పైకి రాలేదు.

"హరిహరవీరమల్లు" షూటింగ్ పునః ప్రారంభం
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరిహర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

'హరి హర వీరమల్లు' ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉంటుంది
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉండగా మరికొద్దిరోజుల్లోనే షూటింగ్ పూర్తికానుంది. ఈ సినిమా తరువాత క్రిష్ సినిమా మొదలుపెట్టనున్నాడు పవన్.

"హరిహర వీరమల్లు" లేటెస్ట్ అప్ డేట్
మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ "హరిహర వీరమల్లు " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు " మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

'హరిహర వీరమల్లు' రిలీజ్ డేట్ ఫిక్స్
ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో నేడు పవన్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే తాజాగా పవన్-క్రిష్ సినిమాకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు. పవన్-క్రిష్ కాంబినేషన్లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో హరిహర వీరమల్లు సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కరోనా వల్ల ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. త్వరలోనే ఈసినిమా షూటింగ్ ను రీస్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమా చేస్తుండగా.. అది పూర్తయిన వెంటనే ఈసినిమాను మొదలుపెట్టనున్నాడు.