స్టార్ హీరోయిన్ అనుష్క స్పెషల్ చిట్ చాట్

Anushka Shetty Reveals Interesting Things About Nishabdham Movie In A Special Chit Chat With Media

“అరుంధతి “, “రుద్రమదేవి “, “బాహుబలి “, “భాగమతి ” వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తెలుగు మూవీస్ లోనే కాకుండా అనుష్క తమిళ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క పాత్రలో తెలుగు , తమిళ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “నిశ్శబ్ధం” మూవీ అక్టోబర్ రెండవ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. “నిశ్శబ్ధం” మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అనుష్క , మీడియా తో చిట్ చాట్ నిర్వహించి “నిశ్శబ్ధం” మూవీ విశేషాలను వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ అనుష్క మాట్లాడుతూ .. బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ తరువాత కావాలనే కొంత విరామం తీసుకున్నాననీ , దర్శకుడు హేమంత్ మధుకర్ స్క్రిప్ట్ వినిపించినప్పుడు థ్రిల్లింగ్ గా అనిపించి “నిశ్శబ్ధం” మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాననీ , ఈ మూవీ లో తనది మూగ , చెవుడు క్యారెక్టర్ కావడంతో తాను ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (సైగ భాష ) నేర్చుకున్నాననీ, US వెళ్లిన తరువాత డిఫరెంట్ సైన్ లాంగ్వేజెస్ ఉంటాయని తెలియడంతో అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాననీ , “నిశ్శబ్ధం” మూవీ OTT లో రిలీజ్ కావడం తనకు కొత్త ఎక్స్ పీరియన్స్ అనీ , తన కెరీర్ ప్రారంభంలో మాధవన్ తో నటించాననీ , చాలా కాలం తరువాత మాధవన్ తో నటించడం గొప్పగా అనిపించిందనీ , “నిశ్శబ్ధం” మూవీకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అనీ , గోపిసుందర్ అద్భుతంగా సంగీతం అందించారనీ , ప్రొడక్షన్ హౌస్ లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ సింప్లీ సూపర్బ్ అనీ , దర్శకుడు హేమంత్ మధుకర్ క్లియర్ విజన్ తో ఆర్టిస్ట్ ల నుండి బెస్ట్ అవుట్ ఫుట్ రాబట్టుకున్నారనీ, “నిశ్శబ్ధం” మూవీలో అన్ని క్యారెక్టర్స్ కూ ప్రాధాన్యత ఉందనీ , పూర్తిగా సియోటెల్ లోని రియల్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకున్న “నిశ్శబ్ధం” మూవీ ని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాననీ అనుష్క చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − 8 =