
ట్యాగ్ · 10 కథనాలు


17 సంవత్సరాల కెరీర్ కంప్లీట్ చేసుకున్న అనుష్క
ట్విట్టర్ లోకి అధికారికంగా వచ్చిన అనుష్క
స్టార్ హీరోయిన్ అనుష్క స్పెషల్ చిట్ చాట్
నిశ్శబ్ధం పై ప్రజలకు అనుష్క మెసేజ్
అనుష్క ఆరోగ్య సూత్రాలు

14 వసంతాల సినీకెరీర్
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క

'అనుష్క' ఎమోషనల్ పోస్ట్.. ఫ్యాన్స్ కు స్పెషల్ థ్యాంక్స్..!
2005 లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో వచ్చిన సూపర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అనుష్క. నటన,డ్యాన్స్ అనేవి తెలియకపోయినా తన హార్డ్ వర్క్ తో ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కి తారాస్థాయికి చేరుకుంది. ఎంతో మంది స్టార్ హీరోస్.. ఎంతోమంది టాప్ డైరెక్టర్స్ తో నటించింది. తనదైన అందం, అభినయంతో అభిమానులను మెస్మరైజ్ చేయడం అనుష్క స్పెషాలిటీ. దేవసేన, భాగమతి, జేజమ్మ ఈ పాత్రలు అనుష్క కోసమే పుట్టాయి. ఆ పాత్రల్లో వేరే వాళ్ళని ఊహించుకోవడం కష్టమే. స్టార్ హీరోలకు పోటీగా ఆమె కోసం పాత్రలు రాసే స్థాయికి ఎదిగింది.

17 సంవత్సరాల కెరీర్ కంప్లీట్ చేసుకున్న అనుష్క
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కిన "సూపర్"(2005) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క పలు తెలుగు , తమిళ బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. అనుష్క కథానాయికగా నటించిన"విక్రమార్కుడు ", "లక్ష్యం ", "బిల్లా" , "వేదం ", "మిర్చి ", "బాహుబలి", "బాహుబలి 2", "సోగ్గాడే చిన్ని నాయనా" వంటి మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు పెట్టింది పేరుగా మారిన అనుష్క "అరుంధతి", "రుద్రమదేవి " , "భాగమతి ", "నిశ్శబ్దం" వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

అనుష్క శెట్టి- నవీన్ పొలిశెట్టి సినిమా షూటింగ్ అప్ డేట్..!
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, లేటెస్ట్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. . సాహో, రాధే శ్యామ్ లాంటి భారీ సినిమాలతో దేశవ్యాప్తంగా యు.వి.క్రియేషన్స్ కు అద్భుతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ సంస్థలో అనుష్క శెట్టి హ్యాట్రిక్ సినిమా చేస్తున్నారు. ఇది అనుష్కకు 48వ సినిమా. ఇప్పటికే ఈ నిర్మాణ సంస్థలో రెండు సినిమాలు చేశారు అనుష్క శెట్టి. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి.. 2018లో లేడీ ఓరియెంటెడ్ భాగమతి సినిమాలను యు.వి.క్రియేషన్స్ నిర్మించారు. ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
ట్విట్టర్ లోకి అధికారికంగా వచ్చిన అనుష్క
సెలబ్రిటీస్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ తమ సినిమాలకు సంబంధించి.. వ్యక్తిగత విషయాలు కూడా తెలుపుతుంటారు. ఒక రకంగా అభిమానులకు ఎప్పటికప్పుడు దగ్గరగా ఉండటానికి ఉపయోగపడతాయి ఇవి. ఇప్పుడు అనుష్క కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేసింది.అధికారికంగా తన ట్విట్టర్ అకౌంట్‌ను ప్రకటిస్తూ.... మీరంతా క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరంతా ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని కోరుకొంటుననాను. ఇక నుంచి నా గురించి, నా సినిమా గురించి నా ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవ్వండి. రానున్న రోజుల్లో చాలా విషయాలు తెలుస్తాయి అని అనుష్క ట్వీట్ చేసింది.
స్టార్ హీరోయిన్ అనుష్క స్పెషల్ చిట్ చాట్
"అరుంధతి ", "రుద్రమదేవి ", "బాహుబలి ", "భాగమతి " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు మూవీస్ లోనే కాకుండా అనుష్క తమిళ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ అక్టోబర్ రెండవ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. "నిశ్శబ్ధం" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క , మీడియా తో చిట్ చాట్ నిర్వహించి "నిశ్శబ్ధం" మూవీ విశేషాలను వెల్లడించారు.
నేషనల్ - ఇంటెర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్న అనుష్క
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన నిశ్శబ్దం సినిమా ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ కు సిద్ధమైంది. ఇప్పటికే టీజర్స్,ట్రైలర్స్ తో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అక్టోబర్ 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈనేపథ్యంలో ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన మాధవన్ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
నిశ్శబ్ధం పై ప్రజలకు అనుష్క మెసేజ్
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిలిం కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్దం " అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా అక్టోబర్ 2వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన అనుష్క సైన్ లాంగ్వేజ్, పెయింటింగ్స్ లో శిక్షణ తీసుకున్నారు. పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకున్న "నిశ్శబ్దం " మూవీ లో మాధవన్ , అంజలి , షాలిని పాండే , మైఖేల్ మ్యాడ్సన్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
అనుష్క ఆరోగ్య సూత్రాలు
కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూ 15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. "అరుంధతి ", "బాహుబలి ", " రుద్రమదేవి ", "బాహుబలి 2", "భాగమతి " వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన థ్రిల్లర్ "నిశ్శబ్దం " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "నిశ్శబ్దం " మూవీ పలు భాషలలో రిలీజ్ కానుంది.

14 వసంతాల సినీకెరీర్
సూపర్ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయిన అనుష్క 14 సంవత్సరాల సినీకెరీర్ కంప్లీట్ చేసుకొని 15 వ సంవత్సరంలో అడుగు పెట్టారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సూపర్ మూవీ 2005 సంవత్సరం జులై 21 తేదీ రిలీజయింది. అనుష్క నటించిన విక్రమార్కుడు, లక్ష్యం, శౌర్యం మూవీస్ ఘనవిజయం సాధించాయి. అరుంధతి మూవీ గ్రాండ్ సక్సెస్ తో అనుష్క స్టార్ హీరోయిన్ గా మారారు. బిల్లా, వేదం, మిర్చి మూవీస్ సక్సెస్ చవిచూశాయి. బ్లాక్ బస్టర్ మూవీస్ బాహుబలి, బాహుబలి 2 తో తిరుగులేని కథానాయికగా ఎదిగారు. ఆ తరువాత అనుష్క నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీస్ రుద్రమదేవి, భాగమతి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. హిట్ తమిళ మూవీ రెండు తో కోలీవుడ్…
మరో వైవిధ్యభరిత పాత్రలో అనుష్క
నాయికా ప్రాధాన్యత ఉన్న చిత్రాలకు చిరునామాగా నిలుస్తూ... ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక అనుష్క. ‘భాగమతి’ తరువాత స్వల్ప విరామం తీసుకున్న ఈ టాలెంటెడ్ యాక్ట్రస్... ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే మల్టిలింగ్వల్ మూవీలో నటిస్తోంది. తెలుగులో ‘నిశ్శబ్దం’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కూడా విడుదల కానుంది. మాధవన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి... హేమంత్ మధుకర్ (‘వస్తాడు నారాజు’ ఫేమ్) దర్శకత్వం వహిస్తున్నాడు.