
ట్యాగ్ · 1558 కథనాలు · పేజీ 40


సాహో మూవీ రిలీజ్ డేట్ అధికారిక ప్రకటన

బన్నీ సినిమాలో నివేదా, కేతిక?

సీజన్‌కో స్టార్ హీరోతో రానున్న నయనతార

నైజాం టాప్ 4లో నిలచిన `మహర్షి`

కిల్లర్ మూవీ ట్రైలర్ రిలీజ్

మీడియా సమావేశంలో కాజల్ అగర్వాల్

ఈ వారం ఫిలింనగర్ విశేషాల సమాహారం

రామ్‌తో మరోసారి..?

2020లో మహేష్ డబుల్ ధమాకా?

ఉప్పెన మూవీ లో హీరోయిన్ గా తమిళ నటి

సత్య సాయి ఆర్ట్స్ ద్వారా NGK తెలుగు మూవీ

‘మన్మథుడు 2’లో సమంత పాత్ర అదేనా?

దేవిశ్రీ స్థానంలో మిక్కీ జే మేయర్?

మెగా స్టార్ చిరంజీవి సంతాప సందేశం

రెండు వారాలు... ఐదు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్

నైట్ ఎఫెక్ట్ లో ఖైదీ తమిళ మూవీ

ఒకే రోజున రానున్న నయన్, తాప్సీ
నయనతార… హీరోయిన్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న ఈ జనరేషన్ స్టార్ హీరోయిన్. వైవిధ్యభరితమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నయన్… ఇప్పటికే ‘మాయ’, ‘డోరా’, ‘అరమ్’, ‘కొలమావు కోకిల’, ‘ఐరా’ వంటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాల్లో నటించి తమిళనాట తన సత్తా చాటింది. ఈ చిత్రాలన్నీ కూడా తెలుగులోనూ డబ్బింగ్ అయ్యాయి. కాగా… త్వరలో మరో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిలిమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది నయన్. ఆ చిత్రమే ‘కొలైయుదిర్ కాలమ్’. ‘ఈనాడు’ ఫేమ్ చక్రి తోలేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హారర్ మూవీ… తమిళ, తెలుగు భాషల్లో జూన్ 14న విడుదల కానుంది.

సాహో మూవీ రిలీజ్ డేట్ అధికారిక ప్రకటన
UV క్రియేషన్స్, T -సిరీస్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సాహో మూవీ రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కథానాయిక కాగా, పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

బన్నీ సినిమాలో నివేదా, కేతిక?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘నాన్న నేను’, ‘అలకనంద’ వంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కాగా… ఇందులో బన్నీకి జంటగా స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే ఓ హీరోయిన్‌గా నటిస్తోంది.

సీజన్‌కో స్టార్ హీరోతో రానున్న నయనతార
నయనతార… గ్లామర్ రోల్స్‌తో పాటు యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలతోనూ దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తున్న కథానాయిక. ఓ వైపు ఫీమేల్ సెంట్రిక్ మూవీస్‌లో నటిస్తూనే… మరోవైపు స్టార్ హీరోలతోనూ జట్టు కడుతోంది ఈ కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్. ప్రస్తుతం ఆమె తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాదు… స్టార్ హీరోల సరసన ఆమె నటిస్తున్న ఈ చిత్రాలన్నీ… మూడు వేర్వేరు పండుగల సమయంలో విడుదల కానుండడం విశేషం.

నైజాం టాప్ 4లో నిలచిన `మహర్షి`
సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ ఫిల్మ్ ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. మే 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా… గడచిన 12 రోజుల్లో పలు చోట్ల రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ఇక నైజాం ఏరియా విషయానికొస్తే.. ఇప్పటికే లాభాల బాట పట్టిన ‘మహర్షి’… అక్కడ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాలుగో చిత్రంగా చరిత్ర సృష్టించింది. నైజాంలో రూ.25 కోట్ల షేర్ రాబట్టి… ఆ క్లబ్‌లో చేరిన నాలుగో చిత్రంగా నిలచింది మహర్షి. మిక్స్‌డ్ టాక్‌తో ఈ స్థాయి వసూళ్ళు రావడం అంటే… మహేష్ బాబు స్టార్‌డమ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. కాగా… నైజాంలో మొదటి మూడు స్థానాలు బాహుబలి సిరీస్…

