
ట్యాగ్ · 12 కథనాలు


హిలేరియస్ గా ఉగ్రం ప్రమోషన్స్ వీడియోలు

ఉగ్రం ట్రైలర్ రిలీజ్

ఉగ్రం ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఉగ్రం

ఉగ్రం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

ఉగ్రం టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

ఉగ్రం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

నరేష్ ఉగ్రం ఫస్ట్ లుక్ రిలీజ్

ఓటీటీలో ఉగ్రం మూవీకి సూపర్ రెస్పాన్స్
నాంది సినిమా నుండి తన స్టోరీ సెలక్షన్ లో రూట్ మార్చాడు అల్లరి నరేష్. ప్రస్తుతం కాస్త సీరియస్, యాక్షన్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా ఉగ్రం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కింది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో నాంది రాగా ఆసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కడంతో మరోసారి ఉగ్రం తీశారు. ఈసినిమా కూడా రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. మొదటిసారి అల్లరి నరేష్ అంత సీరియ్ రోల్ లో ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లలో నటించి మెప్పించాడు.

ఉగ్రం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సినిమా ఉగ్రం. నాంది తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇది. మిస్సింగ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుస మిస్సింగ్ కేసులు నమోదు కావడం, వాటిని అల్లరి నరేశ్ పోలీసాఫీసర్‌గా ఎలా చేధించాడనే నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమాలో అల్లరి నరేష్ డ్యూయల్ షేడ్స్‌లో ప్రేక్షకులు ఇదివరకెన్నడూ చూడని లుక్‌లో కనిపించి.. మంచి టాక్ నే సొంతం చేసుకున్నాడు. నటనపరంగా మరోసారి సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు నరేష్. ఈ సినిమాలో ఫైట్స్ అయితే అదిరిపోయాయి. కలెక్షన్స్ పరంగా కూడా డీసెంట్ కలెక్షన్స్ ను…

హిలేరియస్ గా ఉగ్రం ప్రమోషన్స్ వీడియోలు
అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ ఉగ్రం మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన నాంది సూపర్ హిట్ అనిపించుకుంది దాంతో ఉగ్రంకు హైప్ వచ్చింది.దానికి తోడు ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ప్రస్తుతం టీం అంతా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ గా వున్నారు. అందులో భాగంగా నిన్న గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది.అయితే ఈ సారి ప్రమోషన్స్ విషయంలో ఉగ్రం టీం డిఫ్రెంట్ గా ఆలోచించింది.

ఉగ్రం లో హై ఇంటెన్స్ రోల్ లో చూస్తారు-అల్లరి నరేష్
‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ‘ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. హీరోలు అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి శివ నిర్వాణ, విఐ ఆనంద్, వశిష్ట ఈ వేడుకకు హాజరయ్యారు.

ఉగ్రం పవర్ ఫుల్ టైటిల్ సాంగ్ రిలీజ్
అల్లరి నరేష్, విజయ్ కనకమేడల కాంబినేషన్ లో వచ్చిన నాంది సినిమా మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈసినిమాకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు వీరిద్దరూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నారు. ఉగ్రం అనే మరో యూనిక్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్ వస్తున్నారు. ఈసినిమా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ ల ను రిలీజ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి వీరిద్దరూ హిట్ కొట్టే ఛాన్స్ ఉందన్న అభిప్రాయాలు వచ్చాయి.

ఉగ్రం ట్రైలర్ రిలీజ్
కెరీర్ ప్రారంభం నుండి తన కామెడీ సినిమాలతో ప్రేక్షకులను కితకితలు పెట్టించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చాడు. ఇక చాలా కాలం గ్యాప్ తీసుకొని నాంది సినిమాతో మంచి కమ్ బ్యాక్ ను అందుకున్నాడు. ప్రస్తుతం విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఉగ్రం అనే సినిమాతో వస్తున్నాడు. నాంది సినిమా తరువాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. ఆ సినిమా సక్సెస్‌తో మరోసారి వీరిద్దరూ ఇప్పుడు ఉగ్రం సినిమా కోసం చేతులు కలిపారు. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ ను బట్టి అర్థమైంది. ఇకఈ సినిమా మే 5న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో వరుస అప్డేట్లు ప్రకటిస్తూ సినిమాపై ఆసక్తిని…

ఉగ్రం ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఉగ్రం. నాంది సినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా మే5 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం పోస్ట ప్రొడక్షన్ పనులను ముగించుకుంటూనే మరోపక్క చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. వరుస అప్ డేట్లు ఇస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పుడు తాజాగా ట్రైలర్ కు సంబంధించిన అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఓ ఫన్నీ వీడియో రిలీజ్ చేశారు. ఈవీడియోలో అల్లరి నరేష్ కెరీర్ లో…

షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఉగ్రం
అల్లరి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకొని ఇండస్ట్రీలో తనకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు అల్లరి నరేష్. ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ లో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఉగ్రం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇది వరకే నరేష్, విజయ్ కాంబినేషన్ లో నాంది అనే వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను కూడా అందుకుంది.

ఉగ్రం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్
విజయ్ కనకమేడల దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఉగ్రం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో నాంది వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మంచి ఆదరణను దక్కించుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఉగ్రంతో వస్తున్నారు. ఈసినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దానికితోడు ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడమే కాకుండా సినిమాపై అంచనాలను మరించ పెంచేశాయి. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

ఉగ్రం టీజర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
కెరీర్ మొదటినుండి తన కామెడీతో నవ్వించిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ ను మార్చి కాస్త విభిన్నమైన పాత్రలతో ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. దీంతో ఈసినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా టీజర్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు…

ఉగ్రం సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
నాంది సినిమా తరువాత అల్లరి నరేష్ తన రూట్ ను మార్చారు. ఇప్పుడు విభిన్నమైన కథలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం అల్లరి నరేష్ హీరోగా విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఉగ్రం’. ‘నాంది’ వంటి సూపర్ హిట్ తర్వాత ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రమిది. ఇందులో అల్లరి నరేష్ ఫెరోషియస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.

నరేష్ ఉగ్రం ఫస్ట్ లుక్ రిలీజ్
కామెడీ ఎంటర్ టైనర్ సినిమాలతోనే ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిన అల్లరి నరేష్ ఇప్పుడు తన రూట్ మార్చేశాడు. ప్రస్తుతం ప్రేక్షకులు కూడా ప్రయోగాత్మక సినిమాలనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఆ దిశగానే అడుగులు వేస్తున్నాడు. ఆ క్రమంలోనే నాంది లాంటి సినిమాతో తన రీఎంట్రీకి నాంది పలికాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో అల్లరి నరేష్ నటనకు ప్రశంసలు సైతం దక్కాయి. ప్రస్తుతం అయితే రాజ్‌మోహన్ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా వస్తున్న సినిమా ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈసినిమా కూడా డిఫరెంట్ కథతో తెరకెక్కుతుంది.