
ట్యాగ్ · 11 కథనాలు


"లైగర్" మూవీ కై అనన్య పాండే డబ్బింగ్ ప్రారంభం

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

లైగర్ లో లెజెండరీ బాక్సర్ 'మైక్ టైసన్'

"ఫైటర్ "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం
విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు
లాక్ డౌన్ టైమ్ లో అనన్య పాండే

విజయ్ ను చాలా మిస్ అవుతున్నా..!
విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్
"ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ లో అనన్య పాండే

'లైగర్' విజయ్ పై అనన్య ప్రశంసలు..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, అలానే హంట్ థీమ్ అంటూ రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

"లైగర్" మూవీ కై అనన్య పాండే డబ్బింగ్ ప్రారంభం
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.

టాలీవుడ్ పై అనన్య పాండే ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా మార్కెట్ రేంజ్ పెరిగిపోయింది అని చెప్పొచ్చు. మన వాళ్లు భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి అస్సలు వెనుకాడటంలేదు. స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ నుండి సినిమా వస్తుందంటే చాలు పాన్ ఇండియా సినిమానే అవుతుంది. సినిమా హిట్ అయినా ఫట్ అయినా నిర్మాతలు కూడా ఏ మాత్రం రాజీ పడకుండా ధైర్యంగా సినిమాలు తీస్తున్నారు. ఒకప్పుడు తెలుగు సినిమాలను నార్త్ లో ఇప్పుడు ఆదరించినంత ఉండేది కాదు.. కానీ బాహుబలి తో తెలుగు సినిమా మార్కెట్ పూర్తిగా మారిపోయింది. ఆ తరువాత సాహో సినిమా.. ఇక గత రెండు మూడేళ్లలో ఎన్నో సినిమాలు.. ఇక రీసెంట్ గా వచ్చిన పుష్ప సినిమా తెలుగు సినిమా సత్తాను నార్త్ బాక్సాఫీస్ వద్ద…

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. మరి పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరో ను ఎలా ఎలివేట్ చేస్తాడో మనకు తెలిసిందే. అందుకే పూరీతో సినిమా తీయాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. ఆ మధ్య కాస్త రొటీన్ కథలతో కాస్త వెనక్కి తగ్గాడు కానీ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు. పూరీ లాంటి డైరెక్టర్ విజయ్ లాంటి హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాపై కూడా అంతే ఆసక్తి ఉంది అందరికీ. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం…

లైగర్ లో లెజెండరీ బాక్సర్ 'మైక్ టైసన్'
ది గ్రేట్ బాక్సర్ మైక్ టైసన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కాస్త కండలు కలిగిన దేహం ఉన్న వాళ్లని చూస్తే వెంటనే మైక్ టైనస్ తో పోల్చేస్తాం. ఆ రకంగా మైక్ టైసన్ అందరికీ తెలిసిన పేరే. మరి అలాంటి మైక్ టైసన్ మన తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. అయితే గత ఏడాది కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూటింగ్ కు సిద్దపడుతున్నారు.

"ఫైటర్ "మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం
పూరి కనెక్ట్స్ ,ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ , బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే జంటగా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ పాన్ ఇండియా మూవీ "ఫైటర్ " మూవీ తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కుతుంది. "ఫైటర్ "మూవీ ముంబై షెడ్యూల్ తో 40 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మరో ముంబై షెడ్యూల్ ప్లాన్ చేయగా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయింది. ఫారిన్ ఫైటర్స్ తో యాక్షన్ సీన్స్ తెరకెక్కించాలనుకొన్న దర్శకుడు ప్లాన్ కరోనా కారణంగా సాధ్యపడలేదు.
విజయ్ దేవరకొండ పై అనన్య పాండే ప్రశంసలు
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "పెళ్ళిచూపులు " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన విజయ్ పై ప్రేక్షక , అభిమానులలో క్రేజ్ పెరిగింది. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ తో విజయ్ స్టార్ హీరోగా మారారు. విజయ్ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో బాలీవుడ్ సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ అనన్య పాండే కథానాయిక .
లాక్ డౌన్ టైమ్ లో అనన్య పాండే
సూపర్ హిట్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 "మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన అనన్య పాండే నటించిన "పతి పత్ని ఔర్ వో " మూవీ ఘనవిజయం సాధించింది. అనన్య ప్రస్తుతం "ఖాలీ పీలీ " మూవీ లో నటిస్తున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "ఫైటర్ "(వర్కింగ్ టైటిల్ ) మూవీ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనన్య టాలీవుడ్ కు ఎంటర్ అవుతున్నారు.

విజయ్ ను చాలా మిస్ అవుతున్నా..!
హీరో విజయ్ దేవరకొండను చాలా మిస్ అవుతున్నట్టు చెబుతుంది ఓ యంగ్ హీరోయిన్. ఆ హీరోయిన్ ఎవరో కాదు అనన్య పాండే. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా ఈ సినిమా ముంబై లో షూటింగ్ జరుపుకుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. అయితే కరోనా వల్ల ఈ షూటింగ్ కు బ్రేక్ పడటంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరిపోయారు. ఇక గత 20 రోజులకు పైగా ఇంట్లోనే ఉండటంతో ఈ అమ్మడు విజయ్ ను చాలా మిస్ అవుతున్నట్టు చెబుతుంది. మొత్తానికి మన టాలీవుడ్ హీరో బాలీవుడ్ హీరోయిన్ ను…
విజయ్ దేవరకొండ చాలా స్మార్ట్
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ భాషలలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ముంబై లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా విదితమే. ఇక ఇటీవలే ఆమె కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో అప్పుడే అమ్మడు మన యంగ్ హీరోపై ప్రశంసలు కురిపించేస్తుంది.
"ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) షూటింగ్ లో అనన్య పాండే
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "ఫైటర్"(వర్కింగ్ టైటిల్ ) మూవీ తెలుగు, హిందీ భాషలలో రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ బాక్సర్ గా నటిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ లో సూపర్ హిట్ మూవీస్ "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2", "పతి పత్ని ఔర్ వో " ఫేమ్ అనన్య పాండే హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.