
ట్యాగ్ · 8 కథనాలు


స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్

అన్నాత్తే షూటింగ్ కు లేడీ సూపర్ స్టార్

హైదరాబాద్ లో "అన్నాత్తే "

"అన్నాత్తే "మూవీ సెట్స్ లో నయనతార

సూపర్ స్టార్ సినిమాలో జగ్గుభాయ్
సూపర్ స్టార్ లేకుండానే షూటింగ్..!
రజనీకాంత్ మూవీ లో విలన్ గా గోపీచంద్

"అన్నాత్తే "ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ రిలీజ్
దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో నటిస్తూ రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న హీరో రజనీకాంత్ కథానాయకుడిగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై శివ దర్శకత్వంలో తెరకెక్కిన "అన్నాత్తే " మూవీ నవంబర్ 4వ తేదీ దీపావళి పండగకు రిలీజ్ కానుంది. ఈ మూవీ లో నయనతార కధానాయిక కాగా కీర్తిసురేశ్ , మీనా, ఖుష్బూ సుందర్ కీలకపాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు.

స్ట్రిక్ట్ రూల్స్ తో రజినీ 'అన్నాత్తే' షూట్
మాస్ చిత్రాల దర్శకుడు శివ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 'అన్నాత్తే'. 'అన్నయ్య'గా తెలుగులోనూ డబ్బింగ్ వెర్షన్ రాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ ఉన్నప్పటికీ అన్నాత్తే చిత్ర బృందం స్పెషల్ పర్మిషన్స్ తీసుకొని మరీ చిత్రీకరణ జరుపుతున్నారు.

అన్నాత్తే షూటింగ్ కు లేడీ సూపర్ స్టార్
కరోనా సెకండ్ వేవ్ తో మళ్లీ సినిమా షూటింగ్ లకు బ్రేక్ పడుతుంది. ఈనేపథ్యంలో అన్నాత్తే సినిమాకు కూడా బ్రేక్ పడిందన్న వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం రాత్రిపూట కర్ప్యూ విధించడంతో షూటింగ్ కు బ్రేక్ పడిందన్నారు. అయితే వాటిలో ఎలాంటి నిజం లేదని.. అవి ఒట్టి పుకార్లే అని చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. తమ సినిమాను అనుకున్నట్లే దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఇక ఆవార్తలను నిజం చేస్తూ ఈసినిమాలో నటిస్తున్న లేడీ సూపర్ స్టార్ కూడా హైద్రబాద్ లో వాలిపోయింది. నేడు అన్నాత్తే…

హైదరాబాద్ లో "అన్నాత్తే "
ప్రపంచ వ్యాప్త అభిమానుల ఆరాధ్య దైవం సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో యాక్షన్ ఎంటర్ టైనర్ “అన్నాత్తే ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో రజనీకాంత్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్న ఈ మూవీ లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

"అన్నాత్తే "మూవీ సెట్స్ లో నయనతార
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ "అన్నాత్తే "తమిళ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార , జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేష్ కథానాయికలు కాగా సీనియర్ హీరోయిన్స్ మీనా , ఖుష్బూ , ప్రకాష్ రాజ్ , జగపతి బాబు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.

సూపర్ స్టార్ సినిమాలో జగ్గుభాయ్
శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా అన్నాత్తే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ చాలావరకు పూర్తయింది. అయితే ఇంకా కొంత భాగం షూటింగ్ మిగిలివుంది. ఇటీవలే మళ్లీ ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి కొద్దిరోజులు హైదరాబాద్ లో కూడా షూటింగ్ జరిపారు. అయితే అదే సమయంలో చిత్ర యూనిట్ లో కరోనా కలకలంతో షూటింగ్ కు బ్రేక్ వేశారు. ఆ తర్వాత రజినీకాంత్‌కి ఆరోగ్య సమస్య తలెత్తడంతో.. చెన్నై వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పటి వరకూ షూటింగ్ విషయంలో ఎలాంటి అప్ డేట్ లేదు.
సూపర్ స్టార్ లేకుండానే షూటింగ్..!
అజిత్‌తో వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మాస్ డైరెక్టర్ శివతో రజనీ ‘అన్నాత్తె’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల ఇన్ని షూట్ కు బ్రేక్ పడింది. అయితే తమిళ్ నాడు ప్రభుత్వం కూడా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిన్నగా అందరూ షూటింగ్ లను మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. రజినీ ‘అన్నాత్తె’ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు.
రజనీకాంత్ మూవీ లో విలన్ గా గోపీచంద్
సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ డ్రామా "అన్నాత్తే " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక. నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా సీనియర్ హీరోయిన్స్ మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో విలన్ పాత్రకు యాక్షన్ హీరో గోపీచంద్ ఎంపిక అయ్యారు. D ఇమ్మాన్ సంగీతం అందించారు.