
ట్యాగ్ · 8 కథనాలు

పెద్ద మనసు చాటుకుంటున్న 'దిల్' రాజు..!
జీహెచ్ ఎంసీ కార్మికులపై 'దిల్' చూపించిన రాజు..!

'ఎవరు' డైరెక్టర్ తో 'దిల్ రాజు' ముల్టీస్టారర్..?

దిల్ రాజు వారసుడి కోసం ‘రౌడీ బాయ్స్’..!

`దిల్` రాజుకు మరోసారి అచ్చొచ్చిన సంక్రాంతి

పోలీస్ డిపార్ట్ మెంట్ సేవలపై దిల్ రాజు మూవీ
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం కలవరపడుతున్న విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడికై ప్రపంచమంతా లాక్ డౌన్ పాటిస్తుంది. భారతదేశం లో కరోనా వ్యాప్తి నివారణకై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. కరోనా మహమ్మారి పోరులో వైద్య బృందాలు, పోలీస్ శాఖ, పారిశుధ్య సిబ్బంది అహర్నిశలూ శ్రమిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు కరోనా పై పోలీస్ యుద్ధం నేపథ్యం లో ఒక మూవీ ని నిర్మిస్తానని తెలిపారు.
పెద్ద మనసు చాటుకుంటున్న 'దిల్' రాజు..!
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల పేదలకు, రోజువారీ కూలీలకు ఆర్థికంగా.. తినడానికి కూడా ఇబ్బందులు పడుతున్న వారికి పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.
జీహెచ్ ఎంసీ కార్మికులపై 'దిల్' చూపించిన రాజు..!
కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ లాక్ డౌన్ వల్ల అందరూ ఇళ్లల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఇక ఈ లాక్ డౌన్ వల్ల పేదలకు, రోజువారీ కూలీలకు ఆర్థికంగా.. తినడానికి కూడా ఇబ్బందులు ఎదరువుతున్నాయి. ఇక వారికీ సాయం చేయడానికి పలువురు ప్రముఖులు విరాళాలను అందిస్తున్నారు.ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు తమంతటతాముగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించారు.

'ఎవరు' డైరెక్టర్ తో 'దిల్ రాజు' ముల్టీస్టారర్..?
డిస్ట్రిబ్యూటర్ గా.. నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ రాజు ద్వారా సినిమా విడుదలైందంటే మినిమం గ్యారంటీ రిలీజ్ ఉంటుందన్న పేరు సంపాదించుకున్నాడు. ఇక కొత్త కొత్త డైరెక్టర్స్ ను సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేయడం.. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు దిల్ రాజు. ఇక ఈ సంక్రాంతి కూడా దిల్ రాజు కు బాగా కలిసొచ్చింది. నిర్మాతగా 'సరిలేరు నీకెవ్వరు', డిస్ట్రిబ్యూటర్ గా 'అల వైకుంఠపురములో' సినిమాలు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. మరోసారి దిల్ రాజు కు సినిమాలపై వున్న పట్టు గురించి తెలిసింది. ప్రస్తుతం మరి కొన్ని సినిమాలు దిల్ రాజు…
దిల్ రాజు, లగడపాటి శ్రీధర్ వారసుల "రౌడీ బాయ్స్ "
టాలీవుడ్ లో హీరో , దర్శకుల వారసులు హీరోలుగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు నిర్మాతల వారసులు హీరోలుగా టాలీవుడ్ లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ టాలీవుడ్ లో స్టార్ హీరో గా మారిన విషయం తెలిసిందే. నిర్మాత రామానాయుడు తనయుడు వెంకటేష్, బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సక్సెస్ ఫుల్ హీరోలుగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, లగడపాటి వారసులు టాలీవుడ్ కు హీరోలుగా పరిచయం అవుతున్నారు.

దిల్ రాజు వారసుడి కోసం ‘రౌడీ బాయ్స్’..!
డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి నిర్మాతగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎన్నో సక్సెస్ లను అందుకున్న సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. దిల్ రాజు ద్వారా సినిమా విడుదలైందంటే మినిమం గ్యారంటీ రిలీజ్ ఉంటుందన్న పేరు సంపాదించుకున్నాడు. ఇక కొత్త కొత్త డైరెక్టర్స్ ను సినీ ఇండస్ట్రీ కి పరిచయం చేయడం.. కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు దిల్ రాజు. అందుకే దిల్ రాజు అంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు.

`సరిలేరు నీకెవ్వరు`తోనూ... `దిల్` రాజు సెంటిమెంట్ రిపీట్ అవుద్దా?
దిల్ రాజు… విజయవంతమైన చిత్రాలను చిరునామాగా నిలచిన ఈతరం నిర్మాత. తొలి చిత్రం ‘దిల్’ నుంచి తాజా చిత్రం ‘మహర్షి’ వరకు ఆయనది ఇదే బాణీ. ప్రస్తుతం… దాదాపు అరడజను సినిమాలతో ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వీటిలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఒకటి. అనిల్ సుంకర, మహేష్ బాబుతో కలసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాడు రాజు. శుక్రవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ సినిమా… త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళనుంది. అంతేకాదు… 2020 సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు కూడా.

`దిల్` రాజుకు మరోసారి అచ్చొచ్చిన సంక్రాంతి
నిర్మాతగా `దిల్` రాజుది 15 ఏళ్ళ ప్రయాణం. ఈ జర్నీలో సింహభాగం విజయవంతమైన చిత్రాలను అందించి... మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారాయన. 2017లో అయితే... డబుల్ హ్యాట్రిక్ విజయాలను అందుకుని ఓ సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే... సంక్రాంతి కానుకగా ఆయన అందించిన తాజా చిత్రం `ఎఫ్ 2` బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా... మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా కలెక్షన్ల విషయంలోనూ దూసుకుపోతోంది.