రజనీకాంత్ మూవీ లో విలన్ గా గోపీచంద్

Gopichand Plays Villain In Superstar Rajinikanth Movie

సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యాక్షన్ డ్రామా “అన్నాత్తే ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయిక. నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ ఒక కీలక పాత్రలో నటిస్తుండగా సీనియర్ హీరోయిన్స్ మీనా, ఖుష్బూ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీ లో విలన్ పాత్రకు యాక్షన్ హీరో గోపీచంద్ ఎంపిక అయ్యారు. D ఇమ్మాన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2003 సంవత్సరం లో సూపర్ హిట్ మూవీ “జయం ” తమిళ రీమేక్ మూవీ లో విలన్ గా నటించిన గోపీచంద్ తిరిగి 16 సంవత్సరాల తరువాత తమిళ మూవీ లో నటించడం విశేషం. హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. తేజ దర్శకత్వంలో రూపొందనున్న “అలిమేలు మంగ – వెంకటరమణ ” మూవీ కి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దర్శకుడు శివ, గోపీచంద్ కాంబినేషన్ లో రూపొందిన “శౌర్యం ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × four =