
ట్యాగ్ · 29 కథనాలు · పేజీ 2


ప్రజలకు నభా నటేష్ సలహా

మాస్క్ లు ధరించండి - రాశీఖన్నా

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతి

సోషల్ మీడియా లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలి - నిధి

విజయ్ దేవరకొండ కరోనా సందేశం

'ఆదిపురుష్' టీమ్ షిఫ్ట్ టు హైద్రాబాద్

"RRR" టీమ్ ఐదు భాషలలో కరోనా సందేశం

కరోనా బాధితులకు రకుల్ సహాయనిధి
తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రకుల్ ప్రీత్ సింగ్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న రకుల్ ప్రస్తుతం 4 హిందీ , రెండు తమిళ , ఒక తెలుగు మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయం లో వేలాది మంది వలస కార్మికులకు ఆహారసదుపాయాన్ని రకుల్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణం లో మరో మంచి పనికి రకుల్ శ్రీకారం చుట్టారు.

ప్రజలకు నభా నటేష్ సలహా
మోడల్ , థియేటర్ ఆర్టిస్ట్ నభా నటేష్ “నన్ను దోచుకుందువటే “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యి , ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “మూవీ లో తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించి నభా నటేష్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా గుర్తింపు పొందారు. నభా నటేష్ ప్రస్తుతం శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీలో కథానాయికగా నటిస్తున్నారు.

మాస్క్ లు ధరించండి - రాశీఖన్నా
తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ లో బిజీగా ఉన్న హీరోయిన్ రాశీఖన్నా టాలీవుడ్ లో నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. 5 తమిళ , ఒక మలయాళం మూవీ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. సోషల్ మీడియా లో తన ఫోటోషూట్ ఫొటోలతో అభిమానులను రాశీఖన్నా అలరిస్తున్నారు.

ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ మృతి
కరోనా సెకండ్ వేవ్ మాత్రం చాలా ఎఫెక్టివ్ గా తన ప్రభావాన్ని చూపిస్తుంది. చిన్నా పెద్దా.. సామాన్యులు సెలబ్రిటీలు అనే తేడా లేకుండా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇక ఇప్పటికే కరోనా వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు మృత్యువాత పడ్డారు. ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కూడా ఈమధ్యకాలంలో కరోనా వల్ల మృతి చెందారు. ఇప్పుడు టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి ) మృతి చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్ పై వైద్యం అందించినా.. ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. దీంతో పరిస్థితి చేయి దాటడంతో ఈరోజు మృతి చెందారు. ఇక ఆయన మృతి…

సోషల్ మీడియా లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలి - నిధి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న "హరి హర వీరమల్లు "మూవీలో కథానాయికగా నటిస్తున్న నిధి అగర్వాల్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రజలలో సోషల్ మీడియా ప్రభావం అధికమని తెలిసిన విషయమే. సోషల్ మీడియా లో పాజిటివ్ పోస్ట్‌లే చేయాలనీ , కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సోషల్ మీడియాలో బాధితుల సహాయానికి సంబంధించిన పోస్టులను మనం గమనిస్తూనే ఉన్నామనీ , ఇటువంటి సందర్భాల్లో కూడా కొందరు నెగటివ్ కంటెంట్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారనీ అది కరెక్ట్ కాదనీ నిధి చెప్పారు.

విజయ్ దేవరకొండ కరోనా సందేశం
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ప్రజలలో భయాందోళనలు పెరిగిపోయాయి. సినీ సెలబ్రిటీస్ ప్రజలకు ధైర్యం చెబుతూ కరోనా మహమ్మారి కై తీసుకోవాల్సిన జాగ్రత్తలగురించి ప్రజలలో అవగాహన కలిగిస్తున్న విషయం తెలిసిందే. కోవిడ్ లక్షణాలు ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి సినీ నటులు విజయ్ దేవరకొండ చెబుతున్నారు చూడండి’ అంటూ తెలంగాణ డిజిటల్ మీడియా వింగ్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో ఒక వీడియోని షేర్ చేసింది.

'ఆదిపురుష్' టీమ్ షిఫ్ట్ టు హైద్రాబాద్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. అలాగే కృతి సనన్ సీతగా కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కు కూడా మొన్నటివరకూ స్పీడుగానే జరుగుతుంది . అయితే కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటంతో ఈసినిమా షూట్ కు కూడా బ్రేక్ పడింది. సినిమా కోసం ముంబైకే మకాం మార్చిన ప్రభాస్ కూడా ఇక్కడికే వచ్చేశాడు.

"RRR" టీమ్ ఐదు భాషలలో కరోనా సందేశం
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రౌద్రం రణం రుధిరం ” మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. హీరో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న ఈ మూవీ లో అలియా భట్ , ఒలీవియా మోరిస్ కథానాయికలు. భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో రూపొందుతున్న ఈ మూవీ లో అజయ్ దేవగన్ , సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
'పుష్పరాజ్' కు తప్పని కరోనా
మెగా హీరోల్లో ఇప్పటికే చాలామంది కోరనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే చాలామంది హీరోలు తమ షూటింగ్ లను ఆపేసుకున్నారు. కానీ అల్లు అర్జున్ మాత్రం సినిమాను అనుకున్న టైమ్ కే రిలీజ్ చేయాలని తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప షూటింగ్ ను ఆపలేదు. అయితే ఇప్పుడు బన్నీకి కూడా కరోనా పాజిటివ్ రావడంతో షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది.