కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Actress Kajal Aggarwal

ట్యాగ్ · 88 కథనాలు · పేజీ 5

సినిమా వార్తలు

హీరో సూర్య కు జోడీగా కాజల్ అగర్వాల్ ?

"గురు " మూవీ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో స్టార్ హీరో సూర్య కథానాయకుడు గా రూపొందిన "సూరరై పోట్రు "(ఆకాశం నీ హద్దురా )తమిళ మూవీ అక్టోబర్ 30 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ OTT అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హీరో సూర్య తన నెక్స్ట్ పిక్చర్ కు సన్నద్ధం అవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ "మాత్త్రాన్ "(బ్రదర్స్ ) మూవీ లో సూర్య , కాజల్ అగర్వాల్ జంటగా నటించారు. సూర్య ఇప్పుడు తన అప్ కమింగ్ మూవీ లో కాజల్ ను హీరోయిన్ గా ఎంపిక చేయాలనుకొంటున్నారు .

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అందాల "చందమామ "

"లక్ష్మీ కళ్యాణం " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ సూపర్ హిట్ "చందమామ " మూవీ తో గుర్తింపు పొందారు. తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో కాజల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కాజల్ ప్రస్తతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2 ", "హే సినమిక "(తమిళ ), "ముంబై సాగ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గిరిజన యువతి పాత్రలో కాజల్ అగర్వాల్?

ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు ,తమిళ , హిందీ భాషలలో రూపొందిన "అరణ్య " మూవీ ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ప్రముఖ పర్యావరణ వేత్త , గిరిజన రైతు జయదేవ్ పాయంగ్ జీవిత చరిత్ర ఆధారంగా "అరణ్య " మూవీ రూపొందింది. అస్సాం రాష్ట్రం లోని నిరుపయోగ భూమిని 40సంవత్సరాలుగా మొక్కలు నాటి అడవిగా జయదేవ్ మార్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ - బ్రదర్ అండ్ సిస్టర్ గా కాజల్- విష్ణు..!

హాలీవుడ్ డైరెక్టర్ జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వంలో మంచు విష్ణు కాజల్‌ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘మోసగాళ్లు’. అతిపెద్ద ఐటీ కుంభకోణాల్లో ఒకటిగా నిలిచిన స్కామ్‌ వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దాదాపు ఈ సినిమా చిత్రీకరణ 70 శాతం పూర్తయింది. ప్రస్తుతం కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే విష్ణు, కాజల్‌ ఫస్ట్‌, సునీల్‌ శెట్టి ఫస్ట్‌ లుక్ పోస్టర్ లు రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇటీవలే రిలీజ్ చేసిన కాజల్-విష్ణు అర్ధనారీశ్వరం రూపంలో ఉన్న పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Silver Screen Wonder Magadheera Completes 11 Years.
సినిమా వార్తలు

11 వసంతాల "మగధీర "

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్, రొమాంటిక్ డ్రామా "మగధీర " మూవీ 2009 సంవత్సరం జులై 1 వ తేదీ రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా శ్రీహరి , దేవ్ గిల్ ముఖ్య పాత్రలలో నటించారు. కీరవాణి స్వరకల్పన లో రూపొందిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా "పంచదార బొమ్మ "సాంగ్ హైలైట్ గా నిలిచింది. "మగధీర " మూవీ 2 నేషనల్ , 6 ఫిల్మ్ ఫేర్ , 9 నంది , 10 సినీమా అవార్డ్స్ అందుకుంది.

Team TFNవాట్సాప్
Actress Kajal Aggarwal, Kajal Aggarwal, Kajal Aggarwal And Allari Naresh In the Telugu Remake Of Korean Film Dancing Queen?, Kajal Aggarwal Korean Movie, Kajal Aggarwal Latest News 2020, Kajal Aggarwal To Act In Korean Movie Remake, Kajal Aggarwal To
సినిమా వార్తలు

"డ్యాన్సింగ్ క్వీన్" గా కాజల్ అగర్వాల్

టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ మూవీస్ హవా నడుస్తుంది. ఇతర భాషలలో సక్సెస్ అయిన మూవీస్ ను తెలుగు లో రీమేక్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం "మోసగాళ్ళు ", "ఇండియన్ 2", "ముంబై సాగా " మూవీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు ఒక కొరియన్ మూవీ తెలుగు రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
Actress Kajal Aggarwal,Kajal Aggarwal To Act In Korean Movie Remake,Latest Telugu Movies News,Telugu Film Updates 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Korean Movie Remake,Kajal Aggarwal,Kajal Aggarwal Latest News 2020,Kajal Aggarwal Upcomi
సినిమా వార్తలు

`డాన్సింగ్ క్వీన్` రీమేక్ లో కాజ‌ల్ అగ‌ర్వాల్?

తెలుగునాట ఇప్పుడు కొరియ‌న్ మూవీస్ రీమేక్ ట్రెండ్ న‌డుస్తోంది. రీసెంట్ గా రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన `ఓ బేబి`తో ఈ ట్రెండ్ మ‌రింత ఊపు అందుకుంది. కొరియ‌న్ ఫిల్మ్ `మిస్ గ్రానీ`(2014) ఆధారంగా రూపొందిన ఈ సోషియో ఫాంట‌సీ మూవీ.. న‌టిగా స‌మంత‌కి ఎన‌లేని గుర్తింపు తెచ్చింది. క‌ట్ చేస్తే.. ఇప్పుడు సామ్ బాట‌లోనే ప‌య‌నించేందుకు మ‌రో అగ్ర క‌థానాయిక సిద్ధ‌మైంది. ఆమె మ‌రెవ‌రో కాదు.. టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఇండియన్ 2 - ఫైనల్లీ నా షూట్ స్టార్ట్..!

శంకర్ దర్శకత్వంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన 'భారతీయుడు' సినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ 'భారతీయుడు2' ను తెరకెక్కిస్తున్న సంగతి కూడా తెలిసిందే. భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్