
ట్యాగ్ · 9 కథనాలు


రాయన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇండస్ట్రీ పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్
అమలా పాల్ స్టైలిష్ లుక్

'VIP2' ధనుష్ కామెడీ సీన్
అమలా పాల్ భావోద్వేగం..నేను మొత్తం కోల్పోయాను
బాయ్ ఫ్రెండ్ తో మళ్లీ పెళ్లి..!

నాయక్ రీ రిలీజ్ కానుంది
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ,డైరెక్టర్ వి వి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం నాయక్.2013 లో విడుదలైన ఈసినిమా కమర్షియల్ గా సూపర్ హిట్ అనిపించుకుంది.ఇందులో చరణ్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా కాజల్ ,అమలా పాల్ హీరోయిన్లుగా నటించారు. చరణ్ నటన, డ్యాన్స్ కు తోడు , బ్రహ్మానందం , పోసాని కృష్ణ మురళి ల కామెడీ ,సాంగ్స్ సినిమాలో హైలైట్ అయ్యాయి.

రాయన్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
ధనుష్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈఏడాది ఇప్పటికే కెప్టెన్ మిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ ను అందుకున్నాడు ధనుష్. ప్రస్తుతం తన లిస్ట్ లో పలు సినిమాలు ఉండగా అందులో రాయన్ సినిమా కూడా ఒకటి. ఈసినిమాకు ధనుషే స్వయంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు. పోస్టర్లు అన్నీ ఆకట్టుకున్నాయి.

బ్లాక్ బస్టర్ ఖైదీ హిందీ రీమేక్ భోలా మూవీ లో ప్రత్యేక పాత్రలో అమలా పాల్
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ , బి వివేకానంద పిక్చర్స్ బ్యానర్స్ పై లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి హీరోగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ ఖైదీ తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ 2019 అక్టోబర్ 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో కార్తి అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన ఈ మూవీ లో హీరోయిన్ కానీ , సాంగ్స్ కానీ లేకపోవడం విశేషం. ఇప్పుడు ఈ మూవీ హిందీ భాషలో రీమేక్ అవుతుంది.

ఇండస్ట్రీ పై అమలా పాల్ షాకింగ్ కామెంట్స్
ఇండస్ట్రీపై కామెంట్స్ చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటూనే ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే నెపోటిజంపై ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అమలా పాల్. తమిళ్ లో తన సినీ కెరీర్ ను ప్రారంభించిన అమలా పాల్ తన అందం, అభినయంతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. తక్కువ సమయంలోనే తమిళం, తెలుగు, మలయాళ పరిశ్రమల్లో సినిమాలు చేసి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు పెద్దగా సినిమాలు కూడా చేయట్లేదు అమలాపాల్. మరోవైపు ఈ మధ్య వక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది.

నిర్మాతగా మారిన అమలా.. సూపర్ గా ఫస్ట్ లుక్ పోస్టర్..!
ప్రస్తుతం ఉన్న సినీ పరిశ్రమల్లో చాలా మార్పులు వచ్చాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కొత్తగా ప్రయత్నిస్తున్నారు. హీరోలు నిర్మాతలుగా మారుతున్నారు. కొంతమంది డైరెక్టర్లు హీరోలుగా మారి సినిమాలు తీస్తున్నారు.. అలాగే కొంత మంది నిర్మాతలుగా మారుతున్నారు. మరి హీరోయిన్లు మాత్రం సైలెంట్ గా ఉంటారా. వాళ్లు కూడా ఫామ్ లో ఉన్నప్పుడే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు నిర్మాతలుగా కూడా మారుతున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ నుంచి అప్‌కమింగ్ హీరోయిన్ అవికా గోర్ వరకూ నిర్మాతలుగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇక తాజాగా మరో హీరోయిన్ హీరో కూడా ఈ లిస్ట్ లో చేరింది ఆహీరోయిన్ ఎవరో…
అమలా పాల్ స్టైలిష్ లుక్
సక్సెస్ ఫుల్ "నీల తామర "మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన అమలా పాల్ "వీరశేఖరన్ "మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. "బెజవాడ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అమలాపాల్ "లవ్ ఫెయిల్యూర్ ", "నాయక్ ", "ఇద్దరమ్మాయిలతో "వంటి సూపర్ హిట్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరించారు. "జండా పై కపిరాజు "(2015 ) తరువాత అమలాపాల్ తమిళ , మలయాళ చిత్రాలతో బిజీగా మారారు.

'VIP2' ధనుష్ కామెడీ సీన్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ చేసిన రఘువరన్ బీటెక్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆ తర్వాత ఇదే సినిమాకు సీక్వెల్‌గా వీఐపీ సినిమాను తీశారు. సినిమాకు ధనుష్ స్వయంగా కథ, మాటలు సమకూర్చాడు. ఇక ఈ సినిమాలో కూడా అమలా పాల్ హీరోయిన్ గా నటించగా.. బాలీవుడ్ హీరోయిన్ కాజల్ విలన్ పాత్రలో నటించింది. ఈమె విలనిజం సినిమాకు ఒక హైలైట్ అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ధనుష్-అమలాపాల్‌ల జోడీ, ఆ ఇద్దరి మధ్య రొమాన్స్, సరదా ఫైటింగ్ సాగే సన్నివేశాలు ఈ సినిమాకు మరో హైలైట్. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి ధనుష్ కామెడీ సీన్ మీకోసం.
అమలా పాల్ భావోద్వేగం..నేను మొత్తం కోల్పోయాను
తన అందం, అభినయంతో హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న అమలా పాల్ ఈ మధ్య వక్తిగత జీవితం వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది. మొదటి పెళ్లితో మొదలైన ఈ రచ్చ ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక ఇటీవలే రెండో పెళ్లితో మరోసారి వార్తల్లో నిలిచింది. రెండో పెళ్లి, తాను చేసిన ఫొటోలపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. మళ్లీ ఆ ఫోటోలన్నీ డిలీట్ చేయడం, తాను అసలు పెళ్లే చేసుకోలేదని చెప్పడం ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఆమె చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది. అయితే ఈసారి ఏ కాంట్రవర్సీకి సంబంధించిన పోస్ట్ కాదులెండి.
బాయ్ ఫ్రెండ్ తో మళ్లీ పెళ్లి..!
అమలా పాల్, ముంబై సింగర్ భవ్నీందర్ సింగ్ గతకొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్నట్టు ఇప్పటికే పలు వార్తల్లో చూశాం. ఇక ఈ వార్తలు కూడా నిజమే అని ఒప్పేసుకుంది కేరళ బ్యూటీ అమలా పాల్. గతంలోనూ భవ్నీందర్ ఆడై సినిమా ప్రమోషన్ల సమయంలో.. నా ప్రేయసిని చూసి గర్వపడుతున్నాను. మున్ముందు కూడా ఇలాగే నీ సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. కొన్నిసార్లు వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫొటోలను సైతం పంచుకున్నాడు. దీనితో అప్పుడే ఫిక్స్ అయిపోయారు అమలా పాల్ బాయ్ ఫ్రెండ్ ఇతనే అని. ఇక అమలా పాల్ కూడా ఒప్పుకోవడంతో అందరికీ క్లారిటీ వచ్చేసింది.