టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య నుండి ఈ ఏడాది వస్తున్న మొదటి సినిమా కస్టడీ. టాలెంటెడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెలుగు, తమిళ్ ద్విభాషా చిత్రంగా ఈసినిమా రానుంది. ఈసినిమాలో చైతు పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఈసినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ వీలైనంత ప్రమోషన్స్ తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే సీక్వెల్ పై కూడా అప్పుడే క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈసందర్భంగా మాట్లాడిన వెంకట్ ప్రభు కస్టడీ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పూర్తిగా తెలుగులోనే మాట్లాడతానని హామీ ఇచ్చారు. దీంతో కస్టడీ 2 పై అప్పుడే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఈసినిమా ఇంకా రిలీజ్ కాలేదు.. ఎలాంటి టాక్ వస్తుందో కూడా తెలియదు.. అయినా కూడా కస్టడీ 2 పై ఇప్పుడే హింట్ ఇచ్చారంటే ఈసినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారో అన్న విషయం అర్థమవుతుంది.
కాగా ఈసినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























