మల్టీస్టారర్ అయితే చరణ్ తో చేస్తా

akhil about multi starrer with ram charan

ప్రస్తుతం స్టార్ హీరోలు కూడా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. ఆమధ్య ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చూశాం. ఆర్ఆర్ఆర్ తరువాత కూడా చాలామందిలో మల్టీస్టారర్ చేయాలన్న ఆసక్తి పెరిగింది. దీనిలో భాగంగానే తనకు కనుక మల్టీస్టారర్ చేసే అవకాశం వస్తే చరణ్ తో చేస్తా అంటున్నాడు యంగ్ హీరో అఖిల్. ప్రస్తుతం అఖిల్ నుండి రిలీజ్ కు సిద్దంగా ఉన్న సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్ ఎంటర్ గా వస్తున్న సినిమా మరో రోజులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న అఖిల్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అఖిల్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఏజెంట్ యాక్షన్ మూవీ అయినప్పటికీ, దాని వెనుక బలమైన ఎమోషన్స్ ఉంటాయి. మనం లాంటి స్క్రిప్టులు తరచుగా చేయడం సాధ్యం కాదు. కావాలని అలాంటి ప్రయత్నాలు చేస్తే కాంబినేషన్ కి ఉన్న విలువ పోతుంది.. నేను మా అన్నయ్య కలిసి నటించడానికి అవకాశం ఉన్నా కథ ఇంతవరకూ దొరకలేదు. అలాంటి కథ కుదిరితే తప్పకుండా అన్నయ్యతో చేస్తాను. మల్టీ స్టారర్ సినిమాలను గురించి నేను ఆలోచించలేదు కానీ.. ఒకవేళ చేయవలసి వస్తే మాత్రం చరణ్ తో చేయడానికి ఇష్టపడతాను అంటూ తెలిపాడు. మరి చూద్దాం.. అఖిల్ కోరిక మేరకు చరణ్ తో కలిసి పనిచేసే అవకాశం వస్తుందేమో..

కాగా ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. హిప్ హాప్ తమీజా సంగీతం సమకూర్చారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.