కిల్లర్ మూవీ ట్రైలర్ రిలీజ్
దియా మూవీస్ బ్యానర్ పై ఆండ్రూ లూయిస్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ, అర్జున్ ప్రధాన పాత్రలలో కిల్లర్ మూవీ రూపొందింది. తమిళ మూవీ కొలైకారన్ కు తెలుగు డబ్బింగ్ వెర్షన్ కిల్లర్. మర్డర్ మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కిల్లర్ మూవీ జూన్ 5వ తేదీ రిలీజ్ కానుంది. ఆషిమా కథానాయిక కాగా, సైమన్ K కింగ్ సంగీతం అందించారు.

మీడియా సమావేశంలో కాజల్ అగర్వాల్
AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన సీత మూవీ మే 24వ తేదీ రిలీజ్ కానుంది. సీత మూవీ ప్రమోషన్స్ లో భాగంగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ 19 వ తేదీ విలేఖరుల సమావేశం లో పాల్గొన్నారు. పలువురు విలేఖరుల ప్రశ్నలకు ఈ విధంగా జవాబిచ్చారు.

ఈ వారం ఫిలింనగర్ విశేషాల సమాహారం
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే ఓపెనింగ్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్ , రిలీజస్ , రిజల్ట్స్ వంటి సమస్త విశేషాలను, వివరాలను మీ "దతెలుగుఫిలింనగర్.కాం" ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంది. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను విహంగ వీక్షణంగా అందించడం కోసం మేము చేస్తున్న తాజా ప్రయత్నమే" ఫిల్మ్ నగర్ లో ఈ వారం". ఏ రోజుకారోజు అందిస్తున్న విశేషాలను అప్పుడప్పుడు మిస్ అయినప్పటికీ ఈ వీక్లీ రౌండప్ లో ప్రధాన విషయాలను, సంఘటనలను మీ ముందు మరోమారు ఆవిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నమే "ఫిల్మ్ నగర్" లో ఈ వారం. సో.. ముందుగా ఈ శీర్షికలో ఈ వారంటాలీవుడ్ లో జరిగిన కొన్ని విశేషాలను మీ ముందు ఉంచుతున్నాం.

రామ్‌తో మరోసారి..?
యువ కథానాయకుడు రామ్‌కి కలిసొచ్చిన దర్శకులలో కిషోర్ తిరుమల ఒకడు. వీరిద్దరి తొలి కలయికలో వచ్చిన ‘నేను శైలజ’(2016) బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అనంతరం ‘ఉన్నది ఒకటే జిందగీ’(2017)తోనూ ఈ కాంబినేషన్ అలరించింది. ఈ నేపథ్యంలో… ముచ్చటగా మూడోసారి ఈ ద్వయం జట్టు కట్టనున్నట్టు టాలీవుడ్ టాక్.

2020లో మహేష్ డబుల్ ధమాకా?
కెరీర్ ఆరంభంలో పలు సంవత్సరాల్లో ఏడాదికి రెండు సినిమాలతో పలకరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు.. 2015 నుంచి ఏడాదికో చిత్రంతోనే సరిపెడుతున్నాడు. అయితే… 2020లో మాత్రం రెండు సినిమాలతో మరోసారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నాడట ఈ సూపర్ స్టార్.

ఉప్పెన మూవీ లో హీరోయిన్ గా తమిళ నటి
హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఉప్పెన మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై రూపొందనున్నఉప్పెన మూవీ షూటింగ్ మే 25 వ తేదీ ప్రారంభం కానుంది.

సత్య సాయి ఆర్ట్స్ ద్వారా NGK తెలుగు మూవీ
7/G బృందావన కాలనీ, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు సెల్వరాఘవన్, గజని, సింగం సిరీస్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక స్టైల్ ఏర్పరుచుకున్న సూర్య హీరోగా రూపొందించిన తమిళ మూవీ NGK మే నెల 31వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. రకుల్ ప్రీత్ సింగ్, సాయి పల్లవి కధానాయికలు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

లక్ష్మీ బాంబ్ హిందీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్
రాఘవ లారెన్స్ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ కాంచన మూవీ తెలుగు,తమిళ భాషలలో ఘనవిజయం సాధించింది. ఇప్పుడు కాంచన మూవీ హిందీలో రీమేక్ అవుతుంది. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, తుషార్ ఎంటర్ టైన్ మెంట్ హౌస్, షబానా ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై లారెన్స్ దర్శకత్వం లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా లక్ష్మీ బాంబ్ టైటిల్ తో రూపొందుతుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా , తమిళ హీరో మాధవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ స్టూడెంట్స్ తో "మహర్షి "
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన మహర్షి మూవీ 9వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. 17వ తేదీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థులతో మహేష్ బాబు ముచ్చటించారు. మహర్షి మూవీ గురించి, తాను నటించిన మూవీస్ గురించి, టాలీవుడ్ లో తన జర్నీ గురించి మహేష్ బాబు మాటల్లోనే ..

‘మన్మథుడు 2’లో సమంత పాత్ర అదేనా?
‘మన్మథుడు’… కింగ్ నాగార్జున కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచిన చిత్రం. 2002లో విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘మన్మథుడు 2’ తెరకెక్కుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.

దేవిశ్రీ స్థానంలో మిక్కీ జే మేయర్?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ చిత్రం ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ గ్యాంగ్ స్టర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోంది.

హిప్పీ మూవీ రెండవ లిరికల్ సాంగ్ విడుదల
భారీ బడ్జెట్ చిత్ర నిర్మాత కలైపులి S థాను నిర్మాణ సారథ్యం లో V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో కార్తికేయ నటించిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. దిగాంగన కథానాయిక కాగా, JD చక్రవర్తి ఒక కీలక పాత్ర లో నటించారు. హిప్పీ మూవీ కి నివాస్ K ప్రసన్న సంగీతంఅందించారు . హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, ట్రైలర్ మూవీ పై ఆసక్తిని కలిగించాయి.

మెగా స్టార్ చిరంజీవి సంతాప సందేశం
స్త్రీ మూవీ తో వెండి తెర కు పరిచయమయి హాస్యనటుడిగా, క్యేరెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతినాయకుడిగా తెలుగు, తమిళ భాషలలో సుమారు 850 సినిమాలలో నటించిన రాళ్ళపల్లి 17 వ తేదీ తుది శ్వాశ విడిచారు. 8000 పైగా నాటక ప్రదర్శనలు ఇచ్చిన రాళ్ళపల్లి సినిమా రంగం లోనే కాకుండా నాటక, టివి రంగాలలో కూడా తనదైన ముద్ర వేశారు. అరుదైన నటుడు రాళ్లపల్లికి సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

రెండు వారాలు... ఐదు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్
ఏప్రిల్ నెలలో వరుసగా మూడు వారాల పాటు తండ్రీకొడుకుల అనుబంధంతో రూపొందిన మూడు ఎమోషనల్ డ్రామాలు రిలీజ్ కాగా… మే నెల హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. కేవలం రెండు వారాల్లో ఐదు ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ రాబోతున్నాయి. అంతేకాదు… ఈ చిత్రాలన్నీ భిన్నమైన కథాంశాలతో తెరకెక్కినవే కావడం విశేషం. ఆ చిత్రాలే సీత, లిసా, నాగకన్య, అభినేత్రి 2, సువర్ణ సుందరి. వీటిలో రెండు స్ట్రయిట్ ఫిల్మ్స్ కాగా… మిగిలినవి అనువాద చిత్రాలు కావడం విశేషం.

నైట్ ఎఫెక్ట్ లో ఖైదీ తమిళ మూవీ
డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్ బ్యానర్ పై కార్తీ హీరోగా మానగరం వంటి సక్సెస్ ఫుల్ మూవీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ తమిళ మూవీ రూపొందుతుంది. హీరో కార్తీ ఖైదీ గా నటిస్తున్న ఖైదీ మూవీ నైట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. అందువల్ల దర్శకుడు సినిమా మొత్తం రాత్రి వేళలో తెరకెక్కించారు. ఖైదీ మూవీ షూటింగ్ 61 రాత్రులలో జరిగింది. ఈ మూవీ లో ఖైదీ పాత్ర లో నటిస్తున్న కార్తీ కి జోడిగా హీరోయిన్ లేకపోవడం విశేషం. శామ్ సి. ఎస్ సంగీతం అందించారు.