
ట్యాగ్ · 9 కథనాలు


'ఏజెంట్' తో 'త్రివిక్రమ్' సినిమా
టాలీవుడ్ లో బిజీ
'జేజమ్మ'తో 'జాతిరత్నం'
'జాతిరత్నాలు'ను రిలీజ్ చేయనున్న 'బాహుబలి'
ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు

'జాతి రత్నాలు' కి ఒక ఏడాది.. థ్యాంక్స్ చెబుతున్ననవీన్..!
అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా జాతి రత్నాలు. కామెడీ అండ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో చూశాం. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దీంతో చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నిజానికి ఈసినిమా రిలీజ్ సమయంలో కరోనా ప్రభావం కూడా కాస్త ఎక్కువగానే ఉంది. థియేటర్లు కూడా అప్పుడప్పుడే తెరిచిన సందర్భాలు.. ప్రేక్షకులు కూడా బయటకు రావడానికి భయపడుతున్న రోజులు అయినా కూడా మేకర్స్ ధైర్యంగా ఈసినిమాను రిలీజ్ చేశారు. వారి…

'రాధేశ్యామ్'.. బంపరాఫర్ కొట్టేసిన నవీన్ పోలిశెట్టి
ప్రభాస్ అభిమానులు మాత్రమే కాకుండా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాధేశ్యామ్ సినిమా కూడా ఒకటి. ఇక ప్రభాస్ సినిమా కాబట్టి చెప్పేదేముంది.. సినిమా ప్రారంభించిన దగ్గరనుండే సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతుంది కాబట్టి ఇప్పటినుండే ప్రమోషన్స్ వేగవంతం చేశారు. దానిలో భాగంగానే పోస్టర్లు, పలు పాటలు రిలీజ్ చేస్తూ మంచి బజ్ క్రియట్ చేస్తున్నారు.

'ఏజెంట్' తో 'త్రివిక్రమ్' సినిమా
ఈ మధ్య హీరోలు, డైరెక్టర్స్ కూడా నిర్మాతలుగా మారిపోతున్న సంగతి తెలిసిందే కదా. కొంతమంది హీరోలైతే వాళ్ళ సినిమాలను వాళ్లే నిర్మించుకుంటున్నారు. అలాగే డైరెక్టర్స్ కూడా యంగ్ హీరోలతో సినిమాలను నిర్మిస్తున్నారు, సుకుమార్ అయితే ఒక పక్క స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూనే మరోపక్క చిన్న హీరోలతో నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నాడు. కొరటాల తన బ్యానర్ స్టార్ట్ చేసారు. మారుతి కి బ్యానర్ వుంది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తన సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి సినిమాలు చేయడానికి సిద్దమైపోయాడు. ఇంతకు ముందు త్రివిక్రమ్ నిర్మాత రాధాకృష్ణ తో కలిసి పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు తన సొంత…

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ పై నవీన్ పోలిశెట్టి ఫన్నీ మెసేజ్
స్వరూప్ ఆర్ఎస్ జె దర్శకత్వంలో తెరకెక్కిన ''ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ'' మూవీతో నవీన్ పోలిశెట్టి హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ''ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ''చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ సక్సెస్ అందుకుంది. హీరో నవీన్ తనదైన శైలి యాక్టింగ్ తో అన్ని వర్గాల ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ లో నవీన్ నటనకు గానూ 'దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' తెలుగు కేటగిరీలో బెస్ట్ యాక్టర్ అవార్డ్ కు ఎంపికయ్యారు.

అనుష్క , నవీన్ మూవీ టైటిల్ "మిస్ శెట్టి .. మిస్టర్ పోలిశెట్టి "?
“సూపర్ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అనుష్క తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ లో కథానాయికగా నటిస్తూనే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో ఝాన్సీ లక్ష్మీబాయ్ గా అతిథి పాత్రలో , “నిశ్శబ్ధం ” మూవీ లో మ్యూట్ ఆర్టిస్ట్ గా అనుష్క తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
టాలీవుడ్ లో బిజీ
స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్సాయి "ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో నవీన్ టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ లో నవీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మూవీ తరువాత సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న కామెడీ ఎంటర్ టైనర్ "జాతిరత్నాలు "మూవీ తో నవీన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
'జేజమ్మ'తో 'జాతిరత్నం'
అతి తక్కువ కాలంలోనే నవీన్ పోలిశెట్టి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి కారణం అతను సెలక్ట్ చేసుకుంటున్న పాత్రలే కారణం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా కానీ.. బాలీవుడు చిచోరే సినిమా కానీ ఇప్పుడు వస్తున్న జాతి రత్నాలు సినిమా కానీ తన పాత్రల ఎంపిక ఎలా ఉంటుందో చెపుతున్నాయి.
'జాతిరత్నాలు'ను రిలీజ్ చేయనున్న 'బాహుబలి'
శ్రీనివాస ఆత్రేయతో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు నవీన్ పొలిశెట్టి.. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో కమర్షియల్ గా హిట్ కొట్టడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకున్నాడు. ఇక ఇప్పుడు అనుదీప్ కెవిదర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా జాతిరత్నాలు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే టైటిల్, పోస్టర్స్, టీజర్ లతో ఆకట్టుకున్న జాతిరత్నాలు.. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది.
ఏజెంట్ క్లారిటీ .. 'కొరటాల శివ' తో చెయ్యట్లేదు
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో హీరోగా గుర్తింపు తెచుకున్నాడు. బాలీవుడ్ సినిమా చిచోరేలో కనిపించాడు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా కనిపించిన ఈ సినిమాలో నవీన్, తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తెలుగులో నవీన్ పోలిశెట్టి తన రెండవ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి బ్లాక్ బస్టర్ మహానటి మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాతగా స్వప్న సినిమాస్ బ్యానర్ పై అనుదీప్ దర్శకత్వం లో జాతి రత్నాలు అనే కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కూడా ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.