కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Gopichand New Movie News

ట్యాగ్ · 9 కథనాలు

సినిమా వార్తలు

గోపీచంద్ తో తర్వాత సినిమా - అఫీషియల్ అనౌన్స్ మెంట్

`భలే భలే మగాడివోయ్`, మ‌హానుభావుడు, `ప్రతిరోజూ పండగే` ఇలా వరుస సక్సెస్ లతో మంచి ఫామ్ లో ఉన్నాడు డైరెక్టర్ మారుతి. కమర్షియల్ ఎలిమెంట్స్ లో అయినా.. హార్రర్ జోనర్ అయినా సరే తనదైన శైలిలో కామెడీని జోడించి నవ్వించగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ మారుతి. రీసెంట్‌గా సాయి ధ‌ర‌మ్ తేజ్‌కు `ప్ర‌తీరోజు పండ‌గే` వంటి సూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన మారుతి మరో కొత్త సినిమాకు చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పటివరకూ ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. ఆ మధ్య మాస్ మహారాజా రవితేజతో సినిమా చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంలో ఎలాంటి స్పష్టత రాలేదు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

భార్యకు ప్రేమతో గోపీచంద్ ..!

యాక్షన్ హీరో హీరో గోపీచంద్, రేష్మ‌ ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. 2013 మే 12న వీరి వివాహం జరిగింది. శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్లై ఏడు వ‌సంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఇక ఈ రోజు పెళ్లి రోజు కావడంతో గోపీచంద్ తన భార్య గురించి చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

గోపీచంద్ ‘సీటీమార్’.. ఫస్టాఫ్ తాలూకు షూటింగ్ పూర్తి

‘గౌతమ్ నంద’(2017) తరువాత యాక్షన్ హీరో గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘సీటీమార్’. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా నాయికగా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్ర‌స్ భూమిక ఓ కీలక పాత్రలో దర్శనమివ్వనుంది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Macho Star Gopichand Donates 10 Lakh Rupees To Corona Crisis Charity Foundation
సినిమా వార్తలు

కరోనా క్రైసిస్ ఛారిటీ కి గోపీచంద్ విరాళం

కరోనా మహమ్మారి కారణం గా జనజీవవనం కష్టాలపాలయింది. అనేక పరిశ్రమలతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మూతపడింది. చిత్ర పరిశ్రమ పై ఆధారపడిన సినీ కార్మికుల సంక్షేమానికై మెగా స్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ సంస్థ ఏర్పాటయిన విషయం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖుల విరాళాలతో సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులను ఈ సంస్థ అందజేస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

విలన్ గా నటించడం నిజం కాదు - గోపీచంద్

"తొలి వలపు" మూవీ తో గోపీచంద్ హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తరువాత గోపీచంద్ ప్రతినాయకుడిగా నటించిన "జయం ", "వర్షం"మూవీస్ ఘనవిజయం సాధించాయి. గోపీచంద్ తిరిగి హీరోగా నటించిన "యజ్ఞం" మూవీ ఘనవిజయం సాధించడంతో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. గోపీచంద్ హీరోగా నటించిన రణం, లక్ష్యం, శౌర్యం, సాహసం, లౌక్యం, జిల్ మూవీస్ విజయం సాధించాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కామెడీ , యాక్షన్ ఎంటర్ టైనర్ గా "సీటీ మార్"

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్, మిల్కీ బ్యూటీ తమన్నా జంటగా కామెడీ, యాక్షన్ ఎంటర్ టైనర్ "సీటీ మార్" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. కబడ్డీ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో గోపీచంద్, తమన్నా కబడ్డీ కోచ్ లుగా నటిస్తున్నారు. దిగాంగన, భూమిక ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!

కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన 'గోపీచంద్' కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన 'చాణక్య' సినిమా అన్న హిట్ అవుతుందనుకున్నాడు.. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో తన తర్వాత వచ్చే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సాంగ్

బోయపాటి క్లాప్ తో గోపీచంద్ 28 మూవీ ప్రారంభం

BVSN ప్రసాద్ సారథ్యం లో శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్ పై రూపొందిన ఛత్రపతి, డార్లింగ్, సాహసం, అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో, తొలిప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో ఈరోజు హైదరాబాద్ లో గోపీచంద్ 28 మూవీ షూటింగ్ ప్రారంభమయింది. సక్సెస్ ఫుల్ మూవీ సాహసం తరువాత ఆ బ్యానర్ లో హీరో గోపీచంద్ నటిస్తున్న రెండవ మూవీ.

Team TFNవాట్సాప్
Gopichand To Begin His 28th Movie Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gopichand New Movie News,Gopichand Upcoming Movie News,Gopichand Next Film Updates,Gopichand Next Project Details,#Gopich
సినిమా వార్తలు

#గోపీచంద్28 త్వరలో ప్రారంభం

యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడు గా రూపొందిన చాణక్య మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది . సీనియర్ ప్రొడ్యూసర్ BVSN ప్రసాద్, గోపీచంద్ హీరోగా నిర్మిస్తున్న మూవీ ఈ నెల 13వ తేదీ పూజాకార్యక్రమం జరుపుకుంది. ఇప్పుడు గోపీచంద్ హీరోగా మరో మూవీ అనౌన్స్ అయింది. దర్శకుడు సంపత్ నంది, గోపీచంద్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుంది. వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందిన గౌతమ్ నంద మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్

షేర్