ప్రస్తుతం ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఆదిపురుష్ సినిమా ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో రామాయణం ఆధారంగా వస్తున్న సినిమా ఇది. ఈసినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అని అటు ప్రభాస్ అభిమానులు మాత్రమే కాదు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు మరో మూడు రోజుల్లో బ్రేక్ పడనుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్, జైశ్రీరామ్ సాంగ్ ఇంకా పలు అప్ డేట్లు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పిటికే స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అయిపోతున్నాయి. ఇక ఈసినిమాను అందరికీ చూపించాలన్న ఉద్దేశంతో ఇప్పటికే రణ్ బీర్ కపూర్, మంచు మనోజ్ లాంటి వాళ్లు ముందుకొచ్చి టికెట్లను కొని పేద పిల్లలకు, అనాధ పిల్లలకు చూపిస్తున్నారు. తాజాగా ఈసినిమా టికెట్ రేట్లపై మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. తెలంగాణ రాష్ట్రం లో సింగిల్ స్క్రీన్ లలో 50 రూపాయల టికెట్ పెంచుతున్నట్టు తెలిపారు. అంతేకాదు ఇది మొదటి మూడు రోజులకు వర్తించనుందని.. ఉదయం 4 గంటల షో నుండి ఆటలు ప్రారంభం కానున్నాయని ప్రకటన చేశారు.

కాగా 3డీ విజువల్ ఎఫెక్ట్స్ తో మైథలాజికల్ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోనున్న ఈసినిమాలో రాముని పాత్రలో ప్రభాస్ నటించగా.. సీతగా కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు. అలాగే లక్ష్మణుడి పాత్రలో బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్ నటిస్తున్నారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